వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రచారం: సచిన్, షారుక్‌పై కన్ను, సౌత్‌లో చిరు(పిక్చర్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌ను, బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్‌లను పార్టీలోకి తీసుకు వచ్చి ప్రచారానికి ఉపయోగించుకోవాలనే చర్చ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీలో సాగుతోంది. వీరితో పాటు ప్రముఖ నటి రేఖ, రాజ్ బబ్బర్, భారత క్రికెట్ మాజీ సారథి అజహరుద్దీన్‌లను కూడా పార్టీ ప్రచారానికి ఉపయోగించుకునే విషయమై చర్చ జరిగింది.

వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం ప్రజాదరణ ఉన్న క్రికెటర్లను, సినిమా స్టార్లను ప్రచారానికి ఉపయోగించుకోవాలని కాంగ్రెసు పార్టీ భావిస్తోందట. అందులో భాగంగా స్టార్ ప్రచారకర్తల లిస్టులో పలువురి పేర్లు ఉన్నాయి. అయితే, సచిన్ వంటి వారు రాజకీయ పార్టీలకు ప్రచారం చేసేందుకు ఏ మేరకు ముందుకు వస్తారనేది అనుమానమే.

సచిన్ టెండుల్కర్, రేఖలను కొద్ది నెలల క్రితం రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అజహరుద్దీన్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఆయనను హైదరాబాదు నుండి ఎంపీగా బరిలోకి దింపే అవకాశాలున్నాయని గతంలో ప్రచారం సాగింది. మరోవైపు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి దక్షిణాదిన తమకు ప్రధాన ప్రచారకర్తగా ఉండగలరని కాంగ్రెసు పార్టీ భావిస్తోంది.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌ను వచ్చే ఎన్నికల ప్రచారానికి ఉపయోగించునే విషయమై కాంగ్రెసు పార్టీలో చర్చ సాగుతోందట. ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన సచిన్ రాజకీయ పార్టీలకు ఏ మేరకు ప్రచారం చేస్తారనేది అనుమానమే.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌ను కూడా 2014 ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని అధికార కాంగ్రెసు పార్టీ భావిస్తోందట.

రేఖ

రేఖ

బాలీవుడ్ నటి రేఖను ప్రచార కమిటీలో భాగస్వామిని చేయాలని అధికార కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. ఇటీవలె రేఖ సచిన్‌తో పాటు రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

 అజహరుద్దీన్

అజహరుద్దీన్

భారత క్రికెట్ మాజీ సారథి అజహరుద్దీన్ కాంగ్రెసు పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. మైనార్టీలను మరింతగా తమ వైపుకు ఆకర్షించేందుకు ఈయనను ప్రచారంలోకి దింపాలని కాంగ్రెసు పార్టీ భావిస్తోందట.

చిరంజీవి

చిరంజీవి

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని దక్షిణాదిన స్టార్ కంపెయినర్‌గా కాంగ్రెసు పార్టీ భావిస్తోందట. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో ఆయన జోరుగా ప్రచారం చేశారు.

English summary
Will Sachin and Shahrukh compaign for Congress?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X