
అంగుళం భూమి కూడా వదులుకోం: ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే
పైకి బానే ఉన్నా.. లోన కుళ్లు, కుతంత్రంతో ఉంటుంది చైనా.. డ్రాగన్ వైఖరిని కనిపెట్టడం కష్టమే. ఇక భారత్ విషయానికి వస్తే మాత్రం మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. దానికి ఇండియన్ ఆర్మీ తగినరీతిలో సమాధానం చెబుతుంది. ఇటీవల లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే భారత ఆర్మీ నూతన చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. సైన్యం వైఖరిని స్పష్టం చేశారు.
ఇండో-చైనా సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. భారత్-చైనా సరిహద్దులో ఇప్పుడున్న స్థితిని మార్చడానికి ఏమాత్రం అంగీకరించబోమని కుండబద్దలు కొట్టారు. ఇదే తమ వైఖరి ఇదేనని స్పష్టంచేశారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు.

చైనాతో సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించామని తెలిపారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించామని వివరించారు. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య జరుగుతుంది సంప్రదాయ యుద్ధమేనని అభిప్రాయపడ్డారు. భారత్ విషయానికొస్తే దేశీయంగా తయారైన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాకు గట్టి సందేశం ఇచ్చారు. ఎల్ఏసీ వద్ద పహారా కొనసాగుతుందని.. తమ భూమి ఇచ్చేందుకు సిద్దంగా లేమని స్పష్టంచేశారు.