వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Must Read:కొత్త బడ్జెట్ మరియు వేజ్‌ కోడ్‌తో ఉద్యోగస్తులకు నష్టమే..ఎలా అంటారా..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఉద్యోగస్తులకు నిర్మలమ్మ ఈ బడ్జెట్‌లో ఎలాంటి ఊరట కల్పించలేదు. బడ్జెట్ అనగానే ముందుగా ఉద్యోగస్తులు ఎదురు చూసేది టాక్స్ అంశం. అయితే ఈ సారి వ్యక్తిగత పన్నులో సీనియర్ సిటిజెన్స్‌కు మినహాయింపులు తప్ప సాధారణ ఉద్యోగస్తులకు మాత్రం ఎలాంటి ప్రకటనలు లేవు సరికదా.. వేతనాలు తీసుకునే ఉద్యోగస్తుల పరిస్థితి గుండె జారి కడుపులో పడ్డట్టుగా అయ్యింది.

నిర్మలమ్మ బడ్జెట్‌: కొత్త యాప్: ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?: ఆ భారంపైనే అందరి భయాలునిర్మలమ్మ బడ్జెట్‌: కొత్త యాప్: ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?: ఆ భారంపైనే అందరి భయాలు

టేక్‌-హోం-శాలరీపై ప్రభావం

టేక్‌-హోం-శాలరీపై ప్రభావం

జీతాలు పొందే ఉద్యోగస్తులకు ఇది బ్యాడ్ న్యూస్ అవుతుంది. 2021 బడ్జెట్‌‌ను కొత్తగా తీసుకొచ్చిన వేతన కోడ్‌తో కలపడం వల్ల ఉద్యోగస్తులు టేక్-హోం-శాలరీ తగ్గడంతో పాటు పదవీవిరమణ చేసిన తర్వాత వారు పొందాల్సిన సేవింగ్స్‌ కూడా తగ్గిపోనున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ పై వచ్చే వడ్డీపై ఆంక్షలు విధిస్తూ నిర్మలమ్మ బడ్జెట్ సాగింది. పీఎఫ్‌ పై వచ్చే వడ్డీ రూ.2.50 లక్షలు ఉంటే దానిపై పన్ను ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేశారు. చాలా మంది మధ్య తరగతి ఉద్యోగస్తులకు పీఎఫ్ అనేది ఓ పెద్ద భరోసాగా ఉంది. వారు పదవీ విరమణ పొందిన తర్వాత పీఎఫ్ ద్వారా వచ్చే మొత్తం వారికెంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానిపై ఇప్పుడు పన్ను విధించడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాశీ ఖన్నా గ్లామరస్ ఫోటో షూట్.. మీరెప్పుడూ చూడని అందాలు

వేజ్ కోడ్ ప్రకారం...

వేజ్ కోడ్ ప్రకారం...

ఇప్పటివరకు, పన్ను రహిత రాబడిని పొందడానికి ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టగల మొత్తానికి పరిమితి లేదు. అయితే గతేడాది బడ్జెట్‌లో ప్రావిడెంట్ ఫండ్ పథకాలపై ఏడాదికి రూ.7.5 లక్షలు సీలింగ్ విధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే తాజాగా ఏడాదికి రూ.2.5 లక్షలు మేరా ఈపీఎఫ్‌కు జమచేశాక ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే సమయంలో పన్ను విధించబడుతుంది. దీంతో పాటుగా... 2019 వేజ్ కోడ్ ప్రకారం పీఎఫ్‌కు జమచేసే మొత్తాన్ని పెంచుతూ నాడు పార్లమెంటులో ప్రతిపాదించారు. దీంతో టేక్-హోమ్-శాలరీ తగ్గిపోయింది. 2019 వేతనాల కోడ్ ప్రకారం మొత్తం పరిహారాల రూపంలో వచ్చే అలవెన్స్‌పై 50శాతం పరిమితి విధించింది. దీంతో యాజమాన్యాలకు ఇది అధిక ఖర్చుతో కూడినదై మారడంతో ఆ ప్రభావం ఉద్యోగస్తుల టేక్-హోం-శాలరీపై పడింది.

 రిటైర్ అయిన తర్వాత సేవింగ్స్ పై నష్టం

రిటైర్ అయిన తర్వాత సేవింగ్స్ పై నష్టం


ఉదాహరణకు అరుణ్ అనే వ్యక్తి నెల జీతం రూ.లక్ష అనుకుంటే... పీఎఫ్‌ రూపంలో రూ.20వేలు కట్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వేజ్ కోడ్ అమలు కావడంతో పీఎఫ్ రూ.25 వేలు కట్ అవుతోంది. దీంతో అతని టేక్-హోం- శాలరీ కూడా రూ.5వేలు తగ్గుతుంది. ఇప్పుడు అరుణ్ జీతంలో నుంచి రూ.25వేలు పీఎఫ్‌కు కట్ అవుతోంది కాబట్టి ఏడాదికి పీఎఫ్‌ కోసం చెల్లిస్తున్న మొత్తం రూ.3లక్షలు. అంటే ప్రభుత్వం చెప్పినట్లుగా ఆ మొత్తం ఏడాదిలో రూ.2.5 లక్షలు కంటే ఎక్కువ ఉన్నందను దానిపై పన్ను విధించడం వల్ల ఆ డబ్బులు విత్ డ్రా చేసుకున్నప్పుడు రావాల్సినదానికంటే తక్కువగా వస్తుంది. అంటే ఇలా తన పొదుపు మొత్తంపై కూడా ప్రభావం చూపనుంది.

English summary
When Budget 2021 and Wage code come into effect both take home salary and retirement savings of an employ will be hit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X