వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రేప్ కేసు.. నిందితులకు 35 ఏళ్ల జైలుశిక్ష

|
Google Oneindia TeluguNews

ముంబై : సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రేప్ కేసులో ఎట్టకేలకు ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. నిందితులకు 35 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 12 సంవత్సరాల కిందట అంటే 2007లో పుణేలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన ఘటనలో న్యాయస్థానం తుది తీర్పు వెలువరించడంపై హర్షం వ్యక్తమవుతోంది. అప్పట్లో విప్రో సంస్థకు చెందిన బీపీవో ఉద్యోగినిని క్యాబ్ డ్రైవర్‌తో పాటు మరొకడు అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు.

2007 నుంచి కేసు విచారణ సాగుతోంది. 12 ఏళ్ల తర్వాత ముంబై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. దోషులకు 35 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అప్పట్లో 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మీద పురుషోత్తం బొరాటేతో పాటు ప్రదీప్ కొకడె దారుణానికి ఒడిగట్టారు. వారిద్దరూ కలిసి సదరు యువతి మీద అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత దారుణంగా హత్య చేశారు. అది జరిగిన మరునాడే పోలీసులు వారిని అరెస్టు చేయగా, ముంబై సెషన్స్ కోర్టు 2012వ సంవత్సరంలో ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది.

 Wipro techie rape cum murder convicts get 35 years jail

ఇదెక్కడి సరదారా నాయనా.. పోలీసుకే ముద్దు పెట్టాడు..! (వీడియో)ఇదెక్కడి సరదారా నాయనా.. పోలీసుకే ముద్దు పెట్టాడు..! (వీడియో)

2017వ సంవత్సరంలో దోషులకు రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు. అంతేకాదు సుప్రీం కోర్టు సైతం ముంబై సెషన్స్‌ కోర్టు తీర్పును సమర్ధించింది. అదలావుంటే ఉరిశిక్షను అమలు చేయడంలో ఆలస్యం జరుగుతోందని దోషులిద్దరూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. అలాగే జైలుశిక్షను తగ్గించాలంటూ కోర్టుకు విన్నవించారు. అయితే పూర్వపరాలు పరిశీలించిన న్యాయస్థానం ఉరిశిక్షను రద్దు చేస్తూ దోషులకు 35 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది.

English summary
Mumbai High Court given judgement in wipro techie rape and murder case which happened in pune city in the year of 2007. The convicts brutally rape and murdered 22 years techie. Cab driver and his friend arrested in this case and finally they were jailed for 35 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X