వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ నరేంద్ర మోడీ!: గెలిపించండి.. వద్దు.. 2019 ఎన్నికల కోసం యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫైట్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేడు (ఆదివారం) సాయంత్రం సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. ఈ రెండు నెలలు ఎన్నికల వేడి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని ఓడించేందుకు దశాబ్దాల రాజకీయ వైరం ఉన్న రాజకీయ పక్షాలు కూడా ఒక్కటవుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు జతకట్టడమే ఉందుకు ఉదాహరణ. అలాగే, 2014 ఎన్నికలకు ముందు యూనివర్సిటీలలోని పలువురు ప్రొఫెసర్లు మోడీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు మోడీకి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయినట్లుగా కనిపిస్తున్నాయి.

ఎన్ని దోమలు చనిపోయాయో లెక్కిస్తానా?: విపక్షాలకు వీకే సింగ్, డిగ్గీరాజాపై ఆగ్రహంఎన్ని దోమలు చనిపోయాయో లెక్కిస్తానా?: విపక్షాలకు వీకే సింగ్, డిగ్గీరాజాపై ఆగ్రహం

మోడీ కోసం అకడమిక్స్ ఫర్ నమో

మోడీ కోసం అకడమిక్స్ ఫర్ నమో


2019 లోకసభ ఎన్నికల్లో నరేంద్ర మోడీని తిరిగి ప్రధానిగా చేయాలని కోరుకుంటూ దాదాపు 300 మంది వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ ఓ సమూహంగా ఏర్పడ్డారు. Academics4NaMo (అకడమిక్స్ ఫర్ నమో) పేరుతో వీరంతా ఏకతాటి పైకి వచ్చారు. రెండోసారి మోడీయే రావాలని వీరు పిలుపునీయనున్నారు. వీరంతా గత మంగళవారం నాడు ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో సమావేశమయ్యారు. మోడీకి వ్యతిరేక గళం వినిపించే వారికి సరైన విధంగా కౌంటర్ ఇవ్వాలని వీరు నిర్ణయించారు. వీరు మార్చి 14, 15 తేదీల్లో మరోసారి భేటీ కానున్నారు.

మోడీకి వ్యతిరేకంగా గ్రూప్

మోడీకి వ్యతిరేకంగా గ్రూప్

2014లో పలువురు ప్రొఫెసర్లు మోడి ప్రధాని కాకూడదని ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు Academics4NaMo ఏర్పడి మోడీకి అనుకూలంగా పని చేయనుంది. దీంతో, మోడీ వ్యతిరేక ప్రొఫెసర్లు కూడా రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది. ఈ అంశంపై జేఎన్‌యూ ప్రొఫెసర్ అరునిమ శనివారం ఈ మేరకు మోడీ అనుకూల వర్గ ప్రొఫెసర్లకు కౌంటర్‌గా మోడీ వ్యతిరేక ప్రొఫెసర్ల నుంచి ఆన్‌లైన్ ద్వారా మద్దతు కోరారు.

మోడీ ఏం చేశారో చెబుతారు

మోడీ ఏం చేశారో చెబుతారు

గత డెబ్బై ఏళ్ల కాంగ్రెస్ పాలనకు, ఈ అయిదేళ్ల నరేంద్ర మోడీ పాలనకు తేడాను తాము చూపిస్తామని అకడమిక్స్ ఫర్ నమో (మోడీ మద్దతుదారు గ్రూప్) కోర్ కమిటీ మెంబర్ స్వదేశ్ సింగ్ చెబుతున్నారు. ఈ అయిదేళ్లలో ఏం సాధించారో చెబుతామన్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఎన్డీయే గెలుస్తుందని, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్లతో పాటు జర్నలిస్టులు, కాలమిస్టులు, మేధావులు తదితరుల సహకారం తీసుకోనున్నారు. అలాగే, భారతదేశ చరిత్రలో మోడీ అయిదేళ్ల పాలనన దుర్మార్గమైనదని మోడీ వ్యతిరేకులు చెబుతున్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తామని అంటున్నారు.

2014లోను ఇలాగే ప్రయత్నించారు

2014లోను ఇలాగే ప్రయత్నించారు


మోడీ వ్యతిరేక గ్రూప్ అంశంపై ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రకాశ్ సింగ్ మాట్లాడుతూ... మోడీకి వ్యతిరేకంగా అలాంటివారు గళమెత్తడం ఇదే మొదటిసారి కాదని, 2014లోను ఇలాగే చేశారని, మోడీపై దారుణమైన వ్యతిరేకత కల్పించే ప్రయత్నాలు చేశారని, ఇప్పుడు కూడా అదే వ్యక్తులు రెండోసారి ఆయన ప్రధాని కాకుండా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారని, కాబట్టి ఈ అయిదేళ్లలో మోడీ చేసిన మంచిని అందరి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు.

English summary
With Lok Sabha elections inching closer, over 300 professors and research scholars from various universities across cities came together this week to launch 'Academics4NaMo' – a campaign to bring Narendra Modi back for a second term as Prime Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X