వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ కంపెనీలకు ట్రంప్ ఓ పెనుముప్పు: విప్రో సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యలతో భారత ఐటీ కంపెనీలతో పాటు ఇతర దేశాల ఐటీ కంపెనీలు కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పలు కంపెనీలు ట్రంప్ విధానాల ప్రభావంతో హెచ్1బీ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యలతో భారత ఐటీ కంపెనీలతో పాటు ఇతర దేశాల ఐటీ కంపెనీలు కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పలు కంపెనీలు ట్రంప్ విధానాల ప్రభావంతో హెచ్1బీ వీసాల్లో భారీగా కోతపెడుతున్నాయి కూడా.

తొలి కంపెనీ.. విప్రోనే

తొలి కంపెనీ.. విప్రోనే

అయినా, ఏ ఐటీ కంపెనీ కూడా ట్రంప్ తాజా నిర్ణయాల వల్ల తమకు నష్టం కలిగినట్లు ప్రకటించలేదు. కానీ, భారత ఐటీ దిగ్గజం విప్రో మాత్రం ట్రంప్ వల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. ట్రంప్ విధానాల వల్ల నష్టపోయామని బహిరంగంగ ప్రకటించిన తొలి కంపెనీ విప్రోనే కావడం గమనార్హం.

ట్రంప్ ఓ పెనుముప్పు

ట్రంప్ ఓ పెనుముప్పు

ఐటీ కంపెనీల పాలిట డొనాల్డ్ ట్రంప్ పెను ముప్పుగా ఉన్నారని, ఇన్ని ఏళ్లో తొలిసారి అమెరికా అధ్యక్షుడి వల్ల తమకు నష్టం వాటిల్లనున్నట్లు విప్రో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంచ్ కమిషన్ వార్షిక ఫైలింగ్‌లో పేర్కొంది. భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితులు, ఉగ్రవాదుల దాడులతో తమ వ్యాపారాలు, లాభాలు భారీగా దెబ్బతిన్నాయని తెలిపింది.

ఇబ్బందికర పరిస్థితి..

ఇబ్బందికర పరిస్థితి..

అంతేగాక, ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్షుడి ఎన్నిక తమపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని విప్రో పేర్కొంది. అమెరికాతోపాటు యూకే, సింగపూర్, ఆస్ట్రేలియాలు కూడా ఇమ్మిగ్రేషన్ చట్టాల విషయంలో ట్రంప్ బాటలో నడుస్తుండటం కూడా తమను ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాయని తెలిపింది.

తీవ్ర ప్రభావం..

తీవ్ర ప్రభావం..

ఈ నిబంధనలు తమ సంస్థ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో వార్షిక ఫైలింగ్ వివరించింది. ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా రక్షణవాద చర్యలు దేశీ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ విధానాల కారణంగా చాలా ఐటీ కంపెనీలు స్థానికంగా రిక్రూట్‌మెంట్లను పెంచి, వీసాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తామని పేర్కొంటుండటం గమనార్హం.

ఇక అమెరికా వారికే..

ఇక అమెరికా వారికే..

కాగా, తొలి క్వార్టర్ ముగిసే లోపల, తమ కంపెనీలో 50శాతానికి పైగా ఉద్యోగులు స్థానికులై ఉంటారని విప్రో తెలిపింది. ఇటు ఇన్ఫోసిస్ కంపెనీ సైతం వచ్చే రెండేళ్లలో 10వేల మంది అమెరికన్లను రిక్రూట్ చేసుకుంటామని పేర్కొంది. ఇలా ఐటీ కంపెనీలు వరుసగా ప్రకటిస్తున్నాయే తప్ప.. ట్రంప్ విధానాల వల్ల తాము నష్టపోతున్నామని విప్రో తప్ప ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ప్రకటించకపోవడం గమనార్హం.

English summary
Donald Trump is a risk factor for WiproBSE -1.59 %, the first time in years an IT company has designated a US president as a potential threat in its annual filing with the US Securities and Exchange Commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X