వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్1బీ వీసా: ధరఖాస్తుల్లో ఇండియా టాప్, పోటీకి చైనా

ఇండియా నుండే అత్యధికంగా హెచ్ 1 బీ వీసాల ధరఖాస్తులు వచ్చాయి.ఇండియా తర్వాతి స్థానం చైనాకు దక్కింది.ఫిలిప్పైన్స్ నుండి వీసాల ధరఖాస్తులు గణనీయంగా తగ్గాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: హెచ్1 బీ వీసాల ధరఖాస్దు నిబంధనలను అమెరికా ప్రభుత్వం కఠినతరం చేసింది. అయినా ఇండియా నుండి హెచ్1బీ వీసాల కోసం అత్యధికంగా అందాయి. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత వీసా నిబంధనలను మార్చేశారు.

టెక్కీలకు షాక్: హెచ్ 1 బీ వీసాను ఇండియన్స్ దుర్వినియోగం, వీసా ఫీజు పెంపు?టెక్కీలకు షాక్: హెచ్ 1 బీ వీసాను ఇండియన్స్ దుర్వినియోగం, వీసా ఫీజు పెంపు?

స్థానికులకు ఉద్యోగావకాశాలను కల్పించాలనే కారణంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేసింది. అంతేకాదు ఈ నిబంధనల కారణంగా ప్రత్యేకించి ఇండియా టెక్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

హెచ్ -1 బీ వీసా ధరఖాస్తులను తగ్గించేసిన టిసిఎస్, కారణమిదేహెచ్ -1 బీ వీసా ధరఖాస్తులను తగ్గించేసిన టిసిఎస్, కారణమిదే

టెక్ కంపెనీలతో పాటు టెక్కీలు కూడ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇండియాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు అమెరికాలోని స్థానికులకు ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. హెచ్1 బీ వీసాను ఇండియాకు చెందిన టెక్ కంపెనీలు దుర్వినియోగం చేశాయని అమెరికాలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు.

టెక్కీలకు షాక్: అమెరికాలో స్థానికులకు 10 వేల ఉద్యోగాలు కల్పించనున్న ఇన్పోసిస్టెక్కీలకు షాక్: అమెరికాలో స్థానికులకు 10 వేల ఉద్యోగాలు కల్పించనున్న ఇన్పోసిస్

అయితే ఈ సమావేశంలో వీసా ఫీజును భారీగా పెంచడం వల్ల వీసాలను ఇబ్బడిముబ్బడిగా ఇచ్చే ప్రమాదం తగ్గిపోయే అవకాశం ఉందని అమెరికా అధికారలుు అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వం మాత్రం హెచ్1 బీ వీసాల విషయంలో ఇండియన్స్‌పై ఓ కన్నేసి ఉంచింది.

హెచ్1బీ వీసాలకు ఇండియా నుండే అత్యధిక ధరఖాస్తులు

హెచ్1బీ వీసాలకు ఇండియా నుండే అత్యధిక ధరఖాస్తులు

అమెరికాలో ఉద్యోగాలను చేయాలని భావించే టెక్నాలజీ నిపుణులు, ఇతర ఉద్యోగులు దరఖాస్తు చేసుకునే హెచ్-1బీ వీసాల విషయంలో ఇండియా టాప్‌లో నిలిచింది. ఈ సంవత్సరం జూన్ వరకూ నమోదైన గణాంకాలను అమెరికా ప్రభుత్వం విడుదల చేయగా, మొత్తం 2.47 లక్షల దరఖాస్తులతో 74 శాతం ఇండియన్స్ వీసా కోసం దరఖాస్తు చేసుకుని తొలి స్థానంలో ఉన్నారు. అక్టోబర్ 1తో మొదలయ్యే అమెరికా ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగుస్తుంది.

ఇండియాతో పోటీ పడుతున్న చైనా

ఇండియాతో పోటీ పడుతున్న చైనా

ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో గతంతో పోలిస్తే వీసా దరఖాస్తుల సంఖ్య పెరిగింది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా చైనా నుంచి 35,720 దరఖాస్తులు రాగా, ఇండియా తరువాతి స్థానంలో చైనీయులు నిలిచారు. కెనడా మూడో స్థానంలో 3,551 దరఖాస్తులకు పరిమితమైంది. జూన్ వరకూ మొత్తం 3.36 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిల్లో 1.97 లక్షల దరఖాస్తులను ఆమోదించామని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం పేర్కొంది. చాలా దరఖాస్తులను ఇంకా పరిశీలించాల్సి వుందని వెల్లడించింది.

ఫిలిఫ్పిన్స్ నుండి తగ్గిన ధరఖాస్తులు

ఫిలిఫ్పిన్స్ నుండి తగ్గిన ధరఖాస్తులు

2006 , అక్టోబర్ 1నుంచి జూన్ 30, 2017 వరకూ పరిశీలిస్తే, ఇండియా నుంచి 21.83 లక్షల దరఖాస్తులు రాగా, చైనా నుంచి 2.96 లక్షలు, ఫిలిప్పీన్స్ నుంచి 85,918 దరఖాస్తులు వచ్చాయి. ఫిలిప్పీన్స్ నుంచి వచ్చే దరఖాస్తులు 2006తో పోలిస్తే 70 శాతం వరకూ తగ్గాయని యూఎస్ అధికారులు విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. భారత దరఖాస్తుదారుల సంఖ్య 80.6 శాతం పెరిగిందని తెలిపారు.

కాగ్నిజెంట్ నుండి అత్యధిక ధరఖాస్తులు

కాగ్నిజెంట్ నుండి అత్యధిక ధరఖాస్తులు

టెక్ కంపెనీల నుండి అత్యధికంగా వీసాల కోసం ధరఖాస్తులు చేస్తుంటాయి. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల కోసం ఆయా కంపెనీలు ప్రతి ఏటా ధరఖాస్తులను చేయడం అనివార్యంగా మారింది. వీసాలను కోరిన టాప్-5 కంపెనీలుగా కాగ్నిజెంట్ ముందు నిలువగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆక్సెంచర్, విప్రోలు ఆపై స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఈ వీసాపై అమెరికాకు వెళ్లే వారికి కనీసం 1.30 లక్షల డాలర్లను సంవత్సర వేతనంగా ఇవ్వాలన్న నిబంధన ఉన్న సంగతి తెలిసిందే.

English summary
With 2.47 lakh applications, Indians continued to be the largest group of H-1B visa aspirants during the first nine months of the current US financial year. The number works out to 74% of the total applications between October 1, 2016, and June 30, 2017. The US financial year begins from October 1 and ends on September 30. During 20152016 financial year, Indians had filed three lakh applications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X