చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Solar eclipse 2020: కరోనా వైరస్‌కు చెక్ ఇలా..? ఏడాదిలో డెడ్‌లైన్, శాస్త్రవేత్త ఏ చెప్పారంటే..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ ఆవిర్భావంపై క్లారిటీ లేదు. కానీ వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ లోపు ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకినవారు చనిపోతూనే ఉన్నారు. కానీ వైరస్ గురించి రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. తమిళనాడుకి చెందిన న్యూక్లియర్ అండ్ ఎర్త్ సైంటిస్ట్ డాక్టర్ సుందర్ కృష్ణ మాత్రం ఈ ఏడాదిలో కరోనా వైరస్ అంతమవుతోందని ధీమాగా చెబుతున్నాడు. అందుకు గల కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.

Recommended Video

Coronavirus To End On June 21 Solar Eclipse 2020, Scientist Claims!
సూర్యగ్రహణంతోనే...

సూర్యగ్రహణంతోనే...


కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లో గతేడాది డిసంబర్‌లో బయటపడింది. అయితే సూర్య గ్రహణం సమయంలోనే వైరస్ ఆవిర్భవించిందని సుందర్ కృష్ణ చెబుతున్నారు. గ్రహణం తర్వాత విడుదలయ్యే శక్తి వల్ల తొలి న్యూట్రాన్ పరివర్తణ చెంది కణ సంక్రమణ తర్వాత కరోనావైరస్ ప్రభావం మొదలైందని చెప్పారు. డిసెంబర్ 26వ తేదీ తర్వాత సౌర వ్యవస్థలో కొత్త అమరికతో గ్రహ ఆకృతీకరణ జరిగిందని అంచనా వేశారు. సూర్యగ్రహణం రోజునే వైరస్ ఆవిర్భవించినందున.. సూర్యగ్రహణం రోజునే అంతమవుతోందని వివరించారు.

ఇలా వ్యాప్తి..

ఇలా వ్యాప్తి..

ఇంటర్ ప్లానెటరీ పోర్స్ వైవిధ్యత వల్ల సూర్యరశ్మి నుంచి వైరస్ వ్యాపించిందని, వైరస్ వ్యాప్తికి భూమి అనుకూలమైన ప్రాంతం అని తెలిపారు. వాతావరణంలో బయో న్యూక్లియర్ ఇంటరాక్షన్ వల్ల జీవాణువుల నిర్మాణం వల్ల వైరస్ వ్యాపించిందనన్నారు. 2020 ఏడాదిలో వచ్చే సూర్యగ్రహణంతోనే వైరస్ అంతమవుతోందని పేర్కొన్నారు. సూర్యుని నుంచి వచ్చిన కాంతి తరంగాలు.. క్రమంగా అలానే నాశనమయ్యే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.

భయపడొద్దు

భయపడొద్దు


గ్రహణాలు, వైరస్ ఆవిర్భావాలు సహజంగా ఏర్పడే ప్రక్రియ అని సుందర్ కృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు ఎప్పుడో చెప్పాడని పేర్కొన్నారు. సహజమైన ప్రక్రియను చూసి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అని సూచించారు. సూర్యరశ్మి, సూర్యగ్రహణం ద్వారా వైరస్‌ను సమూలంగా నివారిస్తోందని తెలిపారు. మరీ శాస్త్రవేత్త అభిప్రాయాన్ని.. ఇతర నిపుణులు ఏమంటారో చూడాలి మరీ.

English summary
Solar eclipse 2020: scientist Dr KL Sundar Krishna in Chennai has claimed that there is a connection of COVID-19 outbreak with December 26 solar eclipse that happened last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X