వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రైం సీరియల్ చూసి.. ప్రేమజంట ఘాతుకం, అరెస్ట్

|
Google Oneindia TeluguNews

జోధ్‌పూర్: ఇప్పటి వరకు సినిమాలే యువతపై ప్రభావం చూపుతున్నాయనుకుంటే.. ఇప్పుడు బుల్లితెరల్లో వచ్చే టీవీ సీరియళ్ల ప్రభావం కూడా బాగానే పడుతోంది. సీరియళ్లలో చూపించే మంచిని తీసుకోకుండా.. కుళ్లు, కుతంత్రాలనే నేర్చుకుంటున్న కొంతమంతి యువత తప్పుడు మార్గాల్లో వెళ్లి కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పూర్ణిషా(22), ఆమె ప్రియుడు మయాంక్ మెహతా పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనే నిర్ణయానికొచ్చారు. ఇక్కడికి వరకు బాగానే ఉన్నా.. వారు ఎంచుకున్న తప్పుడు మార్గమే వారిని జైలుపాలు జేసింది.

ఇంతకీ వారు ఏం చేశారంటే.. పూర్ణిషా తన బాబాయ్ కొడుకు యుగ్ బండారిని ప్రియుడు మయాంక్, అతని స్నేహితుడు సిందాల్‌తో కలిసి కిడ్నాప్ చేసింది. పిల్లాడిని విడిచిపెట్టాలంటే రూ. 50లక్షల డబ్బివ్వాలని డిమాండ్ చేసింది. దీంతో బండారి తండ్రి రితేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Woman, boyfriend kidnap 4-year-old cousin in Jodhpur

వెంటనే స్పందించిన పోలీసులు నాలుగు గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు.
వారెక్కడుంది పసిగట్టి పిల్లాడిని రక్షించారు. ఆ ప్రేమజంటను కటకటాల వెనక్కి నెట్టారు.

కాగా, 'పూర్ణిషా బాబాయ్ వ్యాపారవేత్త. ఆయనను బెదిరిస్తే కావాల్సినంత డబ్బిస్తాడని, వాటితో సెటిలై పోవచ్చని నిందితుల ప్లాన్. ఈ ప్లాన్‌కు స్పూర్తి మాత్రం టీవీలో ప్రసారమయ్యే ఓ క్రైం సీరియల్‌' అని తమ విచారణలో తేలిందని పోలీసులు వివరించారు.

వారు చూసిన ఆ సీరియల్‌లో బాలుడిని కిడ్నాప్ చేసిన వెంటనే.. భయపడిపోయిన పిల్లాడి తండ్రి డబ్బు ఇస్తాడట. ఇక్కడా అలానే జరుగుతుందని ఈ ప్రేమజంట అనుకుంది. అయితే, వారి కుట్ర బెడిసికొట్టడంతో జైలుపాలయ్యారు. సినిమాలు, సీరియళ్లలో ఎక్కువ మొత్తంలో చెడును చూపించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

English summary
Inspired by a TV crime serial, a woman along with her boyfriend Sunday kidnapped her 4-year-old cousin brother for ransom in a bid to lead lavish life here, said police which rescued the boy within hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X