వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈయన్ను స్వామీజీ అంటారా: మహిళలు ముందు వరుసలో కూర్చున్నారని...

|
Google Oneindia TeluguNews

ఆయన ఓ మోటివేషనల్ స్పీకర్.. తన ప్రసంగంతో అందరినీ ఉత్సాహపరచవలసిన ఆయనే కార్యక్రమంనుంచి బయటకు వెళ్లిపోయారు. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుంది అనగా సభాస్థలికి చేరుకున్న మోటివేషనల్ స్పీకర్ అయిన ఆ స్వామీజీ ప్రసంగించకుండానే వెనుదిరిగాడు. ఇంతకీ ఆయన అలా వెళ్లిపోవడానికి కారణం తెలిస్తే చాలా సిల్లీగా ఉందని నవ్వుకుంటారు. ఆయన స్వామీజీ ఏంటని అంటారు.

బిర్లా ఆడిటోరియంలో కార్యక్రమం

బిర్లా ఆడిటోరియంలో కార్యక్రమం

ఇదిగో ఇక్కడ కాషాయ బట్టలు ధరించి స్వామీజీ గెటప్‌లో కనిపిస్తున్నాయన పేరు స్వామి జ్ఞానవాత్సల్య. ఈయన నిరుత్సాహంతో కూరుకుపోయి జీవితంలో ఏమి సాధించలేకపోయామనే వారిలో ఉత్సాహం నింపి తన ప్రసంగాలతో వారికి జీవితంపై ఆశ కల్పిస్తారు. అంతేకాదు తన ప్రసంగాలతో సాధించలేనిది ఏదీ లేదనే ఆత్మవిశ్వాసం మనుషుల్లో నింపుతారు. అందుకే ఇతని కార్యక్రమాలు ఎక్కడ జరిగినా తమకు సమాధానం దొరుకుతుందేమో అని ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. అలాంటి స్వామి జ్ఞానవాత్సల్య మోటివేషనల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు జైపూర్‌లోని బిర్లా ఆడిటోరియంకు చేరుకున్నారు.

ముందువరసలో కూర్చున్న మహిళా డాక్టర్లు

ముందువరసలో కూర్చున్న మహిళా డాక్టర్లు

జైపూర్‌లోని బిర్లా ఆడిటోరియంలో రాజ్ మెడికాన్ -2019 పేరుతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్ రాజస్థాన్ ఇన్ సర్వీస్ డాక్టర్స్ అసోసియేషన్‌లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రసంగించేందుకు స్వామీజీ మరికాసేపట్లో వేదికపైకి వస్తారనగా ఆడిటోరియం ముందు వరసలో మహిళా డాక్టర్లు కూర్చున్నారు. తను ప్రసంగం చేస్తున్న సమయంలో ముందు వరసలో మహిళలు కూర్చోరాదని అది స్వామి జ్ఞానవాత్సల్య నిబంధన అని ఈవెంట్ నిర్వహించేవారు ఆ మహిళా డాక్టర్లకు చెప్పారు. ఇదెక్కడి నిబంధన అంటూ వారితో వాగ్వాదానికి దిగారు. చివరికి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే తొలి రెండు వరసలు విడిచి మూడో వరస నుంచి మహిళలు కూర్చున్నారు.

ప్రసంగించకుండానే వెనుదిరిగిన స్వామి జ్ఞానవాత్సల్య

ప్రసంగించకుండానే వెనుదిరిగిన స్వామి జ్ఞానవాత్సల్య

ఇక మోటివేషనల్ స్పీకర్ స్వామి జ్ఞానవాత్సల్య వేదికవద్దకు చేరుకున్నారు. మూడో వరుసలో మహిళలు కూర్చోవడాన్ని చూశారు. వెంటనే వారిని అక్కడి నుంచి ఖాలీ చేయించాల్సిందిగా కోరాడు. ఇక ఒక్కసారిగా మైకులో అనౌన్స్‌మెంట్ వచ్చింది. మహిళలు ముండు ఏడు వరసలు వదిలో ఆ వెనకాల నుంచి కూర్చోవాల్సిందిగా మైకులో చెప్పారు. అంతే మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు ఖాళీ చేయకపోవడంతో స్వామి జ్ఞానవాత్సల్య ప్రసంగించకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.

English summary
A motivational guru walked out of an event held in Jaipur's Birla Auditorium without delivering his speech after he spotted women seated in the front row of the audience.Swami Gyanvatsalya had told organisers to refrain from allowing women to sit in the first three rows at the auditorium for his programme, sources told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X