అందమైన పక్కింటి ఆంటీతో జల్సాలు, ఎంతమందితో అక్రమ సంబంధం ? నిలబెట్టి 30 సార్లు, ఫినిష్ !
కొచ్చి/ కన్నూర్: పక్కింటి ఆంటీతో అక్రమ సంబంధం సాగించిన యువకుడు ఆమె మరి కొందరితో చనువుగా ఉండటం సహించలేక ఆమెను దారుణంగా హత్య చేశాడు. తనతో పాటు ఎంజాయ్ చేస్తున్న ఆంటీ మరో కొంత మందితో అక్రమ సంబంధం సాగిస్తోందని ఆ యువకుడు అనుమానం పెంచుకున్నాడు. అంతే ఆంటీని నిలబెట్టి నిలువునా 30 సార్లుకు పైగా పొడిచి దారుణంగా చంపేశాడు. ప్రియుడు శరీరం మొత్తం కత్లితో పొడవటంతో తీవ్రగాయాలైన షాజిలా (40) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన కేరలలోని కొల్లంలో జరిగింది.
ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!
అందమైన పక్కింటి ఆంటీ
కేరళలోని కాన్పూర్ లోని కుందార ప్రాంతంలోని షాజిలా (40) అనే మహిళ నివాసం ఉంటున్నారు. షాజిలా నివాసం ఉంటున్న ప్రాంతంలోనే అనీష్ కుట్టి (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. షాజిలాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పక్కింటిలో నివాసం ఉంటున్న షాజిలా అనే మహిళ మీద అనీష్ కుట్టి చాల కాలం నుంచి కన్ను పడింది.
ఆంటీని ముగ్గులోకి దింపిన కుట్టి
తనకంటే 10 ఏళ్ల పెద్దదైన పక్కింటి ఆంటీ షాజిలాను అనీష్ కుట్టి ముగ్గులోకి దింపాడు. షాజిలా ఇద్దరు పిల్లలు స్కూల్ కు వెలుతున్నారు. షాజిలాతో చనువుగా ఉంటున్న అనీష్ కుట్టి చివరికి ఆమెను లొంగదీసుకున్నాడు. పిల్లలు స్కూలుకు వెళ్లిన తరువాత షాజిలా ఇంటికి వెలుతున్న అనీష్ కుట్టి ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడు.
అనుమానం పెరిగింది
షాజిలా తనతో పాటు వేరే వ్యక్తులతో చనువుగా ఉంటుందని అనీష్ కుట్టి కొంత కాలంగా అనుమానం పెంచుకున్నాడు. షాజిలా తనతో తప్పా వేరే వ్యక్తులతో ఎంజాయ్ చెయ్యకూడదని నిర్ణయించాడు. ఇదే విషయంలో షాజిలా, అనీష్ కుట్టిల మద్య గొడవ జరిగిందని తెలిసింది. తాను నీతో తప్పా వేరే వ్యక్తలతో అక్రమ సంబంధం సాగించలేదని, ఎందుకు అనవసరంగా గొడవలు చేస్తావని, ఇలా చేస్తే మంచిదికాదని షాజిలా ఆమె ప్రియుడు అనీష్ కుట్టిని హెచ్చరించిందని సమాచారం.
నిలబెట్టి నిలువునా !
షాజిలా తన చిన్న కుమార్తెను స్కూల్ దగ్గరకు పిలుచుకుని వెళ్లి అక్కడ వదిలిపెట్టి తిరిగి ఇంటికి బయలుదేరింది. అనీష్ కుట్టి ప్రియురాలు ఇంటి సమీపంలోని రహదారిలో జోబులో కత్తి పెట్టుకుని బైక్ మీద వేచి చూస్తున్నాడు. అదే సమయంలో షాజిలా అక్కడికి వచ్చింది. ఆ సమయంలో షాజిలా, అనీష్ కుట్టిల మద్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో సహనం కొల్పోయిన అనీష్ కుట్టి ప్రియురాలు షాజిలాను నిలబెట్టి జోబులో ఉన్ప కత్తితీసుకుని ఆమె ఎద. ఛాతీ, మెడ, కాళ్లు, చేతులు, కడుపుతో పాటు శరీరంలో గ్యాప్ లేకుండా ఇష్టం వచ్చినట్లు 30 చోట్లకు పైగా కసితీరా పొడిచేశాడు.
రిలాక్స్ గా కత్తి కడిగాడు
ప్రియురాలు షాజిలా మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో ఆమె అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది షాజిలాను హత్య చేసే సమయంలో అనీష్ కుట్టిని భయంతో ఒక్కరూ అడ్డుకోలేదు. తరువాత విషయం గుర్తించిన స్థానికులు కుందార పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో షాజిలా ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న అనీష్ కుట్టి ఎదురింటిలోకి వెళ్లి అక్కడ నివాసం ఉంటున్న వారిని బెదిరించి ప్రియురాలిని హత్య చెయ్యడానికి ఉపయోగించిన కత్తి శుభ్రం చేశాడు.
ప్రియురాలి మీద పగ ప్రతీకారం
సంఘటనా స్థానికి చేరుకున్న పోలీసులు ప్రియురాలు షాజిలాను దారుణంగా హత్య చేసిన అనీష్ కుట్టిని అక్కడే అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కారణంగా ఇద్దరి మద్య మాటామాటా పెరిగిందని, ప్రియురాలు మరో కొందరితో అక్రమ సంబంధం సాగిస్తుందని అనీష్ కుట్టికి అనుమానం ఉందని కుందార పోలీస్ స్టేషన్ సీఐ రమేష్ కుమార్ అన్నారు. ప్రియురాలు షాజిలా మీద పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమెను పట్టపగలు అందరూ చూస్తున్న సమయంలో నడిరోడ్డులో దారుణంగా హత్య చేశాడని, అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కుందార పోలీస్ స్టేషన్ సీఐ రమేష్ కుమార్ మీడియాకు చెప్పారు.