వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా టీవీ సర్వే: మోడీదే హవా.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే, తెరాసకు 14, వైసీపీకి 22, టీడీపీకి 3

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రీ పోల్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో కంటే దాదాపు నలభై సీట్లు తగ్గుతాయని, కానీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 238 సీట్లు, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 285 సీట్లు వస్తాయని ఫలితాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి.

గత ఎన్నికల కంటే 44 సీట్లు తక్కువ

గత ఎన్నికల కంటే 44 సీట్లు తక్కువ

బీజేపీకి 2014లో ఒంటరిగా 282 సీట్లు వచ్చాయి. ఈసారి 238 సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది. అంటే గతంలో కంటే 44 సీట్లు తక్కువ వస్తాయి. అదే సమయంలో ఎన్డీయే కూటమికి గత ఎన్నికల్లో 355 సీట్లు ఉండగా, ఈసారి 285 రానున్నాయి. శివసేన, అకాలీదళ్, అన్నాడీఎంకే, జనతా దళ్ (యూ), ఎల్జేపీ, పీఎంకే తదితర పార్టీలు ఎన్డీయేలో ఉన్నాయి.

గతంలో కంటే కాస్త పుంజుకోనున్న కాంగ్రెస్

గతంలో కంటే కాస్త పుంజుకోనున్న కాంగ్రెస్

యూపీఏ కూటమిలో డీఎంకే, తెలుగుదేశం, జేడీఎస్, ఆర్ఎల్డీ, జేఎంఎం, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్ తదితర పార్టీలు ఉన్నాయి. గత ఎన్నికల్లో యూపీఏ 80 సీట్లు గెలిచింది. ఈ సారి 126 సీట్లు గెలుచుకోనుందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. గతంలో కంటే 46 సీట్లు ఎక్కువగా రానున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్వయంగా 82 సీట్లు గెలుచుకోనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలకే పరిమితమైంది. గతంలో కంటే 38 సీట్లు ఎక్కువగా గెలవనుంది.

ఎస్పీ-బీఎస్పీకి 34, బీజేపీకి 40

ఎస్పీ-బీఎస్పీకి 34, బీజేపీకి 40

ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ, ఎస్పీ కూటమికి 34 సీట్లు రానున్నాయని ఈ సర్వేలో తేలింది. బీఎస్పీకి 16, ఎస్పీకి 18 సీట్లు వస్తాయని తేలింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి 40 వరకు గెలవనుందని ప్రీపోల్ సర్వే ఫలితాలు వెల్లడించాయి.

సర్వేలో ఎంతమంది పాల్గొన్నారంటే

సర్వేలో ఎంతమంది పాల్గొన్నారంటే

ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ప్రీపోల్ సర్వేలో 38,600 మంది పాల్గొన్నారు. ఇందులో 20,455 మంది పురుషులు, 18,145మంది మహిళలు ఉన్నారు. ఈ సర్వే 193 లోకసభ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించారు. అన్ని కేంద్ర పాలిత, అన్ని రాష్ట్రాలలోను సర్వే చేశారు. ఈ సర్వేను మార్చి 1వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్య నిర్వహించారు.ఏపీలో వైసీపీకి 22, టీడీపీకి 3, కాంగ్రెస్‌కు 0, తెలంగాణలో తెరాసకు 14, మజ్లిస్ పార్టీకి 1, కాంగ్రెస్‌కు 2 వస్తాయని సర్వేలో తేలింది.

ఏ రాష్టంలో ఎన్ని సీట్లు అంటే

ఏ రాష్టంలో ఎన్ని సీట్లు అంటే

ఉత్తర ప్రదేశ్: బీజేపీ 40, బీఎస్పీ16, ఎస్పీ 18, కాంగ్రెస్ 4, ఆర్ఎల్డీ 1, అప్నాదళ్ 1, మొత్తం 80.

ఉత్తరాఖండ్: బీజేపీ 5. మొత్తం 5.

రాజస్థాన్: బీజేపీ 20, కాంగ్రెస్ 5, మొత్తం 25.

పశ్చిమ బెంగాల్: టీఎంసీ 30, బీజేపీ 12, మొత్తం 42.

ఒడిశా: బీజేడీ 14, బీజేపీ 7, మొత్తం 21.

మధ్యప్రదేశ్: బీజేపీ 23, కాంగ్రెస్ 6, మొత్తం 29.

ఛత్తీస్‌గఢ్: బీజేపీ 6, కాంగ్రెస్ 5, మొత్తం 11.

పంజాబ్: కాంగ్రెస్ 9, అకాళీదళ్ 3, ఏఏపీ 1, బీజేపీ 0, మొత్తం 13.

హర్యానా: బీజేపీ 9, కాంగ్రెస్ 1, మొత్తం 10.

బీహార్: బీజేపీ 15, ఆర్జేడీ8, జేడీ(యూ) 12, కాంగ్రెస్ 2, ఎల్‌జేపీ3, మొత్తం 40.

జార్ఖండ్: బీజేపీ 8, జేఎంఎం 3, కాంగ్రెస్ 2, జేవీఎం(పీ) 1. మొత్తం 14.

గుజరాత్: బీజేపీ 26, కాంగ్రెస్ 0. మొత్తం 26.

హిమాచల్ ప్రదేశ్: బీజేపీ 4, కాంగ్రెస్ 0, మొత్తం 4.

మహారాష్ట్ర: బీజేపీ 22, శివసేన 10, కాంగ్రెస్ 9, ఎన్సీపీ 7, మొత్తం 48.

గోవా: బీజేపీ 2, కాంగ్రెస్ 0, మొత్తం 2.

తమిళనాడు: డీఎంకే 16, అన్నాడీఎంకే12, ఎంఎంకే 2, కాంగ్రెస్ 5, బీజేపీ 1, పీఎంకే 2, ఇతరులు 1. మొత్తం 39.

ఆంధ్రప్రదేశ్: వైసీపీ 22, టీడీపీ 3, కాంగ్రెస్ 0, మొత్తం 25.

తెలంగాణ: తెరాస 14, మజ్లిస్1, కాంగ్రెస్ 2, మొత్తం 17.

కర్ణాటక: బీజేపీ 13, కాంగ్రెస్ 13, జేడీఎస్ 2, మొత్తం 28.

కేరళ: యూడీఎఫ్12, ఎల్డీఎఫ్ 7, బీజేపీ 1, మొత్తం 20.

జమ్ము కాశ్మీర్: బీజేపీ 2, నేషనలిస్ట్ కాంగ్రెస్1, కాంగ్రెస్ 2, పీడీపీ 1, మొత్తం 6.

అసోం: బీజేపీ 8, ఏఐయూడీఎప్ 2, కాంగ్రెస్ 4, మొత్తం 14.

ఈశాన్య రాష్ట్రాలు: బీజేపీ 3, కాంగ్రెస్ 3, ఎంఎన్ఎఫ్ 1, ఎన్‌పీపీ1, సీపీఐ-ఎం 1, ఎన్డీపీపీ 1, ఎస్డీఎఫ్1. మొత్తం 11.

ఢిల్లీ: బీజేపీ 7, కాంగ్రెస్ 0, ఏఏపీ 0. మొత్తం 7.

ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు బీజేపీ 4, కాంగ్రెస్ 2. మొత్తం 6.

English summary
The Narendra Modi-led BJP is likely to emerge as the single largest party with 238 seats, just 13 short of the magical mark, in Lok Sabha 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X