వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. కోటి గెలిస్తే మొత్తం కోటి వస్తుందా.. రియాల్టీ షోలో విజేతకు నిజంగా అందే మనీ ప్రైజ్ ఎంత..?

|
Google Oneindia TeluguNews

కౌన్‌ బనేగా కరోడ్ పతి.. అమితాబచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షోను దేశవ్యాప్తంగా చాలామంది ఫాలో అవుతారు. అయితే ఈ షోలో విజేతగా నిలిచిన వారికి కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తారు. అయితే విజేత అందుకున్న ఈ భారీ మొత్తం పూర్తి స్థాయిలో ఉంటుందా.. లేక ఏమైనా ట్యాక్స్ కటింగ్స్ పోతాయా... ఇక ఒక్క కౌన్‌బనేగా కరోడ్‌ పతి మాత్రమే కాదు మిగతా రియాల్టీ షోలు అంటే బిగ్‌బాస్, దస్ కా దమ్, ఇండియన్ ఐడల్ లాంటి షోల ద్వారా విజేతలు ప్రైజ్ మనీగా అందుకునే డబ్బులు పూర్తిగా రాదు. ఇదే సందేహం చాలామందిలో ఉంది. అలాంటి వారి కోసమే ఈ కథనం.

కేబీసీలో భారీ ప్రైజ్ మనీ

కేబీసీలో భారీ ప్రైజ్ మనీ

భారత దేశంలో రియాల్టీ షోలకు మంచి ప్రాధాన్యత ఉంది. చాలామంది ప్రేక్షకులు ఈ షోలను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. ఈ షోల నిర్వాహకులు ఇటు చూస్తున్న ప్రేక్షకులకు అటు కాంపిటీషన్‌లో పాల్గొంటున్నవారికి కాసుల వర్షం కురిపిస్తారు కనుక ఈ షోలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమంకు ఆదరణ బాగుంది. ఇటు విజ్ఞానంతో పాటు అటు ఆ షో నిర్వాహకులు అందిస్తున్న భారీ ప్రైజ్ మనీతో కేబీసీ కార్యక్రమంకు చాలామంది అభిమానులు ఉన్నారు.

 కోటి రూపాయలు గెల్చుకున్న విజేతకు వచ్చే డబ్బు ఎంత..?

కోటి రూపాయలు గెల్చుకున్న విజేతకు వచ్చే డబ్బు ఎంత..?


కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. కోటి గెలుచుకుంటే ఆ మొత్తం తనకు వస్తుందా అనేది చాలామందికి ఉన్న సందేహం. అయితే వాస్తవానికి కేబీసీ అనే కాదు మరే రియాల్టీ షో నుంచి బహుమతిగా వచ్చే భారీ మొత్తంలో కచ్చితంగా పూర్తి అమౌంట్ రాదు. ఇన్‌కం టాక్స్ నిబంధనల మేరకు మాత్రమే డబ్బులు వస్తుంది. అంటే ఒకవేళ కేబీసీలో పాల్గొన్న వ్యక్తి రూ. కోటి గెలిస్తే అతనికి వచ్చేది మాత్రం రూ. 66 లక్షలే. దాదాపు రూ.34 లక్షలు పన్నుల రూపంలో కట్ అవుతుంది. చివరకు విజయం సాధించిన ఆనందం కన్నా రూ.34 లక్షలు పన్ను రూపంలో పోయాయే అన్న బాధే విజేతలో ఎక్కువగా ఉంటుంది. ఇన్‌కంటాక్స్ నిబంధనల మేరకు 30శాతం పన్ను.. ఆ తర్వాత సర్‌ఛార్జీలు ఇతరత్ర ఛార్జీలు 15శాతం వర్తిస్తాయి. దీంతో మొత్తం 45శాతం పన్నుల రూపంలో పోతుంది.

ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది..?

ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది..?

ఇక లాటరీల ద్వారా, క్రాస్ వర్డ్ పజిల్స్, కార్డ్ గేమ్స్, ఇతర గ్యాంబ్లింగ్స్ ద్వారా వచ్చే డబ్బులపై టాక్స్ విధించబడుతుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 56 (2)(ib)ని అనుసరించి పన్ను విధించడం జరుగుతుంది. అంటే రియాల్టీ షోల ద్వారా బహుమతి రూపంలో పొందే డబ్బులును ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్‌‌గా పరిగణించి దీనిపై పన్ను విధించడం జరుగుతుంది. ఒకవేళ విజేత గెల్చుకున్న డబ్బులు చెల్లించేందుకు క్యాష్ రూపంలో కాకుండా చెక్ రూపంలో, లేదా డీడీ, లేదా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌‌ చేస్తే అప్పుడు ట్యాక్స్‌ రూపంలో చెల్లించే డబ్బులు కట్ చేసి మొత్తం అమౌంట్‌ను విజేతకు ఇస్తారు. అంతేకాదు కట్ అయిన డబ్బులను విజేతలు తిరిగి రీఫండ్ రూపంలో పొందలేరు.

మొత్తానికి ఒక రియాల్టీ షో ద్వారా ఒక వ్యక్తి కోటి రూపాయల విజేతగా నిలిస్తే వాస్తవానికి ఆవ్యక్తి కోటీశ్వరులు అయినట్లు కాదు.. లక్షాధికారులు మాత్రమే అయినట్లు. ఇందుకు కారణం మనదేశంలో ఉన్న ఆదాయపు పన్ను చట్టాలన్న సంగతి మరువ కూడదు.

English summary
hen a person wins a heavy amount in the reality shows like Kaun banega Crorepati, the prize money is only given after cutting the tax which is subject to incometax act of 1961.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X