వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తోటి స్త్రీలను వ్యభిచారంలోకి దించుతున్న మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman arrested
న్యూఢిల్లీ: తమ దేశానికి చెందిన మహిళలను వ్యభిచారంలోకి దించుతున్న ఓ ఉగండా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారంలోకి దించడానికి బలవంతంగా ఐరనే అని మహిళ ముగ్గురు ఉగండా దేశమహిళల పాస్‌పోర్టులను లాక్కున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

ఐరెనేపై బలవంతపు వసూళ్లు, అనేైతికమైన మనుషల తరలింపు ఆరోపణలు కూడా వచ్చాయి. ఐరెనే బాయ్‌ఫ్రెండ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అతను కూడా ఈ వ్యభిచారం వ్యవహారంలో చేయి చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు.

ఉగండా మహిళ చేతిలో మోసపోయిన ముగ్గురు మహిళలు కూడా ప్రస్తుతం ప్రభుత్వ శరణాలయంలో ఉన్నారు. గుర్తింపు వ్యవహారం ముగిసే వరకు ఇక్కడే ఉండాలని పోలీసులు వారిని ఆదేశించారు. ముగ్గురు ఉగండా మహిళలు తనను సంప్రదించారని, సెక్స్, డ్రగ్ రాకెట్ బాధితులుగా తమను వారు చెప్పుకున్నారని, తన సహాయం కోరారని ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి చెప్పిన విషయం తెలిసిందే.

ఉగండా మహిళలకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. గత నెలలో ఆఫ్రికా జాతీయుల ఇళ్లపై తమ పార్టీకి చెందిన మంత్రి చేసిన దాడులు సమర్థనీయమేనని తేలిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అంటున్నారు.

English summary
A Ugandan woman was arrested in Delhi today for allegedly pushing women from her country into prostitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X