వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్ : కాంగ్రెస్ కనీస ఆదాయం పథకం నుంచి భత్యంగా భార్యకు ఇస్తాడట

|
Google Oneindia TeluguNews

భోపాల్ : బీజేపీ కాంగ్రెస్‌ల మధ్య సంక్షేమ పథకాలు పోటీ జరుగుతోంది. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 6వేలును అధికార బీజేపీ ఇస్తుంటే తాము అధికారంలోకి వస్తే కనీస ఆదాయం పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే కాంగ్రెస్ ఇంకా అధికారంలోకి రాలేదు కానీ అప్పుడే ఓ పెద్దమనిషి విడాకులు తీసుకున్న భార్యకు మాత్రం కాంగ్రెస్ ఇచ్చే కనీస ఆదాయ పథకంకు సంబంధించి రూ. 6వేలు మెయింటెనెన్స్‌కింద విడిపోయని భార్యకు బిడ్డకు ఇస్తానని కోర్టుకు తెలిపాడు.

Will pay maintenance money to wife with Rahul Gandhis Nyay Scheme: Jobless Man to Court

ఇండోర్‌లో ఆనంద్ శర్మ అనే వ్యక్తి తన భార్య దీపమాలతో విడిపోవాలని భావించి విడాకుల కోసం స్థానిక ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఇద్దరి మధ్య వాదనలు విన్న న్యాయస్థానం చివరకు విడాకులు మంజూరు చేసేందుకు అంగీకరించింది. అయితే భార్యను ఎలా పోషిస్తావని ప్రశ్నించింది. అంతేకాదు భార్య దీపమాలకు నెలకు రూ. 3వేలు, కూతురు ఆర్యకు రూ. 1500 ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆనంద్ శర్మ నిరుద్యోగి కావడంతో అంత డబ్బులు ఇచ్చుకోలేనని కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నాడు.

కళ్యాణం కమనీయం జీవితం: దేశంలోనే తొలిసారిగా ఈ మహిళలకు వివాహంకళ్యాణం కమనీయం జీవితం: దేశంలోనే తొలిసారిగా ఈ మహిళలకు వివాహం

కోర్టు ఆదేశాలను ధిక్కరించాలన్న ఉద్దేశం తనది కాదని అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ఇస్తామంటున్న కనీస ఆదాయం పథకం కింద రూ. 6వేలు నుంచి విడిపోయిన తన భార్య, బిడ్డకు నెలకు రూ. 4500 ఇస్తానని కోర్టుకు తెలిపాడు. అంతేకాదు నేరుగా తన భార్య అకౌంటుకు ఆ డబ్బులు బదిలీ అయ్యేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని తన దరఖాస్తులో కోరాడు. కోర్టు తన అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిందని ఆనంద్ శర్మ తరపున వాదించిన లాయరు చెప్పాడు. తిరిగి ఏప్రిల్ 29కి కేసును వాయిదా వేసినట్లు లాయరు తెలిపారు.

ఆనంద్, దీప్‌మాలాలు 2006 వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత వారిద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో దీపమాల కోర్టును ఆశ్రయించింది. ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు ఇస్తున్న రూ.6వేలకు ధీటుగా కాంగ్రెస్ కనీస ఆదాయం పథకం కింద అర్హులైన పేదవారికి రూ. 6వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. దీని వల్ల దేశవ్యాప్తంగా 22 నుంచి 25 శాతం పేద ప్రజలు లబ్ధిపొందుతారని వెల్లడించింది.

English summary
While the BJP and Congress continue to have heated exchanges over Rahul Gandhi’s announcement of minimum income guarantee scheme, a man on Friday told a local family court in Indore that he will pay maintenance to his estranged wife and daughter with the money he gets from the Congress' proposed Nyuntam Aay Yojana (NYAY).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X