• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆమె కత్తిలా ఉంటుంది: మాజీ మంత్రిపై మాజీ సీఎం హాట్ కామెంట్స్: ప్రియాంకా గాంధీని ఆ మాట అనగలవా?

|

భోపాల్: కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి ప్రతిపక్షం అవసరం ఉండదు.. కాంగ్రెస్‌కు కాంగ్రెస్సే ప్రతిపక్షం అనే విషయం రాజకీయాల్లో అందరికీ తెలిసిన విషయమే. సింపుల్‌గా చెప్పుకోవాలంటే తన గొయ్యిని తానే తవ్వుకుంటుందనేది దాని సారాంశం. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. తాజాగా మరో ఉదంతం.. కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తోంది. పైగా ఉప ఎన్నికల వేళ ఇది తెరమీదికి రావడం ఆ పార్టీకి సరికొత్త ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపించడం ఖాయమనే అభిప్రాయాన్ని కల్పిస్తోంది.

బీజేపీ మహిళా నేతపై..

బీజేపీ మహిళా నేతపై..

కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి ఇమర్తి దేవిపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఐటంగా అభివర్ణించారు. కత్తిలా ఉంటుందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోొ 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ప్రచార సభలో కమల్‌నాథ్ బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల రాజకీయ చిచ్చు రాజుకుంది. డబ్రా నియోజకవర్గానికి నిర్వహించనున్న ఉప ఎన్నిక ప్రచారంలో కమల్‌నాథ్ పాల్గొన్నారు. ఇదే స్థానం నుంచి బీజేపీ తరఫున ఇమర్తీ దేవి పోటీ చేస్తున్నారు.

సాదాసీదా నేతను పోటీలో దింపాం..

సాదాసీదా నేతను పోటీలో దింపాం..

డబ్రా నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తాము సాదాసీదా అభ్యర్థిని నిలబెట్టామని, బీజేపీ మాత్రం ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో ఐటమ్‌ను బరిలోకి దింపిందని అన్నారు. ఆమె పేరు ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆమె ఎవరనేది తన కంటే ఓటర్లకే బాగా తెలుసునీ చెప్పారు. దీనితో బహిరంగ సభలో పాల్గొన్న వారు ఇమర్తీ దేవి అంటూ గట్టిగా అరిచారు. దాన్ని కొనసాగిస్తూ కమల్‌నాథ్- మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఆమె కత్తిలా ఉంటుందని మరోసారి చెప్పుకొచ్చారు.

ప్రియాంకా గాంధీని ఆ మాట అనగలవా?

ప్రియాంకా గాంధీని ఆ మాట అనగలవా?

కమల్‌నాథ్ తనపై చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఇమర్తీ దేవి భగ్గుమంటున్నారు. తనపై అలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కమల్‌నాథ్‌ను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లో నివసించడానికి కమల్‌నాథ్‌కు అర్హత లేదని విమర్శించారు. పేద కటుంబంలో జన్మించిన తాను మంత్రి స్థాయికి ఎదగడమే తాను చేసిన తప్పా? అంటూ విరుచుకుపడుతున్నారు. ఇవే వ్యాఖ్యలను కమల్‌నాథ్.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను ఉద్దేశించి అనగలరా? అని సవాల్ విసిరారు. కమల్‌నాథ్‌ను పార్టీ నుంచి తొలగించేంత వరకూ ఊరుకోబోనని హెచ్చరించారు.

మధ్యప్రదేశ్ ఆడబిడ్డలను అవమానించారంటూ

మధ్యప్రదేశ్ ఆడబిడ్డలను అవమానించారంటూ

కమల్‌నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు.. ఒక్క ఇమర్తిదేవిని ఉద్దేశించిన చేసినవి కావని, మధ్యప్రదేశ్‌లో ప్రతి ఆడబిడ్డకూ వర్తిస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభిప్రాయం ఉందనేది దీనితో స్పష్టమైందని విమర్శించారు. కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా చేస్తామనీ శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.

English summary
Shortly after Congress leader Kamal Nath’s objectionable remark against her, BJP leader and Madhya Pradesh minister Imarti Devi on Sunday appealed to Congress chief Sonia Gandhi to remove him from her party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X