వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విలీనం కష్టాలు: నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు..ప్లాన్ చేసుకోండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 10 ప్రధాన బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేసిన నాలుగు బ్యాంకు యూనియన్లు నిరసనకు దిగుతున్నాయి. సెప్టెంబర్ 25 అర్థరాత్రి నుంచి సెప్టెంబర్ 27వరకు బ్యాంకు యూనియన్లు ధర్నాకు దిగుతున్నాయి. దీంతో ఆ రెండు రోజులు బ్యాంకులు పనిచేయవని సమాచారం. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ మరియు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్‌ అనే ఈ నాలుగు యూనియన్లు ధర్నాకు దిగుతున్నాయి.

నాలుగురోజుల పాటు కార్యకలాపాలకు బ్రేక్

నాలుగురోజుల పాటు కార్యకలాపాలకు బ్రేక్

ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు ప్రభుత్వ సెలవుదినాల్లో, రెండో శనివారం మరియు నాల్గవ శనివారాల్లో సెలవుదినంగా పాటిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే బ్యాంకులు 28 సెప్టెంబర్‌ నాల్గవ శనివారం కావడంతో ఆరోజు సెలవుదినంగా పాటిస్తాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. దీంతో బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవడం కానీ , డిపాజిట్ చేయడం లాంటి లావాదేవీలు జరగవు. వేసిన చెక్కులు కూడా క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. రెండు రోజులు బ్యాంకు యూనియన్ స్ట్రైక్, ఆ తర్వాత రెండు రోజులు సెలవు దినాలు కావడంతో చెక్ వేసిన వారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇందుకోసమే బ్యాంకులపై ఎక్కువగా ఆధారపడే వారు ముందస్తుగా తమ డిపాజిట్లను, లేదా విత్‌డ్రాల్స్‌ను ప్లాన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

 నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకిగ్ ద్వారా..

నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకిగ్ ద్వారా..

ఇక బ్యాంకులపై ఆధారపడేవారిక ఇలాంటి తిప్పలు తప్పవు. కానీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌లపై ఆధారపడే వారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకు లావాదేవీలకంటే డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయాలంటే నెట్ బ్యాంకింగ్ కానీ , డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా చేయాలని సూచిస్తున్నారు. అయితే సెలవు దినాల్లో మాత్రం ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్‌టీలు సాధారణంగా పనిచేయవు. అలాంటి సమయంలో యూపీఐ లేదా ఐఎంపీఎస్ సేవలు వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వేతనాల పెంపు, ఐదు రోజుల పనిదినాలకు డిమాండ్

వేతనాల పెంపు, ఐదు రోజుల పనిదినాలకు డిమాండ్

2017 నుంచి రెండుసార్లు బ్యాంకుల విలీనం జరిగింది. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ బ్యాంకులుగా వ్యవహరిస్తున్న బ్యాంకులను విలీనం చేయగా... ఆ తర్వాత దేనా బ్యాంకు విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విలీనం చేసింది ప్రభుత్వం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను విలీనం చేస్తూ ఇచ్చిన ప్రకటనపై తాము నిరసన తెలుపుతున్నామని రెండు బ్యాలన్స్ షీట్లు అదనంగా చేర్చడం వల్ల ఉన్న బ్యాలన్స్ షీట్ బలోపేతం కాదని యూనియన్ సంఘాలు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఛైర్మెన్‌కు లేఖ రాశాయి. నవంబర్ రెండో వారం నుంచి నిరవధిక దీక్షలు చేపడుతామని బ్యాంకు యూనియన్లు హెచ్చరించాయి.ఇక వారు సమర్పించిన లేఖలో వేతనాలను సవరించడంతో పాటు బ్యాంకు ఉద్యోగులకు ఐదురోజులు మాత్రమే పనిదినాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి.

English summary
Four bank unions have announced a two-day strike, starting at midnight on 25 September and continuing till 27 September, to protest the merger of 10 major public sector banks announced by finance minister Nirmala Sitharaman last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X