వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ రౌడీ: తప్పు ఆమెదే.. అయినప్పటికీ ఇలా ఐరన్ రాడ్‌తో దాడి చేసింది

|
Google Oneindia TeluguNews

మొహాలీ: చండీగడ్‌లో రెండు కార్లు ఢీకొట్టడంతో అందులోని ఓ కారులో ఉన్న యువతి మరో వ్యక్తిపై ఐరన్ రాడ్‌తో దాడి చేసింది. అందరూ చూస్తుండగానే ఆమె తన కారులోనుంచి బయటకు దిగి ఆ వ్యక్తిపై ఇనుప రాడుతో దాడి చేసింది. దాడి చేసిన మహిళను శీతల్ శర్మగా గుర్తించగా.. బాధితుడిని నితీష్ కుమార్‌గా గుర్తించారు. శీతల్ దాడికి పాల్పడటంతో నితీష్‌ చేతులకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.

ప్రాథమిక విచారణ ప్రకారం శీతల్‌దే తప్పు అని పోలీసులు నిర్థారించారు. తప్పు ఆమె వైపు ఉండి కూడా నితీష్ కుమార్‌పై దాడి చేసిందని పోలీసులు వెల్లడించారు. శీతల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శాంట్రో కారులో నితీష్ కుమార్ పీజీఐ నుంచి బల్టానాలో తమ బంధువులను డ్రాప్ చేసేందుకు బయలుదేరాడు. కారులో ఇద్దరు మహిళలు నలుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. శీతల్ ఎస్ఎక్స్4లో అదే మార్గంలో ఎదురుగా వచ్చింది. ఆమెతో పాటు ఆమె బంధువు ఒకరు ఉన్నారు.

woman attacker

శీతల్ తన కారును రివర్స్ చేసుకుంటుండగా నితీష్ కారు వెనక నుంచి ఢీకొంది. అయితే వాస్తవానికి శీతల్ కారు రాంగ్ సైడ్‌లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. నితీష్ కుమార్ కారు ఢీకొట్టగానే రాంగ్ సైడ్ ఉన్న శీతల్‌ను మందలించాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహం తెచ్చుకున్న శీతల్ తన కారులో నుంచి ఐరన్ రాడ్ బయటకు తీసి నితీష్ పై దాడి చేసింది. గొడవ పెద్దదిగా మారుతుండటంతో అక్కడి స్థానికుడు పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా తాను చేసిని పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అయితే ప్రత్యక్ష సాక్షులు మాత్రం శీతల్‌దే తప్పు అని చెప్పారు.

English summary
A Mohali woman was arrested Tuesday for allegedly attacking a 29-year-old man with an iron rod after they entered into an argument following a collision between their cars in Chandigarh.The woman, identified as Sheetal Sharma (25) of Phase-10, attacked Nitish Kumar. He was taken to GMCH 32 and Nitish’s medical examination confirmed severe injuries on his hands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X