వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ క్రికెట్ కోసం నిబద్దతను చాటుకుంటున్న ఒప్పో: భారతదేశంపై ఉన్న అభిమానాన్ని చాటింది

Google Oneindia TeluguNews

ఒప్పో మొబైల్ అందరి హృదయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. మొబైల్ యూజర్ల మనస్సులను దోచింది. వినియోగదారులకు కావాల్సిన ఫీచర్లను ఇస్తూ అందరి చేతుల్లోకి చేరింది. ఒప్పో అంటేనే సెల్ఫీలకు ప్రసిద్ది చెందిన మొబైల్. భారత దేశపు విపణిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒప్పో తన వినూత్న ప్రయోగాలతో, స్టైలిష్ లుక్ తో ప్రజల ఆదరాభిమానాన్ని అందుకుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. అంతే కాకుండా ఒప్పో భారతదేశ క్రికెట్ టీం కు గౌరవనీయమైన స్పాన్సర్షిప్ అందించి, క్రికెట్ అభిమానుల మనసులో ప్రత్యేక స్థానాన్ని కూడా సంతరించుకుంది.

భారత దేశంలో హాకీ నేషనల్ గేం అయినప్పటికీ క్రికెట్ అభిమానుల సంఖ్యే ఎక్కువ. దేశంలో నలుమూలలా ఉన్న క్రికెట్ అభిమానులే లక్ష్యంగా ఒప్పో బ్రాండ్.. తన అధికారిక సేవలను విస్తరించడంలో భాగంగా, భారతదేశపు క్రికెట్ జట్టుతో అనుసంధానమై గౌరవనీయ స్పాన్సర్షిప్ అందిస్తూ యువత మనస్సులో చెరగని చోటును సంపాదించుకుంది. తన మొబైల్ ఫీచర్స్, సర్వీసులను దేశమంతటా తెలిసేలా చేయడంలో విజయవంతమైందనే చెప్పవచ్చు.

ఆన్ - బోర్డ్ బాలీవుడ్ తారలైన దీపికా పడుకొనే, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి నటీమణుల నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయినవిరాట్ కోహ్లి వరకు, ఒప్పో అసాధారణ అజెండాను కలిగి ఉంది. తద్వారా తమ ఉత్పత్తుల గురించిన ప్రచారంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడింది.

ఇప్పుడు భారత దేశ క్రికెట్ జట్టుకు ప్రోత్సాహమిచ్చే భాగంలో ఒప్పో F7 క్రికెట్ లిమిటెడ్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ క్రికెట్ అభిమానుల ఐపిఎల్ ఫీవర్ ను క్యాష్ చేసిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ లిమిటెడ్ ఎడిషన్లో పాపులర్ క్రికెట్ స్టార్స్ అయిన హార్దిక్ పాండ్యా, అశ్విన్, రోహిత్ శర్మ సంతకాలను మొబైల్ పై ముద్రించడం ద్వారా ఐపిఎల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోగలిగింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్లను మీరు పొందలేకపోయినా కూడా, మిగిలిన మొబైల్స్ ఈ సంతకాలతో కూడిన ఫాన్సీ కవర్లతో అందుబాటులోకి రానున్నాయని ఒప్పో తెలిపింది. ఫీచర్లు మాత్రం యధాతధం.ఈ రియల్ చాంపియన్స్, ఇప్పుడు సంతకాల రూపంలో మీ మొబైల్ లో దర్శనమివ్వబోతున్నారు.

ఒప్పో ఇటీవల క్రికెట్ తో తన అనుబందాన్ని బలపరచింది. ఆ క్రమంలో భాగంగా ఒప్పో ఒక కార్యక్రమాన్ని కూడా ముంబైలో నిర్వహించింది.ఈ కార్యక్రమంలో కొన్ని రౌండ్ల సెలక్షన్ తర్వాత, 20 మంది క్రికెట్ అభిమానులను ఎంపిక చేసి, 2 సంవత్సరాల పాటు వారి వారి నైపుణ్యాలకు సంబంధించిన ట్రైనింగ్ ను ఉచితంగా ఇవ్వనుంది.
భారతదేశ క్రీడల విభాగంలో తనకున్న నిబద్దతను ఈ విధంగా చాటుకున్న ఒప్పో, అందరికీ ఆదర్శంగా నిలిచింది కూడా. అంతేకాకుండా దేశంలోని అత్యుత్తమ క్రికెట్ అకాడమీలలో ప్రతిభా వంతులుగా ఉన్న అనేకులకు వారి జీవిత గమనాలపై సరైన అవకాశాలను అందించేలా ప్రయత్నాలను కొనసాగించనుంది.

ఒప్పో F7 కార్యక్రమంలో రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా వంటి దిగ్గజాలను తన బ్రాండ్ అంబాసిడర్లుగా, పునాదులుగా మలచుకుoది. ప్రస్తుతం అండర్ 19 కెప్టన్ పృధ్వీ షా, దేశంలోని ప్రతిభావంతులైన క్రికెట్ ఆటగాళ్ళకు స్పూర్తిగా నిలిచాడు అనడంలో ఆశ్చర్యమేలేదు. పృధ్వీ తన 5 వఏట నుండే క్రికెట్ పట్ల మక్కువ కలిగి ఉన్నాడు, తద్వారా భవిష్యత్తులో రానున్న అనేకమంది క్రికెట్ ఆటగాళ్లకు స్పూర్తిగా నిలవనున్నాడు అనడంలో అతిశయోక్తే లేదు.

ఒప్పో బ్రాండ్ డైరెక్టర్ విల్ యాంగ్ ప్రకారం, "పిల్లలు సమాజంలో వెన్నెముకగా ఉన్నారు. ఈ నిరుపేద పిల్లల కలలకి మద్దతు ఇవ్వడానికి మరియు క్రికెట్ మైదానంలో ఒక వైవిధ్యతను సృష్టించేందుకు వారి లక్ష్యాలను సాధించడంలో ఇది మాకు ఒక గొప్ప అవకాశంగా ఉంది ఒప్పో ఒక బ్రాండ్ గా, ఎల్లప్పుడూ భారత్లోని ప్రతిభావంతులైన యువతకు ఉత్తేజాన్ని ఇచ్చి, వారు ఎంపిక చేసుకున్న రంగంలో వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ఎల్లప్పుడూ ముందుగా ఉంటాము. ఎంతోమంది నిరుద్యోగులు, పేదవారు సరైన ప్రోత్సాహకం లేక, తమ టాలెంట్ ను మరుగున పడేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి, వారి ప్రతిభను వెలికితీసే క్రమంలో భాగంగా మా ఒప్పో బ్రాండ్ కీలక నిర్ణయం తీసుకుంది, వారి భవిష్యత్తు దేశ పురోగమనానికి, ఆర్ధికాభివృద్దికి, దేశ ప్రతిష్టతకు ఎంతో ముఖ్యం. వారికి సరైన ప్రోత్సాహకాలను, వనరులను అందించడం ద్వారా మేము వారి అభివృద్దికి తోడ్పడగలము" అని తెలిపారు.

క్రికెట్, భారతదేశంలో, క్రీడ మాత్రమే కాదు. అది ఒక మతం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. క్రికెట్ మన ఊపిరిలా నరనరాల్లో పాతుకునిపోయి ఉంది. ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని, చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ బ్రాండ్ ఒప్పో , దేశంలోని మొత్తం క్రికెట్ పర్యావరణ విధానాన్నే మెరుగుపరిచేలా రూపొందించిన నూతన, ఉత్తేజకరమైన కార్యక్రమాలు యువతకు ఎంతో ప్రోత్సాహకాన్ని అందిస్తాయి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

ఇప్పుడు, OPPO నిర్వహించిన ఈ తాజా కార్యక్రమం కచ్చితంగా ముందుకు సాగుతున్న భారత దేశ జాతీయ క్రికెట్ జట్టుకు సేవలను అందించగల యువ ప్రతిభకు ఎంతో ప్రోత్సాహకాన్ని ఇస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఒప్పో తీసుకున్న ఈ నిర్ణయం, మంబైలో నిర్వహించిన కార్యక్రమంపై దేశమంతా హర్షం వ్యక్తం చేసింది. బిజినెస్ అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు, తమ లాభాలలో కొంత భాగాన్నైనా దేశ సేవకు వినియోగించడం ద్వారా దేశ అభివృద్దికి తోడ్పాటును అందివ్వగలమన్న నినాదంతో ముందుకు వచ్చిన ఒప్పో బ్రాండ్ పై వినియోగదారులు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఐపీఎల్ స్పాన్సర్షిప్ లో భాగంగా విడుదల చేసిన ఒప్పో F7 మోడల్, వినియోగదారుల మనసును గెలిచింది. కొత్తగా విడుదల చేసిన క్రికెట్ ఎడిషన్ కూడా అధిక ప్రాధాన్యతను సంతరించుకుందని మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయం.

ఒప్పో బ్రాండ్ తీసుకున్న ఈ నిర్ణయం మీకెలా అనిపించింది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలుపగలరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X