వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవల పిల్లలకు జన్మనిచ్చిన తల్లి వక్షోజాల నుంచి వెరైటీ రుచుల్లో పాలు:స్పిరిచ్యువల్ గురు జగ్గీ వాసుదేవ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని భుజ్‌లో శ్రీ సహజానంద బాలికల కళాశాల యాజమాన్యం విద్యార్థినుల లోదుస్తులను విప్పించిన ఘటనను సమర్థిస్తూ స్వామిజీ కృష్ణస్వరూప్ దాస్‌జీ చేసిన వ్యాఖ్యల తాలూకు దుమారం తగ్గట్లేద. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడిప్పుడే వివాదాలు ముసురుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయన చేసిన కామెంట్ల పట్ల స్పందిస్తున్నారు. రుతుస్రావం రోజుల్లో వంట వండే మహిళలు మరుజన్మలో కుక్కలుగా పుడతారంటూ కృష్ణస్వరూప్ దాస్‌జీ చేసిన కామెంట్లపై ఒకవంక వివాదం చెలరేగుతున్న కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో..ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సద్గురు జగ్గీ వాసుదేవ్ పేరు కూడా బయటికి వచ్చింది.

 పలు అంశాలపై శాస్త్రీయ బద్ధంగా..

పలు అంశాలపై శాస్త్రీయ బద్ధంగా..

ఇదివరకు జగ్గీ వాసుదేవ్ కూడా ఇలాంటి వ్యాఖ్యానాలే చేశారనే వార్తలు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. జగ్గీ వాసుదేవ్ ఓ అడుగు ముందుకేసి మరీ.. గర్భధారణ, మహిళల వక్షోజాలు, గర్భధారణ సమయం గురించి తనదైన శైలిలో ప్రవచించారని అంటున్నారు. మాతృత్వం, గర్భధారణ, గ్రహణ కాలంలో వంట వడటం, బ్రహ్మముహూర్తంలో యోగ సాధన వంటి అంశాలను స్పృశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా విమర్శకుల నోళ్లకు పని పెట్టినట్టయింది.

 వక్షోజాల నుంచి వేర్వేరు రుచుల్లో..

వక్షోజాల నుంచి వేర్వేరు రుచుల్లో..

2018లో సంభవించిన సూర్యగ్రహణం సందర్భంగా జగ్గీ వాసుదేవ్ ఈ వ్యాఖ్యలు చేశారట. కవలలకు జన్మనిచ్చిన మహిళల వక్షోజాల నుంచి వేర్వేరు రుచుల్లో పాలు ఉత్పత్తి అవుతాయని జగ్గీ వాసుదేవ్ చెప్పుకొచ్చారు. ఒకవైపు వక్షోజం ఒకరకమైన రుచి గల పాలను ఉత్పత్తి చేయగా.. మరో వక్షోజం ఇంకో రుచి గల పాలను బిడ్డకు అందిస్తాయని అన్నారు. దీనిపై శాస్త్రీయబద్ధంగా ఇది నిరూపితమైందని చెప్పారు. తల్లిపాలు బిడ్డకు అత్యంత శ్రేయస్కరమని అన్నారు.

గ్రహణం పట్టు, విడుపుల సమయంలో వంట.. విషపూరితం..

గ్రహణం పట్టు, విడుపుల సమయంలో వంట.. విషపూరితం..

గ్రహణ కాలంలో మహిళలు ఎంత రుచిగా వంట వండినప్పటికీ.. అది విషపూరితమౌతుందని అన్నారు. గ్రహణం పట్టు, విడుపుల సమయంలో వంట వండటం అత్యంత ప్రమాదకర సంకేతామని, దశలవారీగా దాని రుచి తగ్గుతూ విషపూరితమౌతుందని చెప్పారు. సాధారణ రోజుల్లో కంటే అత్యంత వేగంగా ఆ పదార్థం చెడిపోతుందని అన్నారు. అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోకూడదనే విషయాన్ని పురాణాలు చెబుతున్నాయని చెప్పారు.

గోవులు కన్నీరు పెడుతాయంటూ..

గోవులు కన్నీరు పెడుతాయంటూ..


కుటుంబ యజమాని మరణిస్తే.. గోవులు కన్నీరు కారుస్తాయని, దీన్ని తాను ప్రత్యక్షంగా చూశానని వాసుదేవ్ చెప్పారు. మనుషుల తరహాలోనే గోవులకు కూడా భావోద్వేగాలు ఉంటాయని అన్నారు. మనుషులు ఎలా ప్రవర్తిస్తే.. అలా నడచుకునే శరీరతత్వం వాటికి ఉంటుందని జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. ఇతర మూగజీవాలతో పోల్చుకుంటే.. ఆ లక్షణం ఒక్క గోవులోనే అధిక మోతాదులో ఉంటుందని చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై హేతువాదులు మండిపడుతున్నారు.

English summary
Consider his latest comment, for example. Sadhguru Jaggi Vasudev, while speaking on pregnancy and motherhood, said that after a woman delivers twins, one of her breasts will produce a particular type of milk and the other breast will produce another variety. The spiritual leader had also opined ahead of the solar eclipse in 2018 that cooked food goes through "phases of its deterioration" before and after an eclipse. Similarly, Sadhguru had once dispensed his school of thought on time and the internet found it rather outlandish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X