వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్రీ యువతిపై రెండేళ్లుగా క్లాస్‌మెట్ రేప్, ఆరేళ్ల చిన్నారిపై 16 ఏళ్ల బాలుడి ఘోరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

woman allegedly raped by classmate
రాంపూర్: 20 ఏళ్ల యువతి పైన ఆమె క్లాస్‌మెట్ రెండేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాంపూర్‌లో జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె పైన నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

దీనికి సంబంధించి సోమవారం మహిళా పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. నిందితుడు ఇరవై రెండేళ్ల వ్యక్తి. బాధితురాలు చదివే డిగ్రీ కళాశాలలోనే యువకుడు కూడా చదువుతున్నాడు. బాధితురాలు రెండేళ్లుగా షాజహాన్‌పుర పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.

ఆ సమయంలో అతనితో యువతికి పరిచయం ఏర్పడింది. ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. అయితే, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమె పైన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనను పెళ్లి చేసుకోమని బాధితురాలు పలుమార్లు అతనిని అడిగింది. కానీ అతను నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

చిన్నారికి 16 ఏళ్ల బాలుడి లైంగిక వేధింపు

ఆరేళ్ల బాలికను పదహారేళ్ల బాలుడు లైంగిక వేధింపులకు గురి చేశాడు. నిందితుడు చిన్నారి పక్కింట్లోని బాలుడు. ఈ సంఘటన మోహు జిల్లాలో ఆదివారం సాయంత్రం చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు జరిగింది. ఏమీ తెలియని ఆ చిన్నారి.. తన తల్లితో ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో ఆ తర్వాత చెప్పడంతో, తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు.

వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని సోమవారం సాయంత్రం అతని బంధువుల ఇంటి నుండి ఆదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్లస్ టూ చదువుతున్నాడు. బాలుడిని, చిన్నారిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అనంతరం బాలుడిని జువైనల్ హౌస్‌కు తరలించారు.

English summary
A 20 year old girl has accused her classmate of raping her repeatedly over two years on the pretext of marriage, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X