వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏ ద్వారాలు తెరిచే ఉన్నాయి..ఎవ‌రొచ్చినా స్వాగ‌తిస్తాం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలో వ‌రుస‌గా రెండోసారి అధికారాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌క‌టించింది. ఎన్నిక‌ల్లో 300ల‌కు పైగా స్థానాల‌ను సాధించ‌బోతున్నామ‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ వెల్ల‌డించారు. ఎన్నిక‌ల‌కు ముందు (ప్రీపోల్‌) పొత్తు కుదుర్చుకున్న‌, సీట్ల‌ను స‌ర్దుబాటు చేసుకున్న పార్టీలతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ- దేశంలోని ఏ రాజ‌కీయ పార్టీ అయినా స‌రే..ఎన్డీఏ కూట‌మిలో చేరడానికి ఏ పార్టీ ముందుకు వ‌చ్చినా స్వాగ‌తిస్తామ‌ని అన్నారు. ఆయా పార్టీల కోసం ఎన్డీఏ ద్వారాలు తెరిచే ఉన్నాయ‌ని చెప్పారు.

శుక్ర‌వారం తుది ద‌శ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌డానికి రెండు గంట‌ల ముందు- దేశ రాజ‌ధానిలోని బీజేపీ కేంద్ర కార్యాల‌యంలో అమిత్ షా, న‌రేంద్ర మోడీ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. 2014 మేలో ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన త‌రువాత న‌రేంద్ర మోడీ ఓ విలేక‌రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం చెప్పుకోద‌గ్గ విష‌యం.

ఎన్నిక‌ల స‌భ‌లు, రోడ్ షోలు, ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ఎద‌రైన అనుభ‌వాల‌ను పంచుకున్నారు. అయిదేళ్ల మోడీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల గురించి మాట్లాడారు. పొత్తుతో సంబంధం లేకుండా.. సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన వాటి కంటే అధిక స్థానాల‌ను గెలుచుకుంటామ‌ని అమిత్ షా అన్నారు. 300ల‌కు పైగా సీట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేశామ‌ని, అవి ఎప్పుడూ త‌ప్ప‌వ‌ని చెప్పారు.

మాపై నిందలు వేస్తున్నారు..

మాపై నిందలు వేస్తున్నారు..

ప‌శ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న హింసాత్మ‌క ప‌రిస్థితుల‌కు త‌మ‌ను బాధ్యుల‌ను చేయ‌డం స‌రికాద‌ని అమిత్ షా అన్నారు. ఒక్క ప‌శ్చిమ బెంగాల్‌లోనే 80 మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు హ‌త్య‌కు గుర‌య్యార‌ని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లోనూ తాము ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నామ‌ని, అక్క‌డ చెల‌రేగ‌ని హింస ప‌శ్చిమ బెంగాల్‌లోనే ఎందుకు జ్వ‌లిస్తోంద‌ని చెప్పారు. అధికారంలోకి రావ‌డానికి తాము హింసాత్మ‌క ప‌రిస్థితుల‌ను సృష్టించాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. కోల్‌క‌త‌లో హింసాత్మ‌క ప‌రిస్థితులు ఏర్ప‌డ‌టానికి బాధ్యులు ఎవ‌రనేది దేశ ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని అమిత్ చెప్పారు.

చిట్ట‌చివ‌రి వ్య‌క్తికి సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ది..

చిట్ట‌చివ‌రి వ్య‌క్తికి సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ది..

ఈ అయిదేళ్ల కాలంలో 1033 సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశామ‌ని మోడీ, అమిత్ షా చెప్పారు. మ‌హిళ‌లు, వృద్ధులు, పిల్ల‌లు, బాలిక‌లు, కార్మికులు, ఉద్యోగులు, పారిశ్రామిక‌వేత్త‌లు, రైతులు,ద‌ళితులు, గిరిజ‌నులు, ఆదివాసీలు.. ఇలా స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌నూ దృష్టిలో పెట్టుకుని సంక్షేమ ప‌థ‌కాల‌ను రూపొందించామ‌ని, స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేశామ‌ని అన్నారు. ఆర్థిక‌, సామాజిక రంగాల్లో ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు స్వ‌యం స‌మృద్ధి క‌లిగించ‌డానికి శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేశామ‌ని చెప్పారు. మ‌రిన్ని సంక్షేమ ప‌థ‌కాల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని, ఇదివ‌ర‌కే వాటిని ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పొందుప‌రిచామ‌ని చెప్పారు. స‌మాజంలో చిట్ట చివ‌రి వ్య‌క్తికి సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిని క‌లిగించ‌డ‌మ‌నే ఏకైక ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నామ‌ని అన్నారు.

అవినీతి, ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌స్తావ‌న లేని ఎన్నిక‌లు..

అవినీతి, ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌స్తావ‌న లేని ఎన్నిక‌లు..

ఈ సారి ఎన్నిక‌ల్లో కొన్ని ప్ర‌త్యేక‌త‌లు క‌నిపించాయ‌మ‌ని అన్నారు. అవినీతి, ధ‌ర‌ల పెరుగుద‌ల.. ఈ రెండు అంశాల‌ను ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌స్తావించ‌లేక‌పోయాయ‌ని చెప్పారు. ఇలాంటి సంద‌ర్భం రావ‌డం దేశంలో ఇదే తొలిసారి అని అన్నారు. ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను పూర్తిగా నియంత్రించామ‌ని, అవినీతికి అడ్డుక‌ట్ట వేయ‌గ‌లిగామ‌ని అందుకే ప్ర‌తిప‌క్షాలు ఈ రెండు అంశాల‌ను ప్రస్తావించ‌లేక‌పోయాయ‌ని చెప్పారు. దేశ భ‌ద్ర‌త విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు విఫ‌లం అయ్యాయ‌ని, అందుకే- దాన్ని కూడా త‌మ ఎన్నిక‌ల ప్ర‌చారాస్త్రాలుగా మ‌ల‌చుకోలేక‌పోయాయ‌ని వారు ఎద్దేవా చేశారు. ఇలా.. ఏ ఒక్క అంశంలోనూ త‌మ‌పై విమ‌ర్శ‌లు సంధించే అవ‌కాశాన్ని ప్ర‌తిప‌క్షాల‌కు ఇవ్వ‌లేద‌ని చెప్పారు.

120 స్థానాల్లో 80 గ్యారంటీ..

120 స్థానాల్లో 80 గ్యారంటీ..

స్వ‌తంత్ర భార‌త‌దేశంలో బీజేపీ ఇప్ప‌టిదాకా గెల‌వ‌లేని 120 లోక్‌స‌భ స్థానాలు ఉన్నాయ‌ని, ఈ సారి వాటిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌ని అన్నారు. ఈ 120 స్థానాల్లో క‌నీసం 80 చోట్ల విజ‌యం సాధిస్తామ‌ని చెప్పారు. దేశంలో మోడీ ప్ర‌భంజనం వీస్తోంద‌ని, దీన్ని ఎవ‌రూ అడ్డుకోలేర‌ని అన్నారు. మ‌రోసారి మోడీ ప్రధాని కావాల‌ని దేశ ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా కోరుకుంటున్నార‌ని చెప్పారు. మై భీ చౌకీదార్ అనే టీష‌ర్టులు ధ‌రించి స్వ‌చ్ఛందంగా, ఎలాంటి లాభాపేక్ష‌ను ఆశించ‌కుండా పార్టీ అభ్య‌ర్థుల విజ‌యం కోసం కృషి చేశార‌ని అన్నారు.

ఏసీ గ‌దుల్లో కూర్చోలేదు..

ఏసీ గ‌దుల్లో కూర్చోలేదు..


ఎన్నిక‌ల సంద‌ర్భంగా న‌రేంద్ర మోడీ 15 ల‌క్షల కిలోమీట‌ర్ల మేర ప్ర‌యాణం సాగించార‌ని, సుమారు కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను ఆయ‌న క‌లుసుకున్నార‌ని అమిత్ షా చెప్పారు. ఢిల్లీలో ఏసీ గ‌దుల్లో కూర్చుని తాము ఎన్నిక‌ల ప్రచారం చేయ‌లేద‌ని అన్నారు. 46 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లో మోడీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌సంగించార‌ని అన్నారు. అలాగే 18 డిగ్రీల క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లోనూ ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల‌ను కొన‌సాగించార‌ని చెప్పారు. త‌న అయిదేళ్ల ప‌రిపాల‌న‌లో అనేక మ‌లుపులు, ఎత్తు ప‌ల్లాలు చ‌వి చూశానని అన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు త‌న‌ వెంట నిలిచారని, మ‌రోసారి ఆశీర్వ‌దిస్తార‌ని ఆశిస్తున్నాన్న‌ట్లు మోడీ చెప్పారు.

English summary
In his first ever joint presser ever since he assumed charge in 2014, Prime Minister Narendra Modi on Friday exuded confidence that the BJP will return to power with a bigger mandate. “It will happen after a long time in the country, our government will return to power with an absolute majority for the second consecutive time,” he said. The Prime Minister, however, did not take any questions from journalists. BJP chief Amit Shah, who was also present at the meeting, reiterating the Prime Minister’s claims. He said, “We will come back with a much bigger majority.” Shah also lauded party workers over their efforts in the poll campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X