వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ... ప్రధాని మోడికి 600 మంది మేధావుల లేఖ

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీసుకురానున్న పౌరసత్వ సవరణ బిల్లుపై ఇప్పటికే ఇశాన్య రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు బిల్లును వెనక్కి తీసుకోవాలని దేశంలోని పలువురు రచయితలు, జడ్జీలు, మరియు ఇతర బ్యూరోక్రాట్స్ మొత్తం 600 మంది కేంద్రానికి లేఖ రాశారు. ఈ బిల్లు రాజ్యంగంలో పోందిపరిచిన లౌకిక విధానాలను ఉల్లంఘించడమేనని లేఖలో పేర్కోన్నారు.దీంతో పాటు భారత రిపబ్లిక్ యొక్క స్వభావాన్నే మారుస్తుందని రాజ్యంగా అందించిన సమాఖ్యా స్పూర్తికి విరుద్దంగా ఉందని తెలిపారు.

ముఖ్యంగా లేఖపై సంతకం చేసిన వారిలో రోమిల్లా థాపర్, రచయిత అమితవ్ ఘోష్, నటి నందితా దాస్, సిని నిర్మాత అపర్ణసేన్, మరియు అనంద్ పత్వార్‌దాన్, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్, హర్షమందర్ , అరుణ్ రాయ్, బెజ్‌వాడ విల్సన్, తోపాటు డిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టీస్ ఏపీ షా తో పాటు ఇతర మేధావులు కూడ ఉన్నారు. తామంతా సాంస్కృతిక మరియు విద్యా వర్గాలకు చెందిన వారమని ఈ బిల్లును విభజన , మరియు వివక్ష కారణంగా పూర్తిగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ బిల్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతున్నామని చెప్పారు.

Withdraw Citizenship Bill asked About 600 artists, writers, academicians

పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం రాత్రి లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కాగా దీన్ని రాజ్యసభలో కూడ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలోనే ప్రధానంగా కొన్ని వర్గాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో పలువురు మేధావులు ప్రధానికి లేఖ రాశారు. కాగా గతంలో కూడ కశ్మీర్‌లో ఆర్టికల్స్ రద్దును చేసిన సంధర్భంలో కూడ పలువురు మేధావులు ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే...

English summary
About 600 artists, writers, academicians, ex-judges and former bureaucrats asked the Narendra Modi-led government to withdraw the Citizenship (Amendment) Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X