వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరులో ఓలా, ఉబెర్ షేర్ సర్వీసులు రద్దు, మహిళలకు వేధింపులు, ఆర్ టీఓలకు ఆదేశాలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఓలా, ఉబెర్ క్యాబ్ ల యాజమాన్యానికి కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో ఓలా, ఉబెర్ షేర్ క్యాబ్ సర్వీసులు పూర్తిగా రద్దు చేస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నియమాలు ఉల్లంఘించి ఎవరైనా ప్రవర్థిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది.

జూన్ 28వ తేదీ శుక్రవారం బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వ రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి వీపీ. ఇక్కేరి ఆధ్వర్యంలో అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓలా షేర్ క్యాబ్ సర్వీసులు, ఉబెర్ పూలింగ్ సేవల తీరుపై ప్రధాన చర్చ జరిగింది. షేర్ క్యాబ్ సర్వీసుల్లో ప్రయాణికులకు రక్షణ లేదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Recommended Video

విజయవాడ రైల్వే స్టేషన్ లో దారుణం.. వృద్దురాలిని వివస్త్ర ని చేసి దాడి
With intimidate effect transport department has cancelled Ola and Uber share system in Karnataka.

మహిళా ప్రయాణికుల సురక్షితంగా ప్రయాణిస్తున్నారా అనే విషయంలో అధికారులు చర్చించారు. ఓలా షేర్ క్యాబ్ లు, ఉబెర్ పూలింగ్ వేళల్లో మహిళా ప్రయాణికుల రక్షణ కరువైయ్యిందని, మహిళా ప్రయాణికులకు వేధింపులు ఎక్కువ అయ్యాయని తమ విచారణలో వెలుగు చూసింది.

మహిళా ప్రయాణికులకు రక్షణ లేదని వెలుగు చూడటంతో తక్షణం ఆ సేవలు పూర్తిగా రద్దు చెయ్యాలని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి వీపీ. ఇక్కేరి అన్నారు. ఓలా షేర్ క్యాబ్ లు, ఉబెర్ పూలింగ్ చేవలు కొనసాగిస్తే క్యాబ్ లు సంచరించడానికి ఇచ్చిన అనుమతులు పూర్తిగా రద్దు చేస్తామని ఓలా క్యాబ్, ఉబెర్ సంస్థలను కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది.

రవాణా శాఖ అధికారులు నిర్వహించిన ఈ సమావేశంలో ట్యాక్సీ సర్వీసుల యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ట్యాక్సీ యజమానులు, డ్రైవర్లతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి వీపీ. ఇక్కేరి తెలిపారు. ప్రభుత్వ నియమాలు ఉల్లించి ఎవరైనా ప్రవర్థిస్తే అలాంటి వారి మీద తక్షణం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటకలోని ఆర్ టీఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి వీపీ. ఇక్కేరి తెలిపారు.

English summary
With intimidate effect transport department has cancelled Ola and Uber share system in Karnataka. Sharing system cancelled in a view of safety of women passengers. Karnataka Transport Commissioner V.P.Ikkeri said that action would be taken against in the case of violations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X