వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. డెలివరీ సమయంలో కడుపులో గుడ్డ ముక్క మరిచిపోయిన వైద్యులు

|
Google Oneindia TeluguNews

వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఓ మహిళకు డెలివరీ చేసిన వైద్యులు.. ఆమె పొత్తికడుపులో హ్యాండ్ కర్చీఫ్ సైజు గుడ్డ ముక్కను మరిచిపోయారు. దీంతో ఐదు రోజుల తర్వాత ఆ మహిళ మృతి చెందింది. తన భార్య మృతికి వైద్యులే కారణమంటూ ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. నిర్లక్ష్యంతో తన భార్యను పొట్టనపెట్టుకున్న వైద్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు.

ఇంతకీ ఏం జరిగింది..

ఇంతకీ ఏం జరిగింది..

తమిళనాడు కద్దలూరులోని విరుదాచలం ప్రభుత్వాసుపత్రిలో డిసెంబర్ 27న ప్రియ(24) ఒక బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. డెలివరీ తర్వాత మూడు రోజుల పాటు వాంతులు చేసుకున్న ప్రియ.. అసలేమీ తినలేదు. అంతేకాదు కడుపులో తీవ్రమైన నొప్పి వస్తోందని చెప్పింది. ఇక డిసెంబర్ 31 రోజు ప్రియ ప్రవర్తన వింతగా మారిపోయింది. ఒక్క తన భర్తను తప్ప తనవాళ్లెవరినీ గుర్తించలేకపోయింది. పుట్టిన పాపపై కూడా ఆమెకు ధ్యాస లేదు.

పుదుచ్చేరి JIPMER ఆసుపత్రికి తరలింపు..:

పుదుచ్చేరి JIPMER ఆసుపత్రికి తరలింపు..:

ప్రియ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో భర్త ఆమెను పుదుచ్చేరిలోని JIPMER ఆసుపత్రికి తరలించారు. జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 3గంటలకు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ప్రియ పరిస్థితి విషమంగా ఉందని,తమ ప్రయత్నం తాము చేస్తామని వైద్యులు తెలిపారు. అనంతరం ప్రియకు సర్జరీ నిర్వహించారు. సర్జరీ తర్వాత ప్రియ భర్తతో మాట్లాడిన డాక్టర్.. ఆమెకు డెలివరీ చేసిన వైద్యుడి గురించి అడిగారు.

కడుపులో గుడ్డ ముక్క :

కడుపులో గుడ్డ ముక్క :


జనవరి 1,రాత్రి 8గంటలకు ప్రియ మృతి చెందింది. ప్రియ కడుపులో హ్యాండ్ కర్చీఫ్ సైజు గుడ్డ ముక్క ఉన్నట్టు గుర్తించామని వైద్యులు చెప్పారు. దానివల్లే ప్రియ తీవ్రమైన నొప్పితో బాధపడి చనిపోయిందన్నారు. ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన బేబీలను తుడిచేందుకు వాడే గుడ్డ ముక్కను ప్రియ కడుపులో వైద్యులు మరిచిపోయినట్టు చెప్పారు. దీనిపై కోర్టుకు వెళ్తే.. ప్రియ భర్త తరుపున తాము అండగా నిలబడుతామని JIPMER వైద్యులు అన్నారు.

విచారణకు ఆదేశించిన ఆరోగ్య శాఖ :

విచారణకు ఆదేశించిన ఆరోగ్య శాఖ :

ప్రభుత్వాసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసి తన భార్య మృతికి కారణమయ్యారని ఆరోపిస్తూ ప్రియ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆరోగ్యశాఖ కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది. JIPMER ఆసుపత్రిలో నిర్వహించిన టెస్టులకు సంబంధించి రిపోర్టులు సమర్పించాలని కోరింది. ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రియ మృతి చెందిందా.. లేక JIPMERలో సర్జరీ ఫెయిల్ అవడం వల్లే మృతి చెందిందా అన్న తేల్చేందుకు దీనిపై ఓ అంతర్గత విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది.

English summary
On January 1, five days after giving birth to a girl at the Virudhachalam Government Hospital in Cuddalore, 24-year-old Priya passed away while undergoing treatment at the JIPMER Hospital in Puducherry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X