వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 నుంచి మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు ఓపెన్, ప్రార్థనాలయాలు కూడా: కొత్త నిబంధనలివే..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ 5.0ను ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ప్రకంటించిన మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుంచి షాపింగ్స్ మాల్స్, రెస్టారెంట్లు, ప్రార్తనా మందిరాలు తెరచుకోవచ్చు. అప్పుడే ఇందుకు సంబంధించిన కొన్ని నిబంధనలను విధించిన కేంద్రం.. తాజాగా గురువారం మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

కరోనా హాట్ స్పాట్‌గా ఢిల్లీ ఎయిమ్స్: వైద్యులు, నర్సులతోపాటు 480కి సోకిన మహమ్మారికరోనా హాట్ స్పాట్‌గా ఢిల్లీ ఎయిమ్స్: వైద్యులు, నర్సులతోపాటు 480కి సోకిన మహమ్మారి

ప్రార్థనాలయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ప్రార్థనాలయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

కాగా, కరోనా లాక్ డౌన్ కారణంగా భక్తుల సందర్శనలు లేని ఆలయాలు, ప్రార్థనా మందిరాలు సుమారు 75 రోజుల తర్వాత సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో పాటించాల్సిన కీలక మార్గదర్శకాలను కేంద్రం తెలిపింది. ఆలయంలో విగ్రహాలను తాకరాదని స్పష్టం చేసింది.

1. ప్రవేశ ద్వారం వద్ద తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ ఉండాలి.
2. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే అనుమతించాలి.
3. అందరినీ మాస్క్ లేదా ఫేస్ కవర్ ఉంటేనే అనుమతించాలి. లోపల ఉన్నంత సేపు వారు మాస్క్, ఫేస్ కవర్ ధరించాలి.
4. కోవిడ్ 19 రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోస్టర్లు, స్టాండ్లు, ఆడియో విజువల్ మీడియం ద్వారా తప్పక ప్రదర్శించాలి.
5. చెప్పులు, బూట్లు లాంటివి సొంత వాహనాల్లో వదిలి వచ్చేలా చూడాలి. లేకపోతే వారి కోసం ప్రత్యేక షూ, చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేయాలి.
6. ప్రార్థనా మందిరాల లోపల, బయట, పార్కింగ్ ప్రాంతాల్లో భక్తుల రద్దీని నియంత్రించాలి.
7. దుకాణాలు, స్టాల్స్, క్యాంటీన్ల వద్ద తప్పనిసరిగా సామాజిక దూరం పాటించేలా చూడాలి.
8. క్యూ మార్గాల్లో మార్కింగ్‌లు గీసి వాటిని ఫాలో కావాలని భక్తులకు సూచించాలి.
9. లోనికి వెళ్లేందుకు ఒక మార్గం, బయటకు వెళ్లేందుకు మరో మార్గం ఉండాలి.
10. క్యూలో లోనికి వెళ్లే సమయంలో కనీసం ఒకరికి మరొకరికి మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించాలి.
11. ప్రార్థన మందిరం ప్రాంగణంలోనికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సబ్బుతో లేదా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
12. ఏసీలు, వెంటిలేటర్లను సీపీడబ్ల్యూడీ నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలి.
13. ఆలయాల్లో విగ్రహాలను ఎవరూ తాకకుండా చూడాలి.
14. పెద్ద ఎత్తున భక్తి గీతాలు పెట్టి వాటిని భక్తులు పాడటం ద్వారా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటే అలాంటివి విస్మరించాలి.
15. ప్రార్థనల సమయంలో ఎవరి మ్యాట్ వారే తెచ్చుకునేలా ప్రోత్సహించాలి.
16. ప్రసాదాలు, తీర్థం, తలపై జలాలు చల్లడం లాంటివి ఉండకూడదు.
17. అన్నదానం లాంటివి చేసేటప్పులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి.
18. ప్రార్థన మందిరాల ప్రాంగణాలను తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి.
19. ఫేస్ కవర్లు, ఫేస్ మాస్క్‌లను ఎక్కడ పడేయాలో భక్తులకు చెప్పాలి.

హోటళ్లు, రెస్టారెంట్లు..

హోటళ్లు, రెస్టారెంట్లు..

హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌‌లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మార్గదర్శకాలను కూడా కేంద్రం వెల్లడించింది.

1. అన్నిచోట్లా సామాజికదూరం పాటించాలి. కనీసం 6 అడుగుల దూరం ఉండాలి.
2. ఫేస్ మాస్క్‌లు, ఫేస్ కవర్లు వినియోగం తప్పనిసరి.
3. తరచుగా సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి (కనీసం 20-40 సెకన్ల వరకు).
4. ఎవరైనా దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు టిష్యూలు, చేతి రుమాళ్లు అడ్డుపెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని సూచించిన చోట మాత్రమే పడేయాలి.
5. ఎవరికి వారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా అనారోగ్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి.
6. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం కచ్చితంగా నిషేధం7. ఆరోగ్య సేతు యాప్ వినియోగించేలా అందరినీ ప్రోత్సహించాలి.

Recommended Video

Lockdown : AP Ready To Unlock Restaurants & Hotels In These 4 Districts From June 8
షాపింగ్ మాల్స్ మార్గదర్శకాలు..

షాపింగ్ మాల్స్ మార్గదర్శకాలు..

మాల్ కు వచ్చిన తర్వాత ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయితే, ఆ రోగి గత 48 గంటలు తిరిగిన ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. షాపింగ్ మాల్ మొత్తం మూసేయాల్సిన అవసరం లేదు. మొత్తం శుభ్రం చేసిన తర్వాత మళ్లీ ప్రారంభించవచ్చు. ఒకవేళ భారీ ఎత్తున కోవిడ్ 19 కేసులు నమోదైతే అప్పుడు పూర్తిగా శుభ్రం చేసి.. ఆ తర్వాత దుకాణాలు మూసేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించుకున్న తర్వాత మళ్లీ తెరవాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు..

1. ఎంట్రన్స్‌లో తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ ఉండాలి.
2. కరోనా లక్షణాలు లేని కస్టమర్లను మాత్రమే అనుమతించాలి.
3. వర్కర్లు, కస్టమర్లు, విజిటర్లు అందరినీ మాస్క్ లేదా ఫేస్ కవర్ ఉంటేనే అనుమతించాలి. షాపింగ్ మాల్‌లో ఉన్నంత సేపు వారు మాస్క్, ఫేస్ కవర్ ధరించేలా చూడాలి.
4. కోవిడ్ 19 రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోస్టర్లు, స్టాండ్లు, ఆడియో విజువల్ మీడియం ద్వారా ప్రదర్శించాలి.
5. మాల్‌‌కు వచ్చిన కస్టమర్లు సామాజిక దూరం పాటించేలా చూడడానికి సరిపడినంత మంది వర్కర్లను వినియోగించాలి.
6. హైరిస్క్ ఉన్న ఉద్యోగులు, వయసు ఎక్కువ ఉన్న ఉద్యోగులు, గర్భిణులు, వైద్య చికిత్స తీసుకుంటున్న వారు మరింత ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. ఫ్రంట్ లైన్ వర్కర్లకు దూరంగా ఉండాలి. వీలుంటే వారికి వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలి.
7. షాపింగ్ మాల్ బయట, లోపల పార్కింగ్ మేనేజ్‌మెంట్ చేయాలి.
8. షాపింగ్ మాల్‌లో ఉండే దుకాణాలు, స్టాల్స్, క్యాంటీన్లలో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి.
9. కస్టమర్లు లోనికి వెళ్లడానికి ఓ మార్గం, బయటకు వెళ్లడానికి మరో మార్గం ఉండేలా చూడాలి.
10. లిఫ్ట్‌లో తక్కువ మంది వెళ్లేలా నిబంధనలు విధించాలి.
11. ఎస్కలేటర్లపై ఒక మెట్టు మీద ఒకరే ఉండేలా చూడాలి.
12. షాపింగ్ మాల్స్‌లో పెద్దన ఎత్తున కార్యక్రమాలు నిర్వహించకూడదు.
ఇక పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇళ్లలోనే ఉంటే మంచిదని కేంద్రం స్పష్టం చేసింది.

English summary
The government on Thursday announced new rules for allowing shopping malls, restaurants, hotels and places of worship to open gradually following the nationwide COVID-19 lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X