వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్బీఐ ఎఫెక్ట్ : సీనియర్ సిటిజెన్ల వడ్డీ రేట్లపై కోత విధించిన ఎస్‌బీఐ..ఎంతో తెలుసా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గతవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన రేట్ల ప్రభావం ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై పడింది. ఒకటి నుంచి రెండేళ్ల పాటు ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 10బేసిస్ పాయింట్ల మేరా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంకులు కూడా ఇదే పద్ధతిని త్వరలో ఇంప్లిమెంట్ చేయనున్నాయి.

నో బెయిల్.. ఓన్లీ జైల్: పీఎంసీ బ్యాంక్ స్కాంపై కస్టమర్ల భారీ నిరసన, కోర్టు ముందు వాహనాల ధ్వంసంనో బెయిల్.. ఓన్లీ జైల్: పీఎంసీ బ్యాంక్ స్కాంపై కస్టమర్ల భారీ నిరసన, కోర్టు ముందు వాహనాల ధ్వంసం

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ శాతం 6.9శాతంకు తగ్గింపు

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ శాతం 6.9శాతంకు తగ్గింపు

తాజాగా సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో భాగంగా సీనియర్ సిటిజెన్‌లు ఇకపై ఒకటి నుంచి రెండేళ్ల వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ శాతం 6.9శాతంకు తగ్గించింది. ఇదివరకు అది 7శాతంగా ఉండేది. సేవింగ్స్ ఖాతాలో లక్ష రూపాయలు ఉన్నట్లయితే వారికి 3.25శాతం వడ్డీ వస్తుంది. అంతకుముందు 3.5శాతం వచ్చేది. ఇక మొత్తంగా గతేడాది చూస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 50 బేసిస్ పాయింట్ల మేరా తగ్గింది.

 రానున్న రోజుల్లో వడ్డీ మరింత తగ్గే అవకాశం

రానున్న రోజుల్లో వడ్డీ మరింత తగ్గే అవకాశం

ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్‌ను 135 బేసిస్ పాయింట్ల మేరా తగ్గించింది. రానున్న ఆరునెలల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లు మరో 50-80 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉంది. ఇక దీర్ఘకాలంలో బ్యాంకులు ఆర్బీఐ రెపో రేట్ అనుగుణంగా తమ రేట్లను సవరించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

 ఎంత తగ్గే అవకాశం ఉంది..?

ఎంత తగ్గే అవకాశం ఉంది..?

ఇప్పటికే దేశవ్యాప్తంగా 4.1 కోట్లు సీనియర్ సిటిజెన్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ అకౌంట్లు ఎస్‌బీఐలో ఉన్నాయి. వీటి విలువ రూ. 14 లక్షల కోట్లు ఉంటాయి. అయితే రెన్యూవల్ సమయంలో వీరిందరికీ తక్కువ వడ్డీ వస్తుందని అనలిస్టులు చెబుతున్నారు. ఇక ఖాతాలో 50 లక్షలు విలువ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్తగా తీసుకొచ్చిన వడ్డీ రేట్ల ప్రకారం రూ.5వేలు తగ్గుతుందని తెలుస్తోంది.

వృద్ధి రేటు బలోపేతం దిశగా...

వృద్ధి రేటు బలోపేతం దిశగా...

ఇక వృద్ధి రేటును బలోపేతం చేసేందుకు ఆర్బీఐ భవిష్యత్తులో రెపో రేటును మరింత తగ్గించే అవకాశం ఉన్నందున సీనియర్ సిటిజెన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ మరింత తగ్గి 6శాతంకు చేరే అవకాశం ఉంది. ఇలా జరిగితే డిపాజిటర్ల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు బ్యాంకింగ్ నిపుణులు.

 సీనియర్ సిటిజెన్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి..?

సీనియర్ సిటిజెన్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి..?

సీనియర్ సిటిజెన్లు సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్ కింద వచ్చే బెనిఫిట్స్‌ను వినియోగించుకోవాలని అనలిస్టులు చెబుతున్నారు. దీని ప్రకారం రూ. 15 లక్షల వరకు ఉన్న డిపాజిట్లపై 8.6శాతం వడ్డీ వస్తుందని చెబుతున్నారు. అందుకే సీనియర్ సిటిజెన్లు హైయర్ రేటెడ్ డెబ్ట్ మ్యూచవల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే వడ్డీ 7.5శాతం నుంచి 8శాతం వడ్డీతో రిటర్న్స్ ఉంటాయని చెబుతున్నారు.

English summary
With the latest revision in FD rates, senior citizens in SBI will get 6.9% interest on a 1-2 year fixed deposit as compared to 7% earlier. On savings account, they will get 3.25% interest, down from 3.5% earlier for deposits up to Rs 1 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X