వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి మద్దతు ప్రసక్తే లేదు: చత్తీస్‌గఢ్ ఎన్నికలపై అజిత్ జోగి

|
Google Oneindia TeluguNews

నయారాయపూర్: తాము ఎట్టి పరిస్థితుల్లోను బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని జేసీసీ చీఫ్ అజిత్ జోగి అన్నారు. చత్తీస్‌గడ్ ఎన్నికల్లో ఆయన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఆయన బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ మద్దతు కోరే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

శనివారం ఎన్నికల ప్రచారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరమైతే ప్రాణం తీసుకుంటానని, కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మాత్రం మద్దతు ఇవ్వనని చెప్పారు. అన్ని పవిత్ర గ్రంథాల మీద ప్రమాణం చేసి చెప్తున్నానని, బీజేపీతో మాత్ర పొత్తు పెట్టుకోనని, తాను ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా సిద్ధమేనని చెప్పారు.

Will Not Enter Alliance With BJP In Chhattisgarh Even in Dreams: JCC Chief Ajit Jogi

బీజేపీతో పొత్తు ఆలోచన లేదన్నారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందన్నారు. అంతకుముందు, అజిత్ జోగి మాట్లాడుతూ... రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చనని, ఎవరూ దేనిని నిర్దేశించలేరని, ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవడం కాస్త కష్టంతో కూడకున్న పని అని చెప్పారు.

English summary
Chhattisgarh politician Ajit Jogi's "anything is possible" turned into a hard "Kadaapi nahi (absolutely not)" today when he was asked, in the presence of alliance partner Mayawati this time, about the possibility of teaming up with the BJP in the event of a fractured verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X