వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో ఏ ఒక్క వలసదారునికి చోటు లేదు, ఎన్ఆర్సీ జాబితా సక్రమమేనన్న అమిత్ షా

|
Google Oneindia TeluguNews

డిస్పూర్ : దేశంలో ఏ ఒక్క వలసదారుడుకి చోటు లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జాతీయ పౌరసత్వ రిజిష్టార్ (ఎన్ఆర్‌సీ)లో అర్హులకు మాత్రమే చోటు లభించిందని .. అనర్హులు ఒక్కరు కూడా లేరని స్పష్టంచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరి పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ అంవంపై రాజకీయ దుమారం నెలకొన్న నేపథ్యంలో అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.

నేను కూడా ఫైన్ కట్టాను.. కొత్త మోటారు వాహన చట్టం ఫైన్‌లపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీనేను కూడా ఫైన్ కట్టాను.. కొత్త మోటారు వాహన చట్టం ఫైన్‌లపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

బీజేపీ నార్త్ ఈస్ కౌన్సిల్ (ఎన్ఈసీ) 68వ ప్లీనరీ సమావేశం ఆదివారం అసోంలో జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్సీ జాబితాపై కొందరు మెమోరాండం సమర్పించారు. మరికొందరు వివాదాస్పదంగా ఉందని, తమ పేర్లు లేవని అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు.

Will not let even one single immigrant stay in India: Amit Shah

దీనిపై బీజేపీ అసోం అధ్యక్షుడు రంజిత్ దాస్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టు దేశంలో ఒక వలసదారుడు ఉండేందుకు అనుమతించబోమని తేల్చిచెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే తమకు బీజేపీ చీఫ్ అమిత్ షా దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. 1971కి ముందు దేశంలోకి వచ్చిన వారికి అన్నివిధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. వారిని తమ దేశ పౌరులలాగానే చూస్తామని సంకేతాలిచ్చారు.

English summary
BJP national president Amit Shah on Sunday assured the Assam unit of the party that measures will be taken to ensure that no illegal immigrant finds a place in the National Register of Citizens (NRC). After submitting a memorandum to Shah, who is also the Union Home Minister, at the venue of the 68th Plenary Session of the North East Council (NEC) here, the party's state unit president Ranjit Dass told reporters that they had discussed "anomalies in the contentious NRC" with the party national president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X