వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండిగో విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి .. బుడతడికి ఘన స్వాగతంతో పాటు బంపర్ ఆఫర్

|
Google Oneindia TeluguNews

విమానంలో ఒక మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది . ఢిల్లీ నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఒక మహిళా ప్రయాణీకురాలికి సడన్ గా నొప్పులు రాగా ఆమె విమానంలోనే ఒక పసికందును ప్రసవించింది. బుధవారం సాయంత్రం, రాత్రి 7.40 గంటలకు, 6ఈ 122 విమానంలో శిశువు అకాల ప్రసవం జరిగింది. శిశువు మరియు తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని విమానయాన సంస్థలు నిర్ధారించాయి.

ఢిల్లీ నుండి బెంగళూరు విమానంలో ప్రసవించిన తల్లి .. నెలలు నిండక ముందే

ఢిల్లీ నుండి బెంగళూరు విమానంలో ప్రసవించిన తల్లి .. నెలలు నిండక ముందే

6ఈ 122 ఢిల్లీ నుండి బెంగళూరు విమానంలో ఒక మగపిల్లవాడు జన్మించాడని , ఒక పసికందు అకాల ప్రసవం జరిగిందని మేము ధృవీకరిస్తున్నామని ఇండిగో విమానయాన సంస్థ ధృవీకరించింది . అయితే గర్భిణీ మహిళకు ఇంకా డెలివరీ టైం కాదని , మహిళకు ఇంకా 32 వారాలు కాలేదని, అందుకే విమానయాన సంస్థలు ఆమె ప్రయాణానికి అనుమతించాయని చెప్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే ఆమెకు నొప్పులు రాగా విమానంలోనే డెలివరీ చేశారు .

 సహకరించిన సిబ్బంది, డెలివరీ చేసి విమానంలో ప్రయాణిస్తున్న గైనకాలజిస్ట్

సహకరించిన సిబ్బంది, డెలివరీ చేసి విమానంలో ప్రయాణిస్తున్న గైనకాలజిస్ట్

విమానంలో ఉన్న ఒక సీనియర్ గైనకాలజిస్ట్ ఆమె డెలివరీకి సహాయం చేశారని ,విమానంలోని ప్రయాణీకులు కూడా అందరూ ఆమె డెలివరీకి నిశ్శబ్దంగా ఉంటూ సహకరించారని పేర్కొంటున్నారు . శిశువు మరియు తల్లికి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తరువాత విమానయాన సిబ్బంది మరియు గ్రౌండ్ సిబ్బంది ఆత్మీయ స్వాగతం పలికారు. ‘వెల్‌కమ్ టు మన బెంగళూరు' పోస్టర్‌లనుపట్టుకుని సిబ్బంది చప్పట్లు కొడుతుండగా తల్లి, బిడ్డలను వీల్‌చైర్‌లో అంబులెన్స్‌ ద్వారా ఆసుపత్రికి తరలించారు .

శిశువు జననం సంతోషం అని ట్వీట్ చేసిన ఇండిగో కెప్టైన్ .. బుడతడికి బంపర్ ఆఫర్

శిశువు జననం సంతోషం అని ట్వీట్ చేసిన ఇండిగో కెప్టైన్ .. బుడతడికి బంపర్ ఆఫర్

ఇండిగో విమానంలో మహిళ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని కెప్టెన్ క్రిష్టోఫర్ ట్వీట్ వేదికగా పంచుకున్నారు. అయితే తల్లీ బిడ్డలకు విమాన సిబ్బంది సేవలందించారని, తమ విమానంలో మహిళ బిడ్డకు జన్మనివ్వడం తమకు గర్వకారణమని కెప్టెన్ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో జన్మించిన బిడ్డకు కూడా జీవితకాలంపాటు ఉచిత విమాన టికెట్‌ ను ప్రకటించినట్లు తెలుస్తుంది. దీంతో పుట్టీ పుట్టగానే బుడతడు బంపర్ ఆఫర్ కొట్టేశాడని అంతా చర్చించుకుంటున్నారు .

Recommended Video

NASA Launches Kalpana Chawla Cargo Spacecraft to Space Station అంతరిక్షంలో ముల్లంగి పెంపకం...!!
గతంలోనూ విమానాల్లో పుట్టిన శిశువులకు జీవితకాల ఉచిత టికెట్లు

గతంలోనూ విమానాల్లో పుట్టిన శిశువులకు జీవితకాల ఉచిత టికెట్లు

ఇండిగో విమానంలో పుట్టిన పసికందుకు జీవితకాల ఉచిత టికెట్ పై సోషల్ మీడియా వినియోగదారులు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు . గతంలో రెండు సందర్భాలలో విమానంలో ప్రసవించిన శిశువుకు జీవితకాల టిక్కెట్లు ఇచ్చిన విమానయాన సంస్థలు ఉన్నాయి. 2017 లో, జెట్ ఎయిర్‌వేస్ సౌదీ అరేబియా , భారతదేశం మధ్య తమ సంస్థ విమాన ప్రయాణంలో జన్మించిన బాలుడికి జీవితాంతం ఉచిత విమాన టిక్కెట్లను ఇచ్చింది. బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏషియా, 2009 లో, ఒక మలేషియా తల్లి కి, ఆమె నవజాత శిశువుకు కూడా ఇచ్చింది. జీవితాంతం తమ సంస్థ విమానాల్లో ఉచిత రవాణా పొందే అవకాశం కల్పించింది .

English summary
A woman in the flight gave birth to a premature male child. A female passenger on an Indigo flight from Delhi to Bangalore suddenly gave birth to a baby boy . Indigo Airlines gave a warm welcome to the newborn baby along with the mother at the airport and a bumper offer to the newborn.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X