వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళ కానిస్టేబుల్ లింగమార్పిడికి ఓకే: 2019లోనే దరఖాస్తు.. చివరికీ పర్మిషన్.. ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

లింగ మార్పిడి ఇప్పుడు సహజమే అయిపోయింది. ఎందుకంటే జన్యు లోపం వల్ల.. స్త్రీలు పురుషులుగా- పురుషులు స్త్రీలుగా మారే అవకాశం ఉంటుంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకొని.. సర్జరీ చేయించుకుంటే బెటర్. కానీ భారతీయ సంప్రదాయంలో మాత్రం కాస్త విరుద్దం. ఆచారాలు, సాంప్రదాయాలు అంటూ వారిపై ఒత్తిడి ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో అయితే అలా ఏమీ ఉండదు. అనుకున్నారో ఆపరేషన్ చేయించుకొని.. తమకు నచ్చినట్టు జీవిస్తారు. ఇప్పుడిప్పుడు దేశంలో కూడా కాస్త అవగాహన వస్తోంది.

కానిస్టేబుల్ లింగ మార్పిడి

కానిస్టేబుల్ లింగ మార్పిడి

ఇక విషయానికి వస్తే.. ఇక్కడ జనరల్ పీపుల్ వేరు.. కానీ ఓ కానిస్టేబుల్ లింగ మార్పిడి చేయించుకోవాలని అనుకుంది. అదే వార్త.. దానికి సంబంధించి పై అధికారులకు దరఖాస్తు చేసుకుంది. ఎట్టకేలకు రెండేళ్లకు దానికి సంబంధించి అనుమతి లభించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళా పోలీసు.. పురుషుడిగా లింగ మార్పిడి చేసుకునేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. ప్రభుత్వానికి ఆమె దరఖాస్తు చేసుకోగా.. ఆమె అభ్యర్థనను పరిశీలించి లింగ మార్పిడి చేసుకోవడానికి అనుమతించింది.

హోంశాఖ అనుమతి

హోంశాఖ అనుమతి

ఆ మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడి చేసుకునేందుకు రాష్ట్ర హోంశాఖ నుంచి అనుమతులు వచ్చాయపి అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ రాజేష్ రాజోరా వెల్లడించారు. మహిళ నుంచి పురుషుడిగా మారేందుకు ప్రభుత్వం అనుమతించటం రాష్ట్రంలో ఇదే తొలిసారి అనే సంగతి తెలిసిందే. అయితే ఆమె చిన్నతనం నుంచే పురుష లక్షణాలను కలిగి ఉంది. ఈ మేరకు సైకాలజిస్టులు వివరించారు. దీంతో ఆమె లింగ మార్పిడి చేసుకోవాలని అనుకుంది. హోంశాఖను కోరగా.. కాస్త ఆలస్యం అయినా పర్మిషన్ ఇచ్చింది.

2019లో దరఖాస్తు

2019లో దరఖాస్తు

లింగ మార్పిడికి అనుమతి కోసం ఆ మహిళా కానిస్టేబుల్​ 2019లో పోలీస్​ హెడ్​క్వార్టర్స్​కు దరఖాస్తు చేసింది. ఆ తర్వాత అఫిడవిట్ ఆమె అభ్యర్థనను​ దాఖలు చేసినట్లు చెప్పారు రాజేశ్​ రాజోరా. ఆ దరఖాస్తును రాష్ట్ర హోంశాఖకు పోలీసు హెడ్​క్వార్టర్​ పంపించినట్లు తెలిపారు. అన్నీ అంశాలను పరిశీలించారు. నిబంధనల ప్రకారం భారత పౌరులు తమ కులం, మతానికి సంబంధం లేకుండా తమ సెక్స్​ను ఎంపిక చేసుకోవచ్చన్నారు. అలా మహిళ కానిస్టేబుల్‌కు అవకాశం లభించింది. అందుకు లోబడే లింగ మార్పిడికి పర్మిషన్ ఇచ్చామని రాజేష్ రాజోరా వివరించారు.

English summary
woman constable in Madhya Pradesh has been allowed to undergo a sex reassignment surgery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X