వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెప్టెంబర్‌లో జల్లులు.. సీజన్‌లో మాత్రం సాధారణ వర్షపాతం.. 10 కొత్త డాప్లర్ రాడార్లు: ఐఎండీ

|
Google Oneindia TeluguNews

సెప్టెంబర్‌లో వర్షాలు ఎక్కువగానే ఉంటాయని భాతర వాతావరణ శాఖ తెలిపింది. అయితే సీజన్ మాత్రం సాధారణ వర్షపాతంతో ముగుస్తోందని పేర్కొన్నది. కాస్త విరామం తర్వాత నైరుతి రుతుపవనాల మరోసారి రానున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ నెల 17వ తేదీ తర్వాత వర్షాలు పడతాయని తెలిపింది. వాయవ్య ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా వర్ష ప్రభావం ఉంటుందని ఐఎండీ వివరించింది.

రెండోవారంలో మద్య, పశ్చిమ ప్రాంతంలో వర్షపాతం ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మెహపాత్రా తెలిపారు. 17వ తేదీన మాత్రం బే ఆఫ్ బెంగాల్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో దేశంలోని మధ్య భారతంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. కానీ మొత్తంగా మాత్రం సాధారణ వర్షపాతం నమోదవుతుందని వివరించారు.

With more showers in September, season to end with normal rainfall: IMD

మహారాష్ట్ర, ఈశాన్య భారతదేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని మృత్యుంజయ్ తెలిపారు. భూమద్యరేఖ, పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయని పేర్కొన్నారు. నిర్దేశిత సమయానికే రుతుపవనాలు వెనక్కి వెళ్లిపోతాయని.. అయితే దేశంలోని మిగిలిన ప్రాంతం నుంచి తిరోగమనం గురించి అంచనా వేయలేమని పేర్కొన్నారు.

Recommended Video

COVID-19 In India : 90,633 కొత్త కేసులు, US, Brazil కలిపినా ఇండియాకు సమానం కాలేదు!! | Oneindi Telugu

గతనెలలో 27 శాతం వర్షం ఎక్కువే కురిసిందని. కానీ సెప్టెంబర్ నెలలో మాత్రం అది తక్కువగా ఉందన్నారు. సీజన్ మాత్రం సాధారణ వర్షపాతంతో ముగుస్తోందని మాత్రం లెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది 10 కొత్త డాప్లర్ రాడార్లు అందుబాటులోకి వస్తాయని మృత్యుంజయ్ పేర్కొన్నారు. దీంతో మరింత కచ్చితత్వంతో రుతుపవనాల రాక, వర్షపాతం నమోదు చేయొచ్చని తెలిపారు.

English summary
Southwest monsoon will revive over major parts of the country around September 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X