వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ పెరిగిన బంగారం ధరలు... ఇలా అయితే కొనడం కష్టమే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు || Gold Prices Hit New Highs In Indian Market || Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత మార్కెట్లో బంగారం, మరియు వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో బంగారు ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతేకాదు డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమైంది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర 0.42శాతం పెరిగి రూ. 39,109కి చేరింది. ఇక వెండి ధరలు రికార్డు స్థాయిలో రూ. 48,970కి చేరింది. 0.5శాతం పెరుగుదల కనిపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.37గా ఉంది.గత వారం 10 గ్రాముల బంగారం ధర రూ. 39,425గా ఉన్నింది.

 బంగారం పై పెరిగిన పెట్టుబడులు

బంగారం పై పెరిగిన పెట్టుబడులు


ప్రపంచ మార్కెట్లలో ఔన్సు పుత్తడి ధర 0.3శాతం పడిపోయి 1,525 డాలర్లకు చేరుకుంది. గత వారం ఔన్సు బంగారం ధర 1,554.56 డాలర్లుగా ఉన్నింది. ఇది గత ఆరేళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో బంగారం ధరలు లేవు. ఈ ఏడాదిలో బంగారం ధరలు దాదాపు 20శాతం పెరిగాయి. అంతేకాదు బంగారం పై పెట్టుబడులు కూడా పెరిగాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్దం జరుగుతుండటంతో ఈక్విటీలు, ఇక ఆయాదేశాల సెంట్రల్ బ్యాంకులు ప్రవేశపెట్టిన ద్రవ్య పరపతి విధానాలతో బంగారం ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక గోల్డ్‌మ్యాన్ శాక్స్, యూబీఎస్ గ్రూపుల్లో పనిచేసే అనలిస్టులు మాత్రం భవిష్యత్తులో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

సెన్సెక్స్ ఢమాల్...స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్న భయాలు ఏంటి..?సెన్సెక్స్ ఢమాల్...స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్న భయాలు ఏంటి..?

 2013 తర్వాత తొలిసారిగా బంగారంపై పెరిగిన పెట్టుబడులు

2013 తర్వాత తొలిసారిగా బంగారంపై పెరిగిన పెట్టుబడులు

ఇక బంగారంపై పెట్టుబడులు వెల్లువ నడుస్తోందని ఈటీఎఫ్ పేర్కొంది. ఒక్క ఆగష్టులోనే 100 టన్నుల బంగారంపై పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. 2013 ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో బంగారంపై ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారని బ్లూంబర్గ్ నివేదిక వెల్లడిస్తోంది. మదుపరులు తమ ఆస్తుల్లో నుంచి 10శాతం బంగారం కోసం కేటాయింపులు చేయాలని వెటరన్ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా వస్తువులపై 15శాతం సుంకాన్ని ఆదివారం నుంచి విధించగా... చైనా కూడా అమెరికా ముడి చమురుపై కొంత సుంకాన్ని విధించింది. అంతేకాదు అమెరికాపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చైనా ప్రకటించింది.

 పండగ సీజన్‌లో మరింత పెరిగనున్న పసిడి ధరలు

పండగ సీజన్‌లో మరింత పెరిగనున్న పసిడి ధరలు


భారత్ విషయానికొస్తే రానున్న పండగ సీజన్‌లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నగల దుకాణాల యజమానులు భావిస్తున్నారు. అధిక ధరల కారణంగా బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది వెనకాడుతున్నారని... అయితే పండగ సీజన్ కాబట్టి కచ్చితంగా కొనుగోలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశీయంగా బంగారంపై 12.5శాతం దిగుమతి సుంకం మరియు 3శాతం సేల్స్ ట్యాక్స్ విధించడం జరుగుతోంది. ఇక రూపాయి విలువ కూడా 3.5 శాతం పడిపోవడం కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి. ఇక జూలైలో దిగుమతి సుంకం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పుత్తడి ధరలు ఆకాశాన్నంటాయి.

English summary
Gold and silver prices rose closer to record highs in Indian markets today, bucking global weakness. A sharp fall in rupee's value against the US dollar pushed gold and silver prices higher in Indian markets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X