సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ: గోవా సీఎంగా పారికర్‌కు లైన్ క్లియర్
గోవా ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి మనోహర్ పారికర్ మంగళవారం ప్రమాణం చేయాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
పనాజీ/న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బలం ఎక్కడుందని కాంగ్రెస్ పార్టీని సుప్రీం ప్రశ్నించింది. ప్రభుత్వ ఏర్పాటుకు బలముంటే గవర్నర్ ను ఎందుకు కలవలేదని నిలదీసింది. సంఖ్యా బలంతో మొదట గోవా గవర్నర్ వద్దకు వెళ్లాలని సూచించింది. పిటిషన్ వేయడంపై కాంగ్రెస్ పార్టీపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలతో మధ్యాహ్నం 1.30గంటలకు గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమైంది. కాగా, సుప్రీం కోర్టుకు బీజేపీకి కూడా పలు సూచనలు చేసింది. వెంటనే బలపరీక్ష నిర్వహించాలని సూచించింది. ప్రొటెం స్పీకర్ పేరును ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీలను ఆదేశించింది.
సీఎంగా ప్రమాణానికి గ్రీన్ సిగ్నల్
అంతేగాక, మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా మంగళవారం ప్రమాణం చేసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. బల నిరూపణ గురువారం(మార్చి 16) నిరూపించుకోవాలని ఆదేశించింది.

కాంగ్రెస్ పిటిషన్ ఇది..
గోవా ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి మనోహర్ పారికర్ మంగళవారం ప్రమాణం చేయాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుతో గోవాలో ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత వచ్చింది.
సుప్రీంకోర్టు కాంగ్రెస్ పిటిషన్‌పై మంగళవారం ఉదయం 10.30గంటలకు విచారించింది. కాగా, గోవా ముఖ్యమంత్రిగా మంగళవారం సాయంత్రం 5గంటలకు మనోహర్ పారికర్ ప్రమాణం చేయనున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications