వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెదిరించి బలవంతంగా పెళ్లి చేశారని యువతి ఫిర్యాదు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

మంగళూరు: తనను బెదిరించి ఓ సంస్థ కార్యకర్తతో పెళ్లి చేశారని ఓ యువతి ఆరోపిస్తున్నారు. మంగళూరుకుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ఎల్యార్పడవుకు చెందిన యువతి దళ్ కార్యకర్తను పెళ్లి చేసుకుంది. అయితే, ఆమె పలువురు కార్యకర్తల పైన అపహరణ కేసు పెట్టింది. పలువురి పైన ఆరోపణలు చేసింది.

తాను దళ్ కార్యకర్తను పెళ్లి చేసుకోవాలని బెదిరించారని ఫిర్యాదు చేసింది. ఆమె అక్టోబర్ 16వ తేదీన రాజేష్‌ను ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకుంది. తాజాగా మాత్రం ఆమె.. తనకు డ్రగ్స్ ఇచ్చి, బలవంతంగా అతనితో పెళ్లి చేశారని కొనేజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

తన సోదరి ఫేస్‌బుర్ ద్వారా రాజేష్ తనకు పరిచయమయ్యాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఓసారి డబ్బులు కావాలని అడిగాడని, అతనికి తాను ఆరువేల రూపాయలు ఇచ్చానని తెలిపింది. అనంతరం అతను మరొకరితో కలిసి ఓ ప్రాంతానికి తీసుకు వెళ్లారని తెలిపింది.

Woman alleges abduction, forcible marriage to Dal activist

అక్కడ మరో పదిమంది ఉన్నారని పేర్కొంది. రాజేష్‌ను పెళ్లి చేసుకోవాలని వారు బెదిరించారని, వారి ప్రతిపాదనను తాను తిరస్కరించడంతో.. తన తల్లిదండ్రులకు హాని చేస్తానని హెచ్చరించారని ఫిర్యాదులో పేర్కొంది.

మరుసటి రోజు తనను ఆర్య సమాజ్‌కు తీసుకు వెళ్లారని చెప్పింది. తాను పెళ్లి చేసుకోకుండా పోలీసులకు చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని కొందరు బెదిరించారని పేర్కొంది.

అక్టోబర్ 19వ తేదీన.. రాజేష్ బాత్ రూంలో ఉండగా తాను తప్పించుకొని వచ్చానని పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కొనేజ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. తాము కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
A woman from Elyarpadavu, about 15km from here, who had married a Dal activist, filed charges of abduction and attempt to outrage the modesty of a woman against several Dal activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X