వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్ ,డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం ఎన్డీఏ పై ఉంటుందా ?

|
Google Oneindia TeluguNews

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెట్రోల్ ,ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందా ? యూపిఏ తరహాలోనే ఎన్డీఏ పై ఓటర్లు ప్రభావం చూపించనున్నారా ? అయిదు సంవత్సరాలకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికలపై వీటి ప్రభావం ఏమేరకు ఉంటుంది..

 ఎమ్మెల్యేల ఫిరాయింపుల్లో కేసీఆర్ ప్రమేయం..! లోక్‌పాల్‌లో ఫిర్యాదుకు కాంగ్రెస్ రెడీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల్లో కేసీఆర్ ప్రమేయం..! లోక్‌పాల్‌లో ఫిర్యాదుకు కాంగ్రెస్ రెడీ

 గతంలో యూపిఏ పై ప్రభావం చూపిన ధరలు

గతంలో యూపిఏ పై ప్రభావం చూపిన ధరలు

ప్రధానంగా ఎన్నికలపై నిత్యవసర ధరల పెరుగుదల ప్రభావం ఉంటుంది.వీటిలో ముఖ్యంగా నిత్యవసర ధరలను ప్రభావితం చేసే డీజిల్ ,పేట్రోలు ధరలు కూడ ఎన్నికలపై వీపరీత ప్రభావం చూపుతాయి.ఇందుకు అనుగుణాంగానే 2014 ఎన్నికల్లో మోడి మానియాతోపాటు పేట్రోల్ ధరల పెరుగుదల ప్రభావం చూపింది.దీంతో యూపిఏ సర్కారు ఘోరంగా ఓడిపోయింది. కాగా యూపిలో ధరల పెరుగుదలు పరీశీలిస్తే, 2012 లో మేలో పెట్రోల్ ధర లీటర్ కు రూ.77.57 కు చేరుకోగా 2013 లో రూ 83 .63 లను తాకింది. దీంతో యూపిఏ ఓడిపోవడానికి పెరిగిన పెట్రోల్ ధరలు కూడ కారణమయ్యాయి.

ఏన్డీయో హయంలో కూడ పేరుగుదల,

ఏన్డీయో హయంలో కూడ పేరుగుదల,

తాజగా ఏన్డీఏ కూడ అదే పరిస్థితిలో ఉంది. 2017 అక్టోబర్ లో పెట్రోల్ ధర రూ.80లు ఉండగా 2018 అక్టోబర్ లో 91.34 పైసలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే రెండు ప్రభుత్వాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయి, అయితే పెరిగిన పెట్రో ధరలు యూపిఏ పై ప్రభావం చూపిస్తే ఏన్డీఏ పై కూడా చూపించే అవకాశాలు ఉన్నట్టు పరీశీలకులు చెబుతున్నారు.

పెట్రోల్ ఎక్సైజ్ పై పెరిగిన ఆదాయం

పెట్రోల్ ఎక్సైజ్ పై పెరిగిన ఆదాయం

యూపిఏ హాయంలో పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటి తగ్గించి ధరలు తగ్గించే ప్రయత్నం చేశారు. కాని ఏన్డీఏ మాత్రం పెట్రోల్ మరియు డీజీల్ పై పన్ను శాతాన్ని పెంచి, రెవెన్యూ రాబడి పైనే ఎక్కువగా దృష్టి సారించారు.ఈ నేపథ్యంలోనే పెట్రో ఉత్పత్తులపై 2014 నుండి 2016 వరకు మధ్యలో ఎన్డీయె ప్రభుత్వం 9 సార్లు పన్ను శాతాన్ని పెంచింది.దీంతో 2015 ఆర్ధిక సంవత్సరంలో ఎక్సైజ్ ద్వారా రూ. సుమారు 99 వేల కోట్లు రాగా 2017 లో 2018 లో రెండు సంవత్సారాల్లో కూడ సుమారు రూ. 2 లక్షల 42 వేల 691 కోట్లకు పెరిగింది.

ఎన్నికల నేపథ్యంలో భారాన్ని భరిస్తున్న కేంద్రం

ఎన్నికల నేపథ్యంలో భారాన్ని భరిస్తున్న కేంద్రం

జనవరి నుండి ఇప్పటి వరకు పెట్రోల్ ,డీజిల్ ధరలను అయిల్ మార్కెటింగ్ పరిశ్రమలు పెంచలేదు, తగ్గించలేదు కూడ ,దీంతో మూడు నెలలుగా స్థిర రేటును కొనసాగిస్తున్నాయని చెప్పవచ్చు.అయితే ఫిబ్రవరి నుండి ఆరు సార్లు ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగినా, ఇక్కడ మాత్రం ఏమార్పు లేదు,దీంతో కొద్ది భారాన్ని కేంద్రం భరిస్తోంది.

100 కు చేరుకోనున్న పెట్రోల్ ధరలు

100 కు చేరుకోనున్న పెట్రోల్ ధరలు

ప్రస్థుతానికి ధరల భారం కేంద్రం మోస్తున్న, రానున్న రోజుల్లో అది లీటరుకు రూ.100 కు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..ఈనేపథ్యంలోనే పెట్రోల్ ధరలపై సంస్కరణలను తీసుకువచ్చినా, ధరలు మాత్రం పూర్తిగా అదుపులోకి రాలేదు..అవి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వాటి ప్రభావం ఎన్డిఏ పై ఏమేరకు ఉంటుందో వేచి చూడాలి.

English summary
Will the petrol price rise be affected ON the election? Will show up on NDA as on the UPA? The prices of diesel and petrol, which are mainly affecting the prices and essential commodity prices,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X