వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్ల ముందే చనిపోయిన తల్లి... గుక్కపెట్టి ఏడుస్తూ ఏడాది బాలుడు.. హృదయ విదారకంగా..

|
Google Oneindia TeluguNews

జమ్మూకశ్మీర్‌లోని సోపూర్‌లో బుధవారం(జూలై 1) తన కళ్ల ముందే కాల్పులకు గురై చనిపోయిన తాతను చూసి మూడేళ్ల బాలుడు ఎంతలా రోధించాడో చూశాం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ దృశ్యాలు చాలామంది మనసులను కలచివేశాయి. తాజాగా ఇలాంటిదే మరో ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. తన కళ్ల ముందే చనిపోయిన తల్లిని,అక్కలను చూసి ఏడాది వయసున్న చిన్నారి భోరుమంటూ విలపించాడు. రాత్రి పూట... అది కూడా రైల్వే ట్రాక్‌పై ఆ చిన్నారి ఏడుపు చాలాసేపు అరణ్య రోదనే అయింది. ఎట్టకేలకు పోలీస్ అధికారులు అక్కడికి చేరుకుని చిన్నారిని రక్షించారు.

తెల్లవారుజామున...

తెల్లవారుజామున...

బుధవారం తెల్లవారుజామున 3.40గంటలకు ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడింది. గుర్తు తెలియని రైలు వారి పైనుంచి వెళ్లడంతో శరీర భాగాలు తెగిపోయి కనిపించాయి. ఆ మృతదేహాల పక్కనే ఏడాది వయసున్న బాలుడు గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించాడు. ఘటనపై ఎవరో మందవళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు అక్కడికి చేరుకున్నారు.

రైలు ఢీకొట్టడంతోనే...

రైలు ఢీకొట్టడంతోనే...


పోలీసులు అక్కడికి చేరుకునేసరికి... ఓ మహిళ,ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. రైలు ఢీకొట్టడంతో చనిపోయినట్లు నిర్దారించారు. ఆ పక్కనే ఏడుస్తూ ఉన్న ఏడాది బాలుడిని దగ్గరకు తీసుకుని ఏడవద్దని బుజ్జగించారు. దీనికి సంబంధించి వెలుగుచూసిన ఓ వీడియోలో... 'ఆ చిన్నోడు ఓకెనా... అతనికేమైనా అయిందా... ఏమైనా జరిగిందేమోనని భయపడ్డాను.' అంటూ ఓ పోలీస్ అధికారి అన్న మాటలు వినిపించాయి.

భర్తతో విబేధాలే కారణం...

భర్తతో విబేధాలే కారణం...


అనంతరం ఆ చిన్నారిని పోలీసులు ఓ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎలాంటి సమస్య లేదని చెప్పారు. మృతురాలిని కిరణ్‌గా గుర్తించామన్నారు. మందవళిలో నివసించే ఆమె... భర్తతో విబేధాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. ఆమెతో పాటు ఐదు,ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు కూడా మృతి చెందినట్లు చెప్పారు. ఆమె భర్త రిక్షా నడుపుతుంటాడని... బుధవారం సాయంత్రం అతను ఇంటికొచ్చేసరికి భార్యా,పిల్లలు కనిపించలేదని చెప్పారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.

Recommended Video

Privatise Railways: Modi Govt Invites Private Players to Run 151 Passenger Trains || Oneindia Telugu
జమ్మూలోనూ ఇలాంటి ఘటన...

జమ్మూలోనూ ఇలాంటి ఘటన...


జమ్ముకశ్మీర్‌లోని సోపూర్‌లో బుధవారం ఇలాంటి తరహా ఘటనే ఒకటి చోటు చేసుకుంది. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పుల్లో.. దారి వెంబడి తన మనువడితో కలిసి వెళ్తున్న ఓ వృద్దుడు మృతి చెందాడు. అతని శరీరంలోకి రెండు బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. తాత రోడ్డుపై కుప్పకూలడంతో ఆ బాలుడు బోరున విలపించాడు. తాతా లే... లే తాతా... అంటూ అతను ఏడవటం చాలామంది మనసులను కలచివేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

English summary
A woman and her two daughters were found dead on Thursday on train tracks in Delhi by some officers of the Railway Police Force (RPF), who were stunned to find a one-year-old baby alive near the chopped bodies. The infant escaped the accident that killed his mother and two sisters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X