• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మద్యం, మగువ, వయాగ్రా: దురాశతోనే డీఎస్పీ దవీందర్ సింగ్ జైలుకు, ఉద్యోగం ఊడింది!

|

న్యూఢిల్లీ: మనదేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్ దేశానికి, ఉగ్రవాదులకు చేరవేస్తున్న జమ్మూకాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ ఇటీవల అరెస్టైన విషయం తెలిసిందే. అతడ్ని పోలీసుశాఖ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం 15 రోజులపాటు జుడీషియల్ కస్టడీలో ఉన్న దవీందర్ సింగ్‌ను.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు, పోలీసులు విచారిస్తున్నారు.

  Evening News Express : 3 Minutes 10 Headlines | Bodo Agreement | Coronavirus
  అతడో ఒంటరి తోడేలు..

  అతడో ఒంటరి తోడేలు..

  విచారణలో దవీందర్ సింగ్ జీవనశైలికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడ్ని ఓ ఒంటరి తోడేలుతో పోల్చారు అధికారులు. అతని ఫోన్లో చాట్స్, ఇతర ఫొటోలు, సందేశాలు చూసి ఆశ్చర్యపోయారు. అతడు ప్రతిరోజూ మద్యం తాగుతాడని తేల్చారు.

  విచారణలో సంచలన విషయాలు

  విచారణలో సంచలన విషయాలు

  అంతేగాక, దవీందర్‌కు డజన్లకొద్దీ మహిళలతో సంబంధాలున్నాయని గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. విలాసవంతంగా బతకడం కోసమే తాను ఇదంతా చేసినట్లు నిందితుడు దవీందర్ సింగ్ చేసిట్లు తెలిపారు. శృంగారానికి బానిసగా మారానని అతడే తమ విచారణలో చెప్పాడని తెలిపారు. చిన్న నీలిరంగు మాత్ర(వయాగ్రా) కూడా ప్రతిరోజూ తీసుకుంటానని అతడు తెలిపినట్లు పోలీసులు చెప్పారు.

  విలాసం కోసమే తప్పుడుదారిలో..

  విలాసం కోసమే తప్పుడుదారిలో..

  గతనాలుగు వారాలుగా జైలులోనే ఉన్న దవీందర్ సింగ్.. పాలిపోయిన ముఖంతో ముసలివాడిలా కనిపిస్తున్నారని అధికారులు చెప్పారు. తనకు యూట్యోబ్‌లో శ్లోకాలు వినిపించాలంటూ పోలీసులను కోరాడు. తన జీవితాన్ని విలాసంగా తయారు చేసుకునేందుకు దవీందర్ సింగ్ తప్పుడు దారులు వెతికారని అన్నారు.

  ప్లేబాయ్‌గా ఉంటేనే..

  ప్లేబాయ్‌గా ఉంటేనే..

  ప్లేబాయ్‌లా ఉంటూనే.. ఇంధ్ర శ్రీగనర్‌ ఇందిరా‌నగర్‌లో ఓ విలాసవంతమైన భవనం నిర్మిస్తున్నాడు. అందుకు కొంత డబ్బు తక్కువపడింది. అంతేగాక, బంగ్లాదేశ్‌లో మెడికల్ విద్యనభ్యసిస్తున్న ఇదరు కూతుర్లు, శ్రీనగర్‌లోని ఓ పేరున్న పాఠశాలలో చదువుతున్న కొడుకుకు సంబంధించిన ఫీజులు కూడా కట్టాల్సివుంది. తన అవసరాలు, విలాసలా కోసమే దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్ శత్రుమూకలు, ఉగ్రవాదులకు చేరవేశాడు.

  తప్పు చేశానని..

  తప్పు చేశానని..

  ప్రస్తుతం దవీందర్ సింగ్ తను చేసిన తప్పునకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడని అధికారులు తెలిపారు. దవీందర్ సింగ్ చేసిన ఈ పని తప్ప ఇంకా ఎక్కడా కూడా దేశ వ్యతిరేక కార్యాక్రమాల్లో ఆయన పాల్గొనలేదని, అతనికి ఇతర దేశ ద్రోహ కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇద్దరు ఉగ్రవాదులతో కారులో వెళుతున్న సమయంలో దవీందర్ సింగ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, పలువురు ఉగ్రవాదులు అతడు ఆశ్రయం కల్పించినట్లు కూడా తేలింది.

  English summary
  As J&K Police DSP Davinder Singh, who has been suspended, cools his heels in Jammu's Hiranagar after a special National Investigation Agency (NIA) court sent him to 15-day judicial remand, the probe agency is peering through evidence, records and seized materials. Some of them were recovered from week-long raids carried out in North and South Kashmir.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more