• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనోహర్ ఖట్టారా.. మజాకా.. కిరీటం పెట్టబోవడమే పాపమా... తల నరుకుతామని బెదిరింపులు....( వీడియో)

|

చండీగఢ్ : మనోహర్ లాల్ ఖట్టార్.. హర్యానా సీఎంగా తెలుసు. కానీ ఆయన వ్యవహారశైలి ఎప్పుడూ వివాదాస్పదమే. ఇటీవల కర్నాల్ వద్ద సీఎంతో కలిసి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన యువకుడిని నెట్టేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమ పార్టీకి చెందిన బీజేపీ తల నరుకుతానని సంచలనం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

 ఏం జరిగిందంటే ..

ఏం జరిగిందంటే ..

ఇటీవల రాష్ట్రంలో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. సభ వేదికపై సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగిస్తున్నారు. ఇంతలో కొందరు కల్పించుకొని గొడ్డలి ఇచ్చారు. దానిని పట్టుకొని రాజసం ఒలకబోశారు ఖట్టర్. తర్వాత వెనక నుంచి బీజేపీ నేత ఒకరు కిరీటం పెట్టే ప్రయత్నం చేశారు. ఇంకేముంది హర్యానా సీఎంకు మండింది. వెంటనే వెనుదిరిగి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు తన చేతిలో ఉన్న గొడ్డలిని చూపిస్తూ .. బెదిరించడం మొదలెట్టారు. అయితే ఈ ఘటన అంతా వీడియో రికార్డైంది. అదీ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఇదీ వ్యుహమా ?

ఇదీ వ్యుహమా ?

ప్రజల్లో ఉన్న సీఎం ఖట్టార్ .. ర్యాలీలో ... బహిరంగ సభ వేదికపై బీజేపీ నేతతో అనుచిత ప్రవర్తన చర్చానీయాంశమైంది. అంతేకాదు తన శత్రువులను చంపుతానని ఖట్టర్ సంకేతం ఇచ్చారా అనే ప్రశ్న తలెత్తుంది. సీఎం పదవీ కోసం ఎవరైనా పోటీపడితే ... ఊరుకోబోననే సిగ్నల్ ఇచ్చారా అనే రాజకీయ వర్గాల్లో డిస్కషన్‌కు తెరలేచింది. దీనిపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి.

దేనికి సంకేతం

దేనికి సంకేతం

ఖట్టార్ ప్రవర్తన దేనికి సంకేతం అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. సభలో బీజేపీ నేతతో ప్రవర్తన సరికాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా గుర్తుచేశారు. గొడ్డలితో నరుకుతానని బెదిరించడం ఏంటీ అని .. ప్రజాస్వామ్యంలో ఇదేక్కడి వైఖరి అని ప్రశ్నించారు. సభ వేదికపై బీజేపీ నేతను పట్టుకొని .. 'మీరు ఏం చేస్తున్నారు, మీ తల నరకలా అంటే ఆ నేత పక్కకు తప్పుకొన్నారని గుర్తుచేశారు. దీంతో తానేమి తప్పుచేయకున్నా ఖట్టర్‌కు ఆ నేత క్షమాపణ చెప్పారని తెలిపారు. 'ఆగ్రహం, అహం మనిషికి మంచిది కాదు.. మీకు ఎందుకు కోపం వచ్చింది. ప్రజల మధ్య మీరు జనానికి ఏం చెప్పాలనుకున్నారు అని‘ ట్వీట్‌లో ప్రశ్నించారు సుర్జేవాలా. అయితే ఖట్టర్ ప్రవర్తన ఇది తొలిసారి కాదు. ఇదివరకు చాలా సందర్భాల్లో మిగతావారితో అతను అనుచితంగా ప్రవర్తించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a video of Haryana Chief Minister Manohar Lal Khattar threatening to chop off his Bharatiya Janata Party (BJP) colleague’s head has gone viral on social media. In the video, posted by Congress spokesperson Randeep Singh Surjewala on Wednesday, CM Khattar is seen standing with an axe during a rally. With an axe in his hand, ML Khattar tells the public how it can be used to destroy enemies. Just then, a BJP leader standing behind CM Khattar places a crown on his head. But this does not go well with Khattar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more