వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాళ్లు రువ్వినవారే యూనివర్సిటీలోకి వెళ్లారు: ఢిల్లీ పోలీసుల కొత్త వీడియో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జామియా యూనివర్సిటీ వద్ద సీఏఏకు వ్యతిరేక ఆందోళనల సందర్భంగా డిసెంబర్ 15న జరిగిన హింసాత్మక ఘటనలపై తాజాగా విడుదలైన వీడియో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు యూనివర్సిటీలోకి వెళ్లారు. లైబ్రరీ వద్దకు చేరుకున్నట్లు ఆ సీసీ కెమెరా వీడియోలు వెల్లడిస్తున్నాయి.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పావాయుగోళాలను ప్రయోగించారు. యూనివర్సిటీ వర్సిటీలోని ఓ భవనం వద్ద, భవనం లోపల భారీ సంఖ్యలో ఉన్న విద్యార్థులు, ఆందోళనకారులు బయటికి పరుగులు తీసుకుంటూ వచ్చారు. ముసుగులు ధరించిన వారు లైబ్రరీలోకి పారిపోయారు.

with-new-videos-of-stone-throwers-delhi-police-defends-jamia-university-crackdown

అయితే, లైబ్రరీలోకి వచ్చిన పోలీసులు అక్కడ ఉన్న విద్యార్థులను ఇష్టానుసారంగా కొట్టారని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ఈ వీడియో ద్వారా ఆందోళనకారులే ఆ లైబ్రరీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాళ్లు రువ్వినవారిని తరుముకుంటూ పోలీసులు వెళ్లారని అధికారులు చెబుతున్నారు. అయితే, లైబ్రరీలోకి వెళ్లలేదని చెప్పారు.

యూనివర్సిటీ యాజమాన్యం అనుమతి లేకుండా పోలీసులు ఏ యూనివర్సిటీలోకి వెళ్లలేరని సీనియర్ పోలీస్ అధికారి ఎంఎస్ రంధ్వా తెలిపారు. కాగా, ఆ రోజున పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పావాయుగోళాలను ప్రయోగించడం.. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం జరిగింది. కాగా, ఆందోళనకారులు మూడు బస్సులకు నిప్పుపెట్టారు. మరో రెండు ద్విచక్ర వాహనాలను తగలబెట్టారు. అయితే, పోలీసులు లైబ్రరీలోకి వచ్చి దాడి చేశారంటూ ఓ వీడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కాగా, ఆందోళనల నేపథ్యంలో పది మంది వర్సిటీ విద్యార్థులకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

English summary
A fresh batch of videos from Jamia University have been cited by the Delhi Police as evidence that protesters responsible for the violence of December 15, had taken shelter in the university building where the library is located.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X