వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలివి తెల్లారిన‌ట్టే ఉంది..! బికినీలో పెళ్లి.. బుర‌ద‌లో ముద్దులా..? ఛీ..ఇదో వెకిలి వెరైటీ..!!

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా/హైద‌రాబాద్ : అమెరికాలో ఓ జంట తెలివి తెల్లారిన‌ట్టే ఉంది. నాగ‌రిక క‌త వింత పోక‌డ పోతోంది. సంస్క్రుతి, సాంప్రదాయాలు వెర్రిత‌ల‌లు వేసి వెక్కిరిస్తున్నాయి. సాంప్ర‌దాయ బద్దంగా పెళ్లి చేసుకోవాల్సిన ఓ జంట ఆధునిక‌త‌, వెరైటీ పేరుతో వింత‌గా వ్య‌వ‌హ‌రించారు. వివాహానికి సాంప్ర‌దాయ దుస్తులు వేసుకోవాల్సింది పోయి వెరైటీ కోసం బికినిలో ప్ర‌త్య‌క్ష్యం అయింది ఆ వ‌ధువు. వ‌రుడు ఏం త‌క్కువ తిన‌లేదు అన్న‌ట్టు చొక్కా లేకుండా పెళ్లి మంట‌పానికి చేరుకుని అంద‌రిని ఆశ్య‌ర్యానికి గురిచేసాడు. పెళ్లి తంతు ఇంత‌టితో ఆగిందా అనుకుంటే పొర‌పాటే..! ఓ మోస్త‌రు బుర‌ద గుంట‌ను ఏర్పాటు చేసుకుని కొత్త‌గా పెళ్లైన జంట ఆ బుర‌ద‌గుంట‌లో దిగి ముద్దులు పెట్టుకుని అంద‌రి చేత ఓరా అనిపించుకున్నారు.

ఫ్లోరిడాకు చెందిన ఓ జంట వివాహం చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మినీ ఆటో వెనకవైపు చిన్న పందిరి వేసుకున్న ఆ జంట అక్కడే పెళ్లి చేసుకొంది. దానిలో పెద్దగా చెప్పుకునేదేముంది అంటారా? ఇంకా ఉంది. ఆ పెళ్లిలో పెళ్లి కూతురు బికినీ వేసుకొని ఉంది. పెళ్లికొడుక్కి చొక్కా లేదు. బికినీలోని పెళ్లి కూతుర్ని పెళ్లిచేసుకొన్న అతను.. మినీ ఆటోలోంచి ఆమెను కిందకు దించి, అపురూపంగా ఎత్తుకొని ముద్దులు పెడుతూ తీసుకెళ్లి ఓ బురదగుంటలో పడేశాడు.

Wisdom became non-sense..! wedding in Bikini..Nasty Variety .. !!

తను కూడా ఆమె వెనకే బురదగుంటలో దూకి ఆమెను ముద్దులతో ముంచెత్తాడు. ఈ వింత వివాహానికి హాజరైన వారి మిత్రులు ఈ తతంగాన్నంతా కెమెరాల్లో బంధించారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పటికే దాదాపు లక్షమంది దీన్ని షేర్ చేసినట్లు సమాచారం. వినూత్నంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ప‌ట్ల ర‌క‌ర‌కాల కామెంట్లు కూడా వెల్లువెత్తుతున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
A married couple in Florida has now become a hot topic in social media. At the wedding, the bride's daughter is bikini. There is no wedding shirt for groom. She married in a bikini. All the friends who attended this strange marriage were locked up in the camera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X