వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌కు సీతారాం ఏచూరి.. స్నేహితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా ...

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో శ్రీనగర్ వెళ్లి తన స్నేహితుడిని కలుసుకొన్నారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలసుకున్నారు. యూసుఫ్ తారిగామి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అతని కలిసేందుకు ఈ నెలలో రెండుసార్ల కశ్మీర్ వెళ్లారు ఏచూరి. అయితే ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తర్వాత రాజకీయ నేతలను కేంద్ర ప్రభుత్వం అనుమతించని సంగతి తెలిసిందే. దీంతో తన స్నేహితుడిని కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సీతారాం ఏచూరి సుప్రీంకోర్టును తలుపుతట్టగా .. ఊరట లభించిన సంగతి తెలిసిందే.

వచ్చే నెల1 నుంచి కొన్ని భారతీయ వీసాలకు ఇంటర్వ్యూ తొలగింపు!వచ్చే నెల1 నుంచి కొన్ని భారతీయ వీసాలకు ఇంటర్వ్యూ తొలగింపు!

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ ఉదయం సీతారాం ఏచూరి ఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తారిగామి నివాసానికి వెళ్లిపోయారు. తారిగామి మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత. ఏచూరికి మంచి స్నేహితుడు కూడా .. అయితే ఆయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో అతనిని చూసి ఆరోగ్య పరిస్థితి కనుక్కొనేందుకు సీతారం ఏచూరి కశ్మీర్ వెళ్లారు. రెండుసార్లు వెళ్లిన పోలీసులు వెళ్లనీయక అడ్డుకొన్నారు. దీంతో నిన్న ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఓ దేశంలో పౌరుడు ఎక్కడికి వెళ్లాలంటే నిరంభ్యంతరంగా వెళ్లొచ్చని .. ఏచూరిని ఆపడం సరికాదని స్పష్టంచేశారు. గురువారం శ్రీనగర్ వెళ్లేందుకు సీతారాం ఏచూరికి అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్‌తో ఏచూరి శ్రీనగర్ వెళ్లారు.

With SC order, Sitaram Yechury leaves for Srinagar to meet ailing colleague

అయితే ఏచూరి తన స్నేహితుడిని కలిసి వెళ్లిపోవాలని సూచించింది. పర్యటన సందర్భంగా ఎలాంటి రాజకీయాలు చేయొద్దని తేల్చిచెప్పింది. ఒకవేళ ఏచూరి రాజకీయ వ్యాఖ్యలు, పొలిటికల్ లీడర్లతో సమావేశమైతే .. దానికి సంబంధించి ఆధారాలను తమకు సమర్పించాలని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 5 జమ్ము కశ్మీర్ విభజన జరిగిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించి .. పరిస్థితిని పర్యవేక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కశ్మీర్‌లో ఉండి సిచుయేషన్‌ను పరిశీలించిన సంగతి తెలిసిందే.

English summary
After getting a green signal from the Supreme Court, CPI(M) general secretary Sitaram Yechury left for Srinagar from Delhi airport Thursday to meet his ailing party colleague and former MLA Mohammed Yusuf Tarigami. “The Supreme Court has permitted me to go to Srinagar and see Com Yousuf Tarigami and ‘report’ back to them on the condition of his health. Once I meet him, return and report to the Court, I will make a more detailed statement,” he tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X