వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐ మార్క్ లేని బాటిల్ విక్రయించారో.. ఇక అంతే.. కఠినచర్యలు తప్పవన్న పాశ్వాన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఐఎస్ఐ మార్క్ లేకుండా వాటర్ బాటిల్ అమ్మితే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు అన్ని షాపుల్లో నీళ్ల బాటిళ్ల ధర ఒకేలా ఉండాలని .. ధరలో మార్పు ఉండొద్దని స్పష్టంచేసింది. ప్రశ్నత్తరాల సమయంలో లోక్‌సభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సమాధానమిచ్చారు.

నేరమే ..?
ఐఎస్ఐ మార్క్ లేకుండా వాటర్ బాటిల్ అమ్మడం నేరమన్నారు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్. అలాగే అన్ని షాపుల్లో వాటర్ బాటిళ్ల ధరలో తేడా ఉండొద్దని నొక్కి వక్కానించారు. బాటిల్‌పై ముద్రించిన ధర కన్నా ఎక్కువ రేట్ వసూల్ చేస్తున్నారని వినియోగదారుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తాము దీనిపై ఒక అడ్వైజరీ కూడా పంపామని .. అయితే సేవారంగానికి చెందిన కొందరు కోర్టుకు వెళ్లారని వివరించారు.

without isi mark water bottle do not sale : paswan

ధరల్లో తేడా ఏంటీ ..?
హోటల్‌లో వాటర్ బాటిల్ ఒక ధర, బయట మరో ధరకు విక్రయిస్తున్నారని గుర్తుచేశారు. ఒకే వాటర్ బాటిల్ ధరలో మార్పు తప్పని .. దీనికి ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ఐఎస్ఐ మార్క్ లేకుండా వాటర్ బాటిల్ విక్రయిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు జరిపే అధికారం ఉంటుందని సూచించారు. ఐఎస్ఐ మార్క్ లేకుంటే ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని .. ఆయా విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఐఎస్ఐ మార్క్ లేని బాటిళ్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

English summary
The Center has warned that stringent action should be taken to sell water bottles without the ISI mark. And the price of all bottles of should be the same .. There is no change in the price. Asked by a member of the Lok Sabha during the questionnaire, Union Minister Ramvilas Paswan replied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X