వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపిఎల్లో ఆడిస్తానని మహిళ టోకరా, ప్రకటనతో పోజులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Woman arrested for duping on pretext of IPL selection trials
తిరువనంతపురం: ఐపిఎల్ మ్యాచ్‌లో ఆడించేందుకు సెలక్షన్స్ చేస్తున్నామని బాలురను నమ్మించిన ఓ మహిళను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. 43 ఏళ్ల నజరత్ షహబుద్దీన్ అనే తిరువనంతపురంకు చెందిన మహిళను అలువా పోలీసులు అరెస్టు చేశారు.

బాలుర తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అరెస్టు చేసి జ్యూడిసియల్ కస్టడీకి పంపించినట్లు సోమవారం తెలిపారు. తిరువనంతపురంలోని ఎస్ఎహ్ఏ క్లబ్‌కు ఆమె అధ్యక్షురాలిగా, ఆమె సోదరుడు సెక్రటరీగా ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. పదిహేడేళ్ల బాలురను పదమూడు మందిని సెలక్ట్ చేశారు.

ఈ నెల తర్వాత సెలక్ట్ అయిన బాలురను జైపూర్ తీసుకు వెళ్లి ఆడిస్తామని తల్లిదండ్రులకు చెప్పారు. అప్పుడు వారి ప్రదర్శన ఆధారంగా నేషనల్ టి 20 టీంకు సెలక్ట్ అవుతారని చెప్పారు. జైపూర్ తీసుకు వెళ్లేందుకు ఒక్కో విద్యార్థికి రూ.25,000ల చొప్పున ఇవ్వాలని నజరత్ వారికి చెప్పింది.

వెళ్లి వచ్చేందుకు రవాణా ఖర్చులు, తిండి, బ్యాటు, జెర్సీలకు ఆ మొత్తం అవుతాయని తెలిపింది. ఇందులో ఏదో ఉందని భావించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితురాలి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. జైపూర్‌లోని జాతీయ టీ 20 క్రికెట్ ఫెడరేషన్‌కు తాను సమన్వయకర్తనంటూ పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చింది. కాగా, ఆమెను కక్కనాడ్ జైలుకు తరలించారు.

English summary
A 43 year old woman has been arrested for fraud after she allegedly conducted selection trials for boys by falsely promising them IPL berths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X