వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క‌రోనావైర‌స్: భ‌విష్య‌త్‌లో డేటింగ్‌, సెక్స్ ఇలానే జ‌రుగుతాయా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భవిష్యత్తులో ప్రేమ

వైర‌స్ కంటే ప్రేమ గొప్ప‌ద‌ని అంద‌రూ అంటారు. బ‌హుశా ప్ర‌స్తుతం అది నిజ‌మేనేమో. క‌రోనావైర‌స్‌ను త‌ట్టుకొని ప్రేమ నిల‌బ‌డుతుందేమో.

మన‌కు ముందున్న వ‌స్తువులా.. ప్రేమ భ‌విష్య‌త్తులో ఇలా ఉండ‌బోతుంద‌ని చెప్ప‌లేం. "మ‌నం కేవ‌లం భావోద్వేగంతో, ఆధ్యాత్మికంగా, భౌతిక అంశాల‌కు అతీతంగా ప్రేమించ‌గ‌లం" అని దిల్లీకి చెందిన ప‌ప్స్ రాయ్ చెప్పారు. త‌న‌ను తాను "రెబ‌ల్ విత్ అవుట్ ఎ కాజ్‌"గా ఆయ‌న చెప్పుకొంటారు.

ప్రేమ‌, సెక్స్ రెండూ భిన్న‌మైన‌వ‌ని ఆయ‌న అంటారు.

డేటింగ్‌లో క‌రోనావైర‌స్ లాక్‌డౌన్ విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చింది. ఒక త‌రం ముందుకు వెళ్లిన‌ట్లు అనిపిస్తోంద‌ని ప్ర‌ముఖ డేటింగ్ యాప్స్ చెబుతున్నాయి. ప్ర‌జ‌లు మార్పుల‌కు అల‌వాటు ప‌డిపోతున్నారని అంటున్నాయి..

లాక్‌డౌన్ స‌మ‌యంలో వీడియో డేట్‌లు విప‌రీతంగా పెరిగాయ‌ని ఇ-హార్మొనీ, ఒకేక్యూపిడ్‌, మ్యాచ్ లాంటి డేటింగ్ యాప్స్ చెబుతున్నాయి.

లాక్‌డౌన్‌ ఆంక్ష‌లు స‌డ‌లించ‌డంతో ప్రేమికుల్ని ఆక‌ట్టుకొనేందుకు రెస్టారెంట్లు, కెఫెలు కొత్త మార్గాల‌తో ముందుకు వ‌స్తున్నాయి. డేట్ నైట్లు కూడా త్వ‌ర‌లో తిరిగి రాబోతున్నాయి. అయితే సామాజిక దూరంతోపాటు గాజు అద్దాల‌తో అడ్డుగోడ‌లు కొన్నిసార్లు త‌ప్ప‌నిస‌రి కావొచ్చు.

భవిష్యత్తులో ప్రేమ

రాయ్ త‌న అపార్ట్‌మెంట్‌లో ఫోన్‌తోనే గ‌డ‌పాల్సి వ‌స్తోంది. త‌న‌ ప్రేమ ఎక్క‌డో ఒక‌చోట ఉండే ఉంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

"ఇప్పుడు మ‌నం చేయాల్సింద‌ల్లా.. ఇంతవ‌ర‌కు ఎలా ప్రేమించుకున్నామో మ‌ర‌చిపోవ‌డ‌మే"

త‌ను ప్రేమించే పురుషుడి‌తో రైలులో ఓ సుదూర ప్రాంతానికి వెళ్లి, వారాంతం గ‌డిపేందుకు లాక్‌డౌన్‌కు ముందు ఆయ‌న రెండు టికెట్లు బుక్ చేశారు.

అయితే నెల రోజుల‌పాటు ఆయ‌న ఇంటిలోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. మ‌ళ్లీ ఆయ‌న ఏప్రిల్‌లోనే దిల్లీ వ‌చ్చారు. భ్ర‌మ‌ల‌న్నీ తొల‌గిపోయాయి. ఇద్ద‌రు ఒక‌రికొక‌రు చాలా ఇష్ట‌ప‌డ్డారు. అయితే నేడు వారి మ‌ధ్య‌ సామాజిక దూరం.. ద‌రిచేర‌ని దూరంగా మారిపోయింది.

ఇప్పుడు దిల్లీలో మొబైల్‌ ఫోన్‌తో ఆయ‌న క‌లిసి ఉంటున్నారు. ఆ మొబైల్‌లో త‌న కోసం కొంద‌రు ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. వారు త‌ర‌చూ చాట్ చేస్తుంటారు. అప్పుడ‌ప్పుడు ఆన్‌లైన్ వీడియోల్లోనే ప్రేమ‌ను పండించుకుంటారు.

మ‌తం, ప‌ర్య‌టకం లాంటి చాలా అంశాల భ‌విష్యత్‌ను మ‌నం ఊహించ‌గ‌లం. ఇప్ప‌టికే ప్రార్థ‌నా మందిరాలు తెర‌చుకున్నాయి. పాఠ‌శాల‌లు కూడా... కొన్ని ఆంక్ష‌ల‌తో ప‌ర్యాట‌కాన్నీ అనుమ‌తించారు.

మ‌రి ప్రేమ‌? ఇది పూర్తిగా భిన్న‌మైన అంశం. యూకేలో లాక్‌డౌన్ మొద‌లైన‌ప్పుడు.. జంట‌ల‌ను క‌లిసే ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఒక‌రి కోసం మ‌రొక‌రు వారివారి ఇళ్ల‌కు వెళ్తే.. వైర‌స్ సోకే ముప్పుంద‌ని హెచ్చ‌రించింది. ఆ స‌మ‌యంలో చాలా ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయి.

వాటిలో నెద‌ర్లాండ్స్ ప్ర‌భుత్వం మేలో జారీచేసిన మార్గ‌ద‌ర్శ‌క‌మూ ఒక‌టి. సెక్స్ బ‌డ్డీని వెతుక్కోవ‌డానికి ఒంట‌రిగా ఉండేవారికి ప్ర‌భుత్వం అవ‌కాశ‌మిచ్చింది. అయితే, ఎంత‌మందిని చూడ‌టానికి వెళ్తారు? అనే అంశంలో ఓ అంగీకారానికి రావాల‌ని సూచించింది. ఎక్కువ మంది ద‌గ్గ‌ర‌కు వెళ్లేకొద్దీ.. వైర‌స్ సోకే ముప్పు పెరుగుతుంద‌ని హెచ్చ‌రించింది. అంతేకాదు ఈ మార్గ‌ద‌ర్శ‌కాల్లో హ‌స్త ప్ర‌యోగం, ఇత‌రుల‌తో వ‌ర్చువ‌ల్ సెక్స్‌ కూడా ఉన్నాయి. మ‌రోవైపు శృంగార క‌థ‌లు చ‌ద‌వ‌డం, క‌లిసి హ‌స్త ప్ర‌యోగం చేసుకోవ‌డం మేల‌ని ప్ర‌భుత్వం సూచించింది.

భవిష్యత్తులో ప్రేమ

ఇప్పుడు వీడియో చాట్‌లు స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. ఫోన్ సెక్స్ కూడా..

రెస్టారెంట్లు మూసివేయ‌డంతో డేట్స్‌ సాధ్య‌ప‌డ‌టం లేదు. అయితే పెళ్లిళ్లు, డేట్స్‌, సెక్స్.. ఇప్పుడు వ‌ర్చువ‌ల్ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టాయి. ఇది చాలా భయాన‌క‌మైన భ‌విష్య‌త్తు. కానీ ప్ర‌తిదాంట్లోనూ మార్పు స‌హజం.

ఇప్పుడు బెంగ‌ళూరులోని బాల్క‌నీలో కొవ్వొత్తి వెలుగుల న‌డుమ‌ ఓ చేతిలో వైన్ గ్లాస్ ప‌ట్టుకొని ఎదురుచూస్తున్నాడు కేలెబ్. ఈ ఎదురుచూపులు ఎవ‌రో వ‌స్తార‌ని కాదు. త‌న బంబుల్ యాప్‌లో ప్రేయ‌సి కోసం.

కేలెబ్ ఇదివ‌ర‌కు కూడా డేటింగ్ యాప్స్‌పై చాలా స‌మ‌యం వెచ్చించేవారు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ సేపు వాటితోనే గ‌డుపుతున్నారు. అప్ప‌ట్లో త‌న స్టార్ట‌ప్ కంపెనీపై చాలా స‌మ‌యం వెచ్చించేవారు. కానీ లాక్‌డౌన్‌తో అన్ని మూత‌ప‌డ్డాయి. దీంతో ఇప్పుడు ఆయ‌న తోడు కోసం డేటింగ్ యాప్‌ల వెంట ప‌డుతున్నారు. చివ‌ర‌కు ఆయ‌న విజ‌యం సాధించారు కూడా.

మొద‌ట్లో కేవ‌లం పింగ్‌లు, చాట్‌లు మాత్ర‌మే ఉండేవి. ఇప్పుడు సుదీర్ఘ సంభాష‌ణ‌లూ మొద‌ల‌య్యాయి. చివ‌ర‌గా డేట్‌. అదే ఇప్పుడు జ‌రుగుతోంది.

ఆమె త‌న బాల్క‌నీలో ఉంది. కేలెబ్ త‌న బాల్క‌నీలో ఉన్నాడు. దాదాపు 40 నిమిషాల‌పాటు డేట్ సాగింది. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు కొంచెం స‌డ‌లించ‌గానే వారు క‌లుసుకున్నారు. ఆమె మాస్క్ వేసుకుని అత‌డి టెర్ర‌స్ పైకి వ‌చ్చింది. ఇద్ద‌రూ మెల్లగా కౌగిలించుకున్నారు. ఆయ‌న దీన్ని వింత కౌగిలిగా అభివ‌ర్ణించారు. బ‌హుశా ఇప్పుడు ఇదే మేలేమోన‌ని ఆయ‌న అన్నారు.

భవిష్యత్తులో ప్రేమ

"అంద‌రూ ఎవ‌రో ఒక‌రి కోసం ఎదురుచూస్తున్నారు. మాట్లాడాల‌ని అనుకుంటున్నారు. అయితే మేం క‌రోనావైర‌స్ గురించి మాట్లాడుకోకూడ‌ద‌ని అనుకున్నాం. మాన‌సిక ‌స్థితి, ప్ర‌జ‌ల అవ‌స్థ‌ల గురించి మాట్లాడుకున్నాం. క‌రోనావైర‌స్‌తో మాన‌సికంగా ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుందో నాకు తెలుసు. అందుకే నేను ఎలాంటి త‌ప్పులూ చేయ‌డం లేదు. అదే స‌మ‌యంలో నా స్థాయి కంటే కింద‌కు దిగిరావాల‌ని అనుకోవ‌డం లేదు"అని ఆయ‌న చెప్పారు.

ఇటీవ‌ల కాలంలో దిల్లీలోని మాన‌సిక నిపుణుడు ఆశిష్‌ సెహెగ‌ల్‌కు.. ఒత్తిడికి గుర‌వుతున్న జంట‌ల నుంచి వస్తున్న కాల్స్ ఎక్కువ‌య్యాయి. లాక్‌డౌన్ మొద‌టి వారంలో అంతా ప్ర‌శాంతంగా ఉండేది. త‌ర్వాత కాల్స్ మొద‌ల‌య్యాయి. త‌మ వివాహ బంధం గురించి ఎక్కువ మంది గొడ‌వ‌ప‌డుతూ త‌న‌కు కాల్ చేస్తున్నార‌ని ఆయ‌న వివ‌రించారు.

క‌రోనావైర‌స్ వ్యాప్తి భయాందోళ‌న‌ల న‌డుమ భ‌విష్య‌త్ ప్రేమ‌లో చాలా మార్పులు క‌న‌ప‌డొచ్చు.

ప్రేమ ఒక విధంగా బ‌ల‌ప‌డుతుంది.. భ‌యం న‌డుమ ప్రేమ పెరుగుతుంద‌ని సెహెగ‌ల్ చెప్పారు.

ప్రేమ‌కు సంబంధించి ఆయ‌న కొన్ని భ‌విష్య‌త్ అంచ‌నాలు చెప్పారు. వివాహాల సంఖ్య పెరుగుతుంద‌ని, విడాకుల సంఖ్యా ఎక్కువ‌వుతుంద‌ని అన్నారు. మ‌రోవైపు కొత్త‌గా పుట్టే పిల్ల‌ల సంఖ్యా పెరుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. అయితే ఇవ‌న్నీ ఒక‌దానికి మ‌రొక‌టి విరుద్ధంగా క‌నిపిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమే ప్రేమ మ‌నుగ‌డ సాగించ‌బోతోంది.

ఒంట‌రిగా మిగిలిపోయే వారి సంఖ్యా పెరుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

"ఎయిడ్స్ ప‌తాక స్థాయిలో ఉన్న‌ప్పుడూ ప్రేమికులు ఆగ‌లేదు. ఇప్పుడు ఇదివ‌ర‌కు కంటే ఎక్కువ‌గా ప్రేమించుకుంటున్నారు" అని ఆయ‌న అన్నారు.

"వేరే దేశాల త‌రహాలో ఎక్స్‌బ‌డ్డీ విధానాలు ఇక్క‌డ స‌రిప‌డ‌వు. ఎందుకంటే మ‌న‌కు ఓ సంప్ర‌దాయ‌ అడ్డుగోడ ఉంటుంది. అయితే ఆలోచ‌న‌లు మాత్రం బుర్ర‌ల్లో ఉంటాయి" అని ఆయ‌న అన్నారు.

ఎయిడ్స్ మ‌హ‌మ్మారిగా మారిన‌ప్పుడు కండోమ్ ప‌నిచేసిన త‌ర‌హాలో మాస్క్ ఇప్పుడు ప‌ని చేయ‌దు.

చాలా మంది వీడియో కాల్స్‌లో సేవ‌లు అందిస్తున్నార‌ని ముంబ‌యిలో కామ‌ఠిపురాలో ప‌నిచేస్తున్న ఓ సెక్స్ వ‌ర్క‌ర్ చెప్పారు. అయితే ఆమె ఈ విష‌యంలో సందేహాలు వ్య‌క్తంచేశారు.

"ఎయిడ్స్ చాలా భిన్న‌మైన‌ది. ఒక కండోమ్ స‌రిపోతుంది. కానీ ఈ వైర‌స్ ముట్టుకుంటే వ‌చ్చేస్తుంది. స్ప‌ర్శ‌కు ట‌చ్‌ స్క్రీన్ ఎప్పుడూ ప్ర‌త్యామ్నాయం కాదు" అని ఆమె అన్నారు.

విటుల గురించి తెలుసుకోవ‌డం, వారితో చ‌ర్చ‌లు పెట్ట‌డం ఇష్టంలేదని సెక్స్ వ‌ర్క‌ర్ నేహ‌(పేరు మార్చాం) చెప్పారు. సెక్స్ వీరికి ప‌ని మాత్ర‌మే. కానీ ఇప్పుడు అది కుద‌ర‌డంలేదు.

ఎవ‌రినైనా క‌ల‌వాలంటే భ‌యం వేస్తోంద‌ని మేబెల్ ఇండియా బ‌ట్ట‌ల బ్రాండ్‌ య‌జ‌మాని 28ఏళ్ల నందితా రాజ్ చెప్పారు.

"భ‌విష్య‌త్ ప్రేమ అంధ‌కారంగా అనిపిస్తోంది. ముఖ్యంగా నాకు.. అన్ని దారులూ మూసుకుపోయిన‌ట్లు అనిపిస్తోంది" అని ఆమె వివ‌రించారు.

ఎవ‌రినీ క‌లిసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో చాలామంది ఆన్‌లైన్ డేటింగ్ వైపు మ‌ళ్లుతున్నారు. అయితే, ఇప్పుడు అది కూడా మారుతోంది.

2019 ఫిబ్ర‌వ‌రిలో ఫిల్ట‌ర్ ఆఫ్‌ను జాక్ క్లెయిన్ లాంచ్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 2020లో ఈ యాప్‌ను ఆయ‌న మ‌ళ్లీ రీ లాంచ్ చేశారు. వ‌ర్చువ‌ల్ స్పీడ్ డేటింగ్‌కే భ‌విష్య‌త్ ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

ఫిల్ట‌ర్ ఆఫ్ ఒక వీడియో డేటింగ్ యాప్‌. ఇద్ద‌రికీ ప‌ర‌స్ప‌రం న‌చ్చితేనే మ్యాచ్ అవుతుంది. ఇక్క‌డ మెసే‌జ్‌ల‌తోపాటు 90 సెక‌న్ల వీడియో మెసేజ్‌లూ పంపుకోవ‌చ్చు.

లాక్‌డౌన్ పూర్త‌య్యాక‌.. కావాలంటే డేట్‌ను ఆఫ్‌లైన్ చేసుకోవ‌చ్చ‌ని జాక్ చెప్పారు.

లాక్‌డౌన్ వ‌ల్ల త‌మ వినియోగ‌దారుల సంఖ్య పెరిగింద‌ని, యాప్‌పై వారు వెచ్చించే స‌మ‌య‌మూ పెరిగింద‌ని బంబుల్ యాప్ వెల్ల‌డించింది.

భవిష్యత్తులో ప్రేమ

మార్చి 13తో పూర్త‌యిన వారంతో పోలిస్తే.. మార్చి 27తో పూర్త‌యిన వారంలో భార‌త్‌లో జెన్ జెడ్ రిజిస్ట్రేష‌న్లు 11 శాతం పెరిగాయ‌ని బంబుల్ వివ‌రించింది.

"భార‌త్‌లో స‌గ‌టు వీడియో కాల్ 18 నిమిషాలుగా ఉంటోంది. అంటే వినియోగ‌దారులు ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం వెచ్చిస్తున్నారు" అని బంబుల్ పేర్కొంది.

ఇటీవ‌ల "స్టే ఫార్ అండ్ గెట్ క్లోజ్" పేరుతో సంస్థ ఓ కాంపెయిన్‌ను న‌డిపించింది. ఇంటిలో ఉంటూనే మొద‌ట అడుగులు వేయ‌డం ఎలా? అని దీని ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించింది. టిండ‌ర్‌తోపాటు అన్ని డేటింగ్ యాప్‌ల‌లో కొన్ని వారాలుగా వినియోగ‌దారుల సంఖ్య పెరుగుతోంది.

మ‌రోవైపు త‌మ ప్రొఫైల్‌కు స‌రిపోయేవారిని ఎంపిక చేసే స‌దుపాయాన్ని సిర్ఫ్ కాఫీ అందిస్తోంది.

"మ‌నుషులంద‌రూ ఇత‌రుల‌తో సంబంధాలు పెంచుకోవాల‌ని అనుకుంటారు. ప్ర‌స్తుతం క‌రోనావైర‌స్ వ్యాప్తి న‌డుమ ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. అందుకే బంధాలు నేడు మ‌రింత ఎక్కువ అవ‌స‌రం అయ్యాయి" అని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నైనా హీరానందిని చెప్పారు.

మార్చి 2020 నుంచి 25 శాతం వినియోగ‌దారుల సంఖ్య పెరిగింద‌ని, త‌మ యాప్‌లో ప్ర‌శ్న‌లు అడిగేవారి సంఖ్య‌ 40 శాతం పెరిగింద‌ని ఆమె పేర్కొన్నారు.

"80 శాతం కంటే ఎక్కువ మంది వినియోగ‌దారులు.. క‌రోనావైర‌స్‌తో ప‌రిస్థితులు పూర్తిగా మార‌తాయ‌ని న‌మ్ముతున్నారు" అని ఆమె అన్నారు.

భవిష్యత్తులో ప్రేమ

లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ముంబ‌యి, దుబాయ్‌, లండ‌న్‌ల‌లో దాదాపు 500 వ‌ర్చువ‌ల్ డేట్‌ల‌కు ఈ యాప్ అవ‌కాశం క‌ల్పించింది.

అయితే, ఏం చేయాలో తెలియ‌క డేటింగ్ యాప్‌ల‌లో అడుగుపెట్టామ‌ని చాలా మంది చెప్పిన‌ట్లు 39ఏళ్ల క‌ర‌ణ్ అమీన్ వివ‌రించారు.

"చాలా మంది లైంగిక‌ భాగ‌స్వాముల‌ను ప‌ట్టుకునేందుకు టిండర్‌ను వాడేవారు. ఇప్పుడు అయితే బ‌య‌ట‌కు కూడా వెళ్ల‌లేం."

డేటింగ్ యాప్‌లో ప‌రిచ‌య‌మైన ఓ అమ్మాయిని ఏం చేయాల‌ని అనుకుంటున్నావ్‌? అని అడిగితే... ఆరు నెల‌ల వ‌ర‌కూ ఎవ‌ర‌నీ తాక‌న‌ని చెప్పిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

"క‌ల‌వ‌డం కుద‌ర‌క‌పోతే మ్యాచ్ అయ్యి ఏం లాభం? అలా మాట్లాడుతూనే ఉండ‌టానికి నేను ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోలేదు. కోవిడ్‌-19 నెగిటివ్ స‌ర్టిఫికెట్ల‌ను ఎప్పుడూ ప‌ట్టుకొని తిర‌గాలా?"

ఎల్‌జీబీటీ స‌భ్యులుగా ఎక్కువ‌గా వాడే గ్రైండ‌ర్ యాప్‌లో.. వినియోగ‌దారుల మ‌ధ్య దూరం ఎంతో క‌నిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ దూరం.. అనంతంగా మారిపోయింది. ఈ యాప్ మొద‌ట 2009లో వ‌చ్చింది. హాస్యాస్ప‌దం ఏమిటంటే.. ఈ యాప్ ఐకాన్ కూడా ఒక మాస్క్‌లా క‌నిపిస్తుంది.

"ముఖాలపైన మాస్క్‌లు పెట్టుకొని మేం భ‌విష్య‌త్‌లోకి వెళ్తాం" అని నోయిడాకు చెందిన ఓ స్వ‌లింగ సంప‌ర్కుడు అన్నారు.

"ఇది చాలా భయాన‌క‌మైన ప‌రిస్థితి. ఇప్ప‌టికీ మేం ఎయిడ్స్‌కు భ‌య‌ప‌డుతుంటాం. ఇప్పుడు క‌రోనావైర‌స్ కూడా తోడైంది."

ఒక‌వేళ చివ‌ర‌కు వ్యాక్సీన్ వ‌చ్చినా... ప‌ర‌స్ప‌రం కౌగిలించుకొనేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఏదిఏమైనా.. భ‌విష్య‌త్‌లో సెక్స్, ల‌వ్‌, రొమాన్స్ చాలా మార‌బోతున్నాయి.

"ఇప్పుడు జీవిత భాగ‌స్వామి ఎక్కువ‌సేపు మీతో స‌మ‌యం వెచ్చిస్తున్నారు. దీనికి కొంద‌రు అల‌వాటు ప‌డ‌లేక‌పోతున్నారు "అని సెహెగ‌ల్ అన్నారు.

మ‌రోవైపు విడాకుల కోసం వ‌స్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గృహ హింస కూడా పెరుగుతోంది.

అనుప‌మ్ కాంప్లెక్స్‌లోని ఒక చిన్న దుకాణంలో క‌లిసిన వ్య‌క్తితో దిశి(పేరు మార్చాం) 2018 నవంబ‌రు నుంచి రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారు. వీరు టిండ‌ర్‌లో కలిశారు.

మార్చి 2019 నుంచి వారు స‌హ‌జీవనం చేయ‌డం మొద‌లుపెట్టారు. దిశి ఒక బై-సెక్సువ‌ల్‌. వీరు స‌హ‌జీవనం మొద‌లుపెట్టే ముందే ఈ విష‌యం గురించి చ‌ర్చించారు.

"మేం రిలేష‌న్‌షిప్ మొద‌లుపెట్టేట‌ప్పుడే అన్ని మాట్లాడుకున్నాం. నాకైతే మా బంధం బ‌ల‌ప‌డింద‌ని అనిపిస్తోంది.. మేం హ‌ద్దులు ముందే పెట్టుకున్నాం. రిలేష‌న్‌షిప్ బ‌ల‌ప‌డాలంటే ఇది చాలా ముఖ్యం" అని ఆమె అన్నారు.

మ‌రోవైపు కండోమ్‌, గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల విక్ర‌యాలూ పెరిగాయి. ఈ ఏడాది డిసెంబ‌రులో క‌రోనావైర‌స్ ప‌తాక స్థాయికి చేరుతుంద‌ని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ స‌మ‌యంలో పుట్టేవారంతా 2033తో క్వారం"టీన్స్‌"గా మార‌బోతున్నారు.

న్యూయ‌ర్క్‌లో అయితే జూమ్ వివాహాల‌ను చ‌ట్ట‌బ‌ద్ధం కూడా చేశారు.

భార‌త్‌లోనూ కొన్ని జూమ్ పెళ్లిళ్లు, వార్షిక వేడుక‌లు నిర్వ‌హించారు. భౌతిక దూరం నిబంధ‌న‌లు పాటిస్తూ, త‌క్కువ మంది అతిథుల‌ను ఆహ్వానిస్తూ కొన్ని నిజ‌మైన పెళ్లిళ్లు కూడా జ‌రిగాయి.

నిజానికి తాజా ప‌రిస్థితుల‌కు చాలా మంది ఎప్పుడో అల‌వాటు ప‌డిపోయారు. కొంద‌రు ఇంకా సాధార‌ణ ప‌రిస్థితి కోసం ఎదురుచూస్తున్నారు. మిగ‌తావారు వ‌ర్చువ‌ల్ ప్రేమ‌ల్లో మునిగి తేలుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
fear is being created among people with Coronavirus over Dating and Sex
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X