స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
వావివరస లేదు. స్నేహితుడి తల్లిపై కన్నేశాడు. సమయం చూసి కోరిక తీర్చాలని అడిగాడు. ఆమె అంగీకరించలేదు. ఇంకేముంది దాడి చేశాడు. అరవడంతో బయపడి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమె చనిపోయింది. ఈ దారుణమైన ఘటన చత్తీస్ గఢ్‌లో జరిగింది. నిందితుడు చింటుపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్నేహితుడి తల్లిపై కన్ను
ఛత్తీస్ గఢ్‌లో దారుణం జరిగింది. మహాసముండ్ జిల్లా బాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామంలో చింతామణి పటేల్ అలియాస్ చింటూ ఉన్నాడు. అతనికి స్నేహితుడు కూడా ఉన్నాడు. అయితే రాత్రి అతనికి ఇంటికెళ్లాడు. ఫ్రెండ్ లేడని తెలుసుకున్నాడు. పొలంలో వరి కోసే యంత్రం చూసి వచ్చేందుకు తోడు కోసం వచ్చాడు. అయితే కుమారుడు లేడని.. తాను వస్తానని చెప్పడం ఆమె తప్పయిపోయింది. తోడు వెళ్లిన మహిళపై కన్నుపడింది. వచ్చే సమయంలో కోరిక తీర్చాలని అడగడం ప్రారంభించాడు.

బండరాయితో మోదీ
దీంతో ఆమె షాక్‌నకు గురయ్యింది. ప్రతిఘటించడంతో చింటూ పిచ్చివాడిలా ప్రవర్తించాడు. బండరాయితో మోదాడు. ఆమె కేకలు వేయడంతో.. చింటూ పారిపోయాడు. చుట్టుపక్కల వారు రాగా.. జరిగిన విషయం తెలిపింది. వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె కుమారుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు చింటునే అరెస్ట్ చేశారు

లైంగికదాడి యత్నం
స్నేహితుడి తల్లిపై లైంగికదాడికి దిగడం కలకలం రేపింది. సొంత కుమారుడిలా చూస్తే కోరిక తీర్చమని అనడంతో విస్తుపోయింది. వావి వరసలు మరచిపోయి.. ఇలా ప్రవర్తించడం ఏంటీ అనే ప్రశ్న తలెత్తుతోంది. స్నేహితుడి తల్లి అంటే తల్లితో సమానం అని అందరూ అంటున్నారు. కానీ చింటు ప్రవర్తన సరికాదని.. కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.