వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మగవారిని తీసుకొచ్చిన కూతురు: వద్దన్న మారు తండ్రిపై తల్లితో కలిసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

థానే: మాజీ ప్రియుడిని కాల్చి హత్య చేసేందుకు ప్రయత్నించిన ప్రియురాలు, ఆమె కూతురుకు థానేలోని స్థానిక కోర్టు బుధవారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. థానేకు చెందిన వాడా తాలుకాకు చెందిన సుమన్ కిషన్ వా (43), ఆమె కూతురు చిమి దిలీప్ తుమ్డే (29)లకు అడిషనల్ సెషన్స్ జడ్జి ఈ శిక్ష విధించారు.

వారికి చెరో ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించారు. హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద వారి పైన కేసు నమోదయింది. వారిని నేరస్తులుగా కోర్టు ప్రకటించింది.

కిషన్ నానా వా (48) తన మొదటి భార్య మృతి అనంతరం సుమన్ కిషన్ వాను వివాహం చేసుకున్నాడు. సుమన్ కూతురు చిమితో పాటు వీరు హామ్లెట్‌లో ఉండేవారు. కొద్ది రోజులకు చిమికి భీవండికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొద్ది రోజులకు ఆమె భర్త ఆమెను వదిలేశాడు.

Woman, daughter get 3-yr RI for trying to kill husband

దీంతో ఆమె కిషన్ నానా వా, సుమన్ కిషన్ వాతో కలిసి జీవించేది. విచారణలో తేలిన వివరాల మేరకు.. కూతురు చిమి తరుచూ తన ఇంటికి యువకులను తీసుకు వచ్చేది. దీనిని ఆమె మారు తండ్రి కిషన్ నానా వా వద్దనేవారు. అయితే, కిషన్ చేస్తున్న ఆరోపణలను సుమన్ కిషన్ వా, ఆమె కూతురు చిమి ఖండించారు.

ఈ నేపథ్యంలో నవంబర్ 7, 2013వ తేదీన కిషన్ ఇంట్లో ఉన్నాడు ఆ సమయంలో కూతురు, భార్య ఇద్దరు కలిసి అతని పైన కిరోసిన్ పోశారు.

అనంతరం అతనికి నిప్పు అంటించే ప్రయత్నాలు చేశారు. అనంతరం వారు అక్కడి నుండి పారిపోయారు. బాధితుడు గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సహాయంతో అతను ఆసుపత్రిలో చేరాడు. తనను చంపే ప్రయత్నం చేశారని భార్య, మారు కూతురు పైన అతని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

English summary
A woman and her daughter were today sentenced to three-year rigorous imprisonment by a local court for trying to burn alive the former's husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X