వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈసీ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ -ఆ ఎంపీ సీటు నేరుగా బీజేపీ ఖాతాలోకి..

|
Google Oneindia TeluguNews

135ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గడిచిన అర దశాబ్దకాలంగా ఘోరమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హస్తం గుర్తు పార్టీకి తాజాగా మరో బిగ్ షాక్ తప్పేలా లేదు. ఎన్నికల సంఘం(ఈసీ) తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ తన ఖాతాలోని రాజ్యసభ సీటును కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి కారణంగా ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఇప్పుడు బీజేపీ వశంకాబోతున్నది.

కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్

ఇటీవల గుజరాత్‌లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు విడి విడిగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సమాయత్తం కావడంతో.. కాంగ్రెస్ ఓటమి దాదాపు ఖరారైంది. గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 71 ఏళ్ల అహ్మద్ పటేల్ గత నెల నవంబర్ 25న కన్నుమూశారు. ఆయన పదవీకాలం 2023 ఆగస్టు 18 వరకు ఉంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు అభయ్ భరద్వాజ్ ఈ నెల 1న మృతి చెందారు. ఆయన పదవీకాలం 2026 జూన్ 21 వరకు ఉంది. ఈ ఇద్దరూ కరోనా అనంతర ఆరోగ్య సమస్యల కారణంగానే మృతి చెందారు.

with ECs decision, Congress to lose Ahmed Patels Gujarat Rajya Sabha seat to BJP

ఈ ఇరువురు నేతల మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు విడివిడిగా ఉపఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించగా... ఇది బీజేపీకి ఉపకరించేలా, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి శరాఘాతంలా ఉండటం గమనార్హం. గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 111 మంది ఎమ్మెల్యేలు ఉండగా... కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అభ్యర్థుల విజయం కోసం 50 శాతం ఓట్లు... అంటే 88 మంది ఎమ్మెల్యేలు అవసరం.

జగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామజగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామ

రెండు రాజ్యసభ స్థానాలకు విడివిడిగా ఉపఎన్నికలు జరగనుండడంతో.. బీజేపీ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకేనని చెబుతున్నారు. అయితే సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటుతో దామాషా పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగితే గుజరాత్‌లో రెండు స్థానాలకు గానూ ఒక స్థానాన్ని కచ్చితంగా తిరిగి సాధించుకునే అవకాశం ఉండేదని కాంగ్రెస్ వర్గాలు వాదిస్తున్నాయి.

English summary
In what is set to come as yet another major setback to the Congress, the grand old party is now likely to lose late leader Ahmed Patel's hard-won Rajya Sabha seat in Gujarat to the Bharatiya Janata Party (BJP). The Congress' prospects of losing the seat is primarily being accounted to the Election Commission (EC)'s decision to conduct separate by-polls for both of the two Rajya Sabha seats which fell vacant earlier this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X