• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాత్రి పబ్ కి వెళ్ళింది.. డ్రింక్ తాగింది.. ఆ తర్వాతే ఏదో జరిగింది?

By Ramesh Babu
|

బెంగళూరు: ఓ యువతి రాత్రి పబ్ కి వెళ్ళింది. అక్కడ ఓ డ్రింక్ తాగింది. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియదు. ఉదయం లేచి చూస్తే తన ఇంట్లో కాక వేరేవాళ్ళ ఇంట్లో ఉంది. రాత్రి ఎవరో ఇద్దరు యువకులు రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోతే.. జాలిపడి తన ఇంట్లోకి ఆ యువతిని తీసుకొచ్చినట్లు ఆ ఇంట్లోని వాళ్ళు చెప్పారు.

గుర్తు చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆ యువతికి ఇంకేమీ గుర్తు రావడం లేదు. ఒళ్ళు నొప్పులు, శరీరంపై అక్కడక్కడా ఉన్న గుర్తులు.. చూసుకుని తాను రేప్ కు గురైనట్లు అనిపించడంతో నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సినిమా కథను తలపిస్తున్న ఈ ఘటన నిజంగానే బెంగళూరులో జనవరి 13న జరిగింది. రెండ్రోజుల అనంతరం జనవరి 15న ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల కేసుగా నమోదు చేసుకుని రంగంలోకి దిగిన బాన్సవాడి పోలీసులు.. ఆర్ధరాత్రి ఆమెను నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిన ఇద్దరు యువకుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

Woman alleges molestation in Bengaluru, 2 arrested

చివరికి ఈ కేసులో రికీ, ఆయూబ్ అనే యువకులను అరెస్ట్ చేశారు. వీరిలో ఆయూబ్ యెమన్ దేశస్తుడు. పోలీసుల విచారణలో ఆ యువతిని తమ కారులో ఎక్కించుకున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.

అయితే దురుద్దేశంతో మాత్రం కాదని, పబ్ వద్ద రాత్రివేళ ఒంటరిగా కనిపించడంతో ఇంటివద్ద దింపాలన్న ఉద్దేశంతోనే ఆమెను తమ కారులో ఎక్కించుకున్నామని వారు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు,

కానీ మార్గం మధ్యలో ఆ యువతి పెద్దగా కేకలు పెట్టడంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని.. కమ్మనహళ్లి ప్రాంతంలో ఆమెను రోడ్డుపై వదిలేసి తమ దారిన తాము వెళ్లిపోయామని, ఇదే జరిగిందని ఆ యువకులు చెబుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం వారి మాటలు విశ్వసించడం లేదు.

ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా వారు ఆమెను లైంగికంగా వేధించి ఉంటారనే భావిస్తున్నారు. నిందితులు ఆ రోజు ఉపయోగించిన వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే సదరు యువతి ఆ రోజు రాత్రి పబ్ లో ఏం తాగింది? అది తాగాక జ్ఞాపక శక్తిని ఎందుకు కోల్పోయింది? ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానాలు తెలియాల్సి ఉంది.

English summary
The Bengaluru police arrested two men, including one Yemen national,over a complaint of sexual harassment by a woman. The Banaswadi police took up a case of molestation following the complaint on January 15. The woman's inability to recall what exactly happened on the night of the alleged crime is proving to be a challenge for the authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X