వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య-బాబ్రీ మసీదు సమస్య భూవివాదమే: సుప్రీం కోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసు కేవలం భూవివాదమని, దీనిని సాధారణ పిల్‌గానే విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదంపై తుది విచారణ గురువారం ప్రారంభమైంది. దీనిపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి నవారి వాదనలు మొదట వింటామని చెప్పింది.

ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.

Will treat Ayodhya only as a land dispute case, says SC

ఓ సందర్భంలో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ ప్రతివాదనలు కావాలని తాము అడగడం లేదని, ప్రతిపాదనలు వస్తే ఊహాగానాలు వస్తాయని, ఊహాగానాలు వల్ల ఏదో ఒక అభిప్రాయం కలుగుతుందని, అభిప్రాయాలు అబద్దాలకు దారి తీస్తాయని, అబద్దాలతో అవివేకం కలుగుతుందని, అది ప్రమాదకరంగా మారుతుందని, చివరికి మనిషిని చంపేస్తుందని వ్యాఖ్యానించింది.

ఈ కేసును రోజువారీ విచారించమని తెలిపింది. న్యాయం కోసం 700 మంది పేదలు ఎదురు చూస్తున్నారని, వారి కేసులు పరిశీలించాల్సి ఉందన్నారు. భూమికి సంబంధించి ఇరు పక్షాలు డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశఇంచింది. చరిత్రకు తమకు సంబంధం లేదని, దీనిని భూవివాదంగానే చూస్తామని తెలిపింది.

English summary
The emotive Ram Janmabhoomi-Babri Masjid dispute will be decided as any other land dispute based on evidence on record, the Supreme Court said on Thursday as it endeavoured to scale down passions and tensions generated by the 70-year-old conflict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X